Friday 16 February 2024

హిందువుల ప్రసాదాల లోగుట్టు🙏

  


 🙏Medical benefits of Hindu Prasadam🙏🏻

ప్రతి ప్రసాదానికి విశిష్టత ఉంది . ఈ ప్రసాదాల్లో ఉన్న మిశ్రమాలు ఆరోగ్యానికి చేసే మేలు అంతా ఇంతా కాదు .

★ జీర్ణశక్తిని పెంచే  "కట్టె పొంగలి"

" బియ్యం, పెసరపొప్పు, జీలకర్ర, ఇంగువ, నెయ్యి, అల్లం, శొంఠిపొడి, ఉప్పు, కరివేపాకు, జీడిపప్పుల మిశ్రమంలో తయారయ్యే కట్టెపొంగలి రోగనిరోధకశక్తిని, జీర్ణశక్తిని పెంచు తుంది. మంచి ఆకలిని కలిగిస్తుంది.

★ జీర్ణకోశ వ్యాధుల నివారిణి "పులిహోర"

' బియ్యం, చింతపండు పులుసు, శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, ఉప్పు, ఇంగువ, పసుపు, బెల్లం, నూనె, వేరుశనగలు, జీడిపప్పు మిశ్రమంతో తయారు చేసే పులిహోర జీర్ణశక్తిని పెంచుతుంది. జీర్ణకోశ వ్యాధులను నివారిస్తుంది.

★ మేధస్సును పెంచే "దద్ధోజనం"

బియ్యం, పెరుగు, ఇంగువ, కొత్తిమీర, అల్లం, మిర్చి, శొంఠిపొడి మిశ్ర మంతో తయారు చేసే ఈ ప్రసాదం మేధస్సును పెంచుతుంది. శరీరానికి కి మంచి శక్తిని ఇచ్చి ఆరో గ్యాన్ని కల్గిస్తుంది.

★ వార్ధక్యాన్ని నిలువరించే "కదంబ"

బియ్యం, చింతపండు, ఎండుమిర్చి, పోపు గింజలు, ఇంగువ, నూనె, ఉప్పు , కందిపప్పు, పసుపు, బెల్లం, నెయ్యి , బెండకాయ, వంకాయ, గుమ్మడికాయ, చిక్కుళ్లు, బీన్స్ , దోసకాయ, క్యారెట్, టమోటా, చిలకడ దుంపల మిశ్రమంలో తయారు చేసే కదంబ ప్రసాదం అత్యంత బలవర్థకం. సప్తధాతువుల పోషణ చేస్తుంది. వార్ధక్యాన్ని నిలువరిస్తుంది. అన్ని వయస్సుల వారికి మంచి పౌష్టికాహారం. 

★ శ్లేష్మాన్ని తగ్గించే "పూర్ణాలు"

పచ్చిశనగపప్పు, బెల్లం, కొబ్బరి తురుము, యాలకుల మిశ్ర మంతో ఈ ప్రసాదం సప్తధాతు వుల పోషణ చేస్తుంది. శ్లేష్మాన్ని తగ్గిస్తుంది. మంచి బలవర్ధకం.

★ రోగ నిరోధక శక్తిని పెంచే "చలిమిడి"

' బియ్యం పిండి, బెల్లం, యాలుకలు, నెయ్యి,  పచ్చకర్పూరం, జీడిపప్పు, ఎండుకొబ్బరి కోరుతో తయారుచేసే చలిమిడి మంచి బలవర్ధకం.

★ కొబ్బరి పాల పాయసం

కొబ్బరి పాలు, పచ్చ కర్పూరం, యాలకుల పొడి, బాదంపప్పు, కుంకుమపువ్వు, పంచదార, ఆవు పాలు, కలకండ పొడి తో చేసే ఈ ప్రసాదం వెంటనే శక్తినిస్తుంది. మంచి బలవర్ధకం. శ్రేష్మాన్ని హరిస్తుంది.

సర్వేజనా సుఖినో భవంతు
శుభమస్తు
వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.
జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర
ACCANKSHA YEDUR
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
శ్రీ విధాత పీఠం
Ph: 9666602371

No comments:

Post a Comment