Monday, 26 February 2024

పంచ పాత్ర :

 


👉  పంచపాత్ర అంటే ఒక పాత్ర కాదు. ఆరాధనకు అయిదు పాత్రల్లో శుద్ధోదకం ఉండాలి. మనం ఒక పాత్రలోనే అన్నీ ఉంచి మమ అనేస్తున్నాము.

మొదటిది అర్ఘ్య పాత్ర:

👉 భగవంతుని చేతులు కడిగేందుకు సమర్పించే శుద్ధ జలాలతో కూడిన పాత్ర

రెండవది పాద్య పాత్ర:

👉  ఇది భగవంతునికి పాదాలను శుభ్రపరిచేందుకు సమర్పించేందుకు శుద్ధ జలాలతో కూడిన పాత్ర

మూడవ పాత్ర:

మూడవది ఆచమనీయ పాత్ర: 

👉  ఇది భగవంతుని కి పుక్కిలించడానికి సమర్పించే శుద్దోదకం నింపిన పాత్ర. 

నాలుగవది స్నాన పాత్ర:

👉 ఇది భగవంతుని కి స్నానము చేయించడానికి కావలసిన శుద్ధోదకం నింపుకున్న పాత్ర

ఐదవ పాత్ర :

👉 ఐదవది శుద్ధోదక పాత్ర- ఇందులో భగవంతుని కి సమర్పించే జలాలు నింపుకున్న పాత్ర

👉 ఇవి పంచ పాత్రలు..ఇవి గాక ప్రతిగ్రాహక పాత్ర ఉపచారాలు చేశాక తీసిన నిర్మాల్యపు జలాలు నింపుకునే పాత్ర,మరొక శుద్ధ జలం అవసరం అయితే కావాల్సిన జలాన్ని నింపుకున్న పాత్ర, ఇంక ఆచార్య పూజ కూడా ఉండే వాళ్లకు ఆచార్యునికి అర్ఘ్య సమర్పణకు ఒక పాత్ర ఉండాలి. 

👉  ఇంకా సర్వార్థ జల పాత్ర- ఇది మన చేతులు మరియు,ప్రతీ ఉపచారానికి మధ్య మధ్యలో ఉద్ధరిణ శుభ్రం చేసి తిరిగి మరొక ఉపచారము చేసేప్పుడు వాడే దానికి శుద్ధ జలము నింపిన పాత్ర.

సర్వేజనా సుఖినో భవంతు
శుభమస్తు
వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.

జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర
ACCANKSHA YEDUR
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
శ్రీ విధాత పీఠం
Ph: 9666602371
https://www.youtube.com/channel/UCHKMF3Y_XXCOi9zhEorDsiQ

No comments:

Post a Comment