.
శివజటాజూటంలో బందీ అయిన గంగ కానరాక భగీరధుడు మరల తీవ్రమైన తపస్సు చేశాడు.
.మహాదేవుడు సంతసించి గంగను విడిచిపెట్టాడు.
.జటాజూటం నుండి గంగ ఏడు పాయలుగా విడివడి ప్రవహించింది.
.హ్లాదిని,పావని,నళిని ఈ మూడుపాయలు తూరుపుదిక్కుగా
సుచక్షువు,సీత,సింధువు ఈ మూడు పడమరదిక్కుగా ప్రవహించినవి.
.భగీరధుడి వెంట ఏడవపాయ నడచింది.నడచిన ప్రాంతాలను ముంచెత్తుతూ మహావేగంగా కదలింది ,సుళ్ళుతిరుగుతూ నడిచింది ,హోరునశబ్దంచేస్తూ పరుగెత్తింది ,ఉత్తుంగతరంగాలతో ఉవ్వెత్తున లేస్తూకదిలింది! గంగా తరంగ ఘోష మృదంగ ధ్వనిలా ఒకచోట మేఘగర్జనలా మరొకచోట వినిపించాయి! అంతకంటే వేగంగా ముందు పరుగెడుతున్నాడు భగీరధుడు.
.గంగ తీవ్రమైన వేగంతో జహ్ను మహాముని ఆశ్రమాన్ని ముంచెత్తింది .
.గంగ చేసిన పనికి కోపంతో మహర్షి మొత్తం గంగానదిని ఒక్కగుక్కలో త్రాగి గంగను మాయం చేశాడు.
.ఒక్కసారిగా నిశ్శబ్దం ! ఏమైఉంటుందా అని తిరిగి చూశాడు భగీరధుడు, గంగ కనపడలేదు .
.అర్ధమయ్యింది మరల మహర్షిని సకలదేవసంఘాలతో కూడి పరిపరివిధాలుగా ప్రార్ధించాడు. మహర్షి కరుణించి తన చెవులనుండి గంగను విడిచి పెట్టాడు .అప్పటినుండి ఆవిడ "జాహ్నవి" అయ్యింది.
.మరల భగీరధుడిని అనుసరించింది గంగ, సముద్రంలో ప్రవేశించి పాతాళానికి చేరి సగరపుత్రుల భస్మరాశిమీదుగా ప్రయాణించగా వారి పాపములు నశించి స్వర్గము చేరుకున్నారు.
.N.B..
.ఈ కధలో రెండు విషయాలు మనకు గోచరిస్తాయి.
ఒకటి భగీరధుడి అద్భుతమైన ప్రయత్నం ! దానికి సరిసాటి ఇంకొకటిలేదు.
మనమొక లక్ష్యాన్ని నిర్ణయించుకొన్నప్పడు అది పూర్తిచేయడం మన విధి .మడమ తిప్పరాదు.మధ్యలో కలిగే ఆటంకాలను ఓపికగా పరిష్కరించుకుంటూ పోవడమే!
.ఇక గంగ అహంకారం ! తాడిని తన్నేవాడుంటే వాడి తల దన్నేవాడుంటాడు అనటానికి ఉదాహరణ .అహంకారం పనికిరాదు.
.సర్వేజనా సుఖినో భవంతు
No comments:
Post a Comment