Friday 16 February 2024

రామాయణమ్.. 16

 



మా తదుపరి కర్తవ్యమేమిటి  బ్రహ్మర్షీ ? అని వినయంగా తన చెంత దోసిలి ఒగ్గి నిలుచున్న రామ లక్ష్మణులను కడు మురిపెముగా చూస్తున్నారు మహర్షి! .

.ఇంతలో కొందరు ఆశ్రమ వాసులు అచటికి వచ్చి జనకుడు యాగం చేస్తున్నాడట ! మనకు ఆహ్వానం వచ్చింది! 

రామ,లక్ష్మణులారా మీరుకూడ మాతో మిధిలకు వచ్చినట్లయినచో అక్కడ మీరు ఒక ధనుస్సు చూడవచ్చు .అని అన్నారు..

.ఆ ధనుస్సును మిధిలాధిపతి అయిన దేవరాతుడు తన యజ్ఞఫలముగా దేవతలవద్దనుండి పొందాడు. అది చాలా గొప్ప ధనుస్సు దాని మధ్య భాగము చాలా దృఢమైనది! అది మిధిలేశుల రాజమందిరములో ప్రస్తుతము పూజలందుకుంటున్నది ! .అని మహర్షి పలికి, తాను ప్రయాణమయినాడు!.

.సోదరులిరువురూ ,తాపసులు,వారి శకటములు అన్నీ విశ్వామిత్ర మహర్షిని అనుసరించి వెడుతూ ఉన్నవి . సాయంకాల మయ్యేవరకు ఆ విధంగా ప్రయాణం చేసి అత్యంతమనోహరమైన ఒక నది ఒడ్డుకు చేరారు.

.ఆ ప్రాంత సౌందర్యాన్ని చూసి రామచంద్రుడు మునిచంద్రుని ప్రశ్నించాడు ,స్వామీ ఈ ప్రదేశము కడు రమణీయముగా యున్నది కారణమేమి?

.ఈ నది పేరు శోణనది ఇది మగధ దేశంలో పుట్టినది!

పూర్వము బ్రహ్మదేవునకు కుశుడు అనే ఒక కుమారుడుండేవాడు

ఆ కుశునకు నలుగురు పుత్రులు వారిలో కుశాంబుడు కౌశాంబీ నగరమును,కుశనాభుడు మహోదయపురమును, అధూర్తరజసుడు ధర్మారణ్యము అనే పట్టణాన్ని ,

వసురాజు గిరివ్రజ పురాన్ని నిర్మించుకొని ధర్మం తప్పకుండా పరిపాలిస్తున్నారు.

.వారిలోని వసురాజుకు చెందిన భూమి ఇది ! ఈ శోణనదీ తీరం ఆయన ఏలుబడిలోనిదే!.

.వారిలో కుశనాభుడు ఘృతాచి అనే అప్సరస్త్రీని వివాహంచేసుకొని నూరుగురు అందమైన కన్యలకు తండ్రి అయినాడు..

.ఆ కన్నియలు నూరుగురూ అపురూపసౌందర్య రాశులు ,దర్శనమాత్రం చేత మోహవివశులను గావింపగలరు .

.వారు ఒకరోజు ఉద్యానవనంలో విహరిస్తుంటే వారిని చూసి మోహించిన వాయుదేవుడు తన కోరికను వెల్లడించి పెళ్ళి చేసుకుంటాను మిమ్ములను అని కోరిక వ్యక్త పరుస్తాడు ! 

.అందుకు వారు ,తండ్రి అనుమతి లేని కారణం చేత తిరస్కరించారు. అప్పుడు వాయుదేవుడు కోపంతో వారిని కురూపిణులుగా మారుస్తాడు.

. వారికి తిరిగి శాపమివ్వగల శక్తిఉండికూడా వాయువును ఏమీ చేయక తండ్రివద్దకు  వెళ్ళి తమకు పట్టిన దుస్థితి వివరించి కంట నీరు పెట్టుకుంటారు.

.అప్పుడు తండ్రి అయిన కుశనాభుడు వారికి యవ్వనము అశాశ్వతము ,విలువలు శాశ్వతము అని బోధించి ఊరడిస్తాడు!.

.పై సందర్బంలో ఒకచక్కని శ్లోకాన్ని అద్భుతంగా తెనిగించారు భాస్కర రామాయణ కర్తలు.

.క్షమయ జనులకాభరణము 

క్షమయ కీర్తి

క్షమయ ధర్మంబు

 క్షమయ సజ్జనగుణంబు

క్షమయ యజ్ఞంబు 

 క్షమయ మోక్షంబు  

క్షమయ సకల దానంబు

క్షమయందే జగము నిలుచు.

.ఇవే పదాలతో రంగనాధరామాయణ కర్త కూడా ఇంతే అందంగా వ్రాశాడు.

.ఓర్పు అనేది ఎంత ముఖ్యమో ఆరోజుననే చెప్పారు మనకు .

.PATIENCE  అని అంటున్నాము దానినే ఈరోజు మనము 

.సర్వేజనా సుఖినో భవంతు

శుభమస్తు
వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.
జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర
ACCANKSHA YEDUR
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
శ్రీ విధాత పీఠం
Ph: 9666602371

No comments:

Post a Comment