Tuesday 20 February 2024

నిమ్మకాయ దీపాలను ఏ ఏ రోజులలో వెలిగించాలి..?? ఏ సమయంలో వెలిగిస్తే మంచి ఫలితాలను పొందగలరు....??🌸

 

రాహుకాలంలో నిమ్మకాయల దీపం 

🌟నిమ్మకాయ దీపం అనేది కుజదోషం, కాలసర్ప దోషం, వ్యాపార, కుటుంబ, ఆర్ధిక భాదలతో సతమతం అయ్యే వారికి చక్కని తరుణోపాయం.

🌟ఈ నిమ్మకాయ దీపారాధన వలన శక్తి స్వరుపినైన అమ్మవారు అనుగ్రహించి ఈతి భాదలను తొలగిస్తుంది.నిమ్మకాయలంటే శక్తి స్వరూపిణి పార్వతి దేవికి చాలా ఇష్టం. 

🌟నిమ్మకాయలతో చేసిన దండను పార్వతి దేవికి ...గ్రామ దేవతలైన మైసమ్మ, ఎల్లమ్మ, పోచమ్మ, మారెమ్మ,పెద్దమ్మ, మొదలైన శక్తి దేవి అవతారాలకు మాత్రమే వేస్తారు. గ్రామ దేవతల దేవాలయాల్లో ఈ నిమ్మకాయల దీపం వెలిగించాలి.

🌟ఎటువంటి పరిస్థితుల్లోనూ మహాలక్ష్మి, సరస్వతి మరియు ఇతర దేవాలయాల్లో ఈ నిమ్మకాయ దీపాలను వెలిగించకూడదు.

🌟ఒక వేళ వెలిగిస్తే ఆ ఇంట సంతోషం ఉండదు. సంసారం లో ఎప్పుడు గొడవలు ఉంటాయి, ఆర్ధిక వ్యవహారాల్లో నష్టం కలుగుతుంది, భార్య భర్త, పిల్లలు, స్నేహితులు, బంధువుల మధ్య తగాదాలు ఎక్కువ అవుతాయి.

🌟పార్వతి దేవాలయాల్లో నిమ్మకాయలతో చేసిన దీపాలను దేవి వారాలుగా పరిగణించే మంగళవారం, శుక్రవారాల్లో రాహుకాల సమయాలలో మాత్రమే వెలిగించాలి.

🌟మంగళవారం వెలిగించే దీపాల కన్నా శుక్రవారం వెలిగించే దీపాలకు చాలా ప్రాముఖ్యత ఉంటుంది. ఎందుకంటే మంగళ వారం వెలిగించే దీపం రజోగుణం కలిగి ఉంటుంది. శుక్రవారం వెలిగించే దీపం సత్వ గుణాన్ని కలిగి ఉంటుంది.

🌟శుక్రవారం రోజు దేవికి వెలిగించే దీపం మనస్సుకు ప్రశాంతతను కలిగిస్తుంది.

🌟శుక్రవారం రోజు దేవికి నిమ్మకాయల దీపాన్ని వెలిగించి పెరుగు అన్నం, లేదా పెసరపప్పు, లేదా పానకం లేక మజ్జిగ లేక పండ్లను దేవికి నైవేద్యము పెట్టి తరువాత సుమంగళికి ఇవ్వాలి.

🌟కుదిరితే పసుపు, కుంకుమ, పూలు, గాజులు, జాకెట్టు ముక్క, చీరలు ఇస్తే దేవికి చాలా ఇష్టం. తాంబూలం దానం మరియు శక్తికి తగినట్లుగా దక్షిణ ఇచ్చి సుమంగళికి నమస్కారం చేయాలి. ఇలా చేస్తే తలచిన కార్యాలు ఎటువంటి ఆటకం లేకుండా శుభప్రదంగా త్వరగా నెరవేరతాయి.

🌟నిమ్మకాయల దీపం వెలిగించేటప్పుడు గమనించవల్సిన అంశాలు:-మచ్చలు లేని వాడిపోని తాజా నిమ్మకాయలను ఆకుపచ్చని రంగుతో ఉన్న వాటిని ఉపయోగించాలి. బహిష్టు సమయంలో నిమ్మకాయ దీపాలు వెలిగించకూడదు.

🌟మహిళలు 4వ రోజు తల స్నానం చేసి 5 వ రోజు స్నానం చేసి నిమ్మకాయల దీపాలను వెలిగించకూడదు.

🌟మైలతో ఉన్నప్పుడు కూడా నిమ్మకాయల దీపాలను వెలిగించకూడదు.

🌟ఇంట్లో పండుగ సమయం, పెద్దల తిధి కార్యాలు ఉన్న రోజున నిమ్మకాయల దీపాలను వెలిగించకూడదు.

🌟పిల్లల పుట్టిన రోజునాడు, పెళ్లి రోజున గాని నిమ్మకాయల దీపాలను వెలిగించకూడదు. అంటే నిమ్మకాయ దీపంతో పాటు ప్రమిద దీపం వెలిగించకూడదు.

🌟వేరే ఊరు వెళ్లినప్పుడు మిత్రుల మరియు బంధువుల ఇంట్లో నిమ్మకాయల దీపాలను వెలిగించకూడదు.ఆడపిల్లలు, అక్క, చెల్లిళ్ళ ఇంటికి లేదా పుట్టింటికి వెళ్లినప్పుడు నిమ్మకాయ దీపాలు వెలిగించకూడదు.స్త్రీలు పట్టుచీర కట్టుకొని దేవికి నిమ్మకాయల దీపాన్ని వెలిగిస్తే త్వరగా దేవి అనుగ్రహం కలిగి అన్నీకార్యాలు ఎలాంటి లోపాలు లేకుండా జరిగిపోతాయి.

🌟చీర ఎరుపు, పసుపు రంగు కలిగినవి వాడితే ఇంకా మంచిది.

🌟స్త్రీలు మామూలు చీరలు ధరించి నిమ్మకాయల దీపాలను వెలిగిస్తే వారి కార్యాలకు మధ్యమ స్థాయి ఫలితాలు లభిస్తాయి. పొరపాటున కూడా గంజి వేసిన బట్టలను ధరించి పూజలు చేయరాదు.

🌟ఆధునిక వస్త్రధారణతో నిమ్మకాయ దీపాలు వెలిగిస్తే ఫలితం లభించదు.

🌟దీపం క్రింద తమలపాకు,లేదా ఏదేని ధాన్యపు గింజలను వేసి కుంకుమ బొట్టు పెట్టి దీపారాధన చేయాలి.

🌟నిమ్మకాయ దీపం వెలిగించిన తర్వాత సాంబ్రాణి పొగ దూపం తప్పక వేయాలి.

🌟పూజకు ఎర్రని పూలనే ఉపయోగించాలి. బెల్లంతో చేసిన పరమాన్నం నైవేద్యం పెట్టాలి.

సర్వేజనా సుఖినో భవంతు
శుభమస్తు
వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.
జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర
ACCANKSHA YEDUR
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
శ్రీ విధాత పీఠం
Ph: 9666602371

No comments:

Post a Comment