Monday 26 February 2024

రామాయణమ్. 23

 



ఓ బ్రహ్మర్షీ! నా తల్లిని రాముడు చూసినాడా? ఆమెను అనుగ్రహించినాడా? 

మరల నా తండ్రి అచటికి ఏతెంచినాడా? నా తల్లితండ్రులు ఇరువురూ సంతోషముగా కలసినారుకదా! 

రాముడు వారి ఆతిధ్యమును స్వీకరించెనా? నా తల్లిదండ్రులు రామునకు ఫలపుష్పాదులొసగినారుకదా! 

.ఇలా ఒకదానివెంట మరొక ప్రశ్న సంధిస్తూ వెడుతున్న శతానందులవారికి విశ్వామిత్రుడు చిరునవ్వుతో ఒకే ఒక సమాధానం చెప్పారు.

"నాయనా ,జరుగవలసిన వెల్ల జరిగినవి నా కర్తవ్యము నేను నిర్వహించితిని. ఆ మాటలు విన్న శతానందుడు...ధన్యుడనయితిని ఓ రామచంద్రా నీవు నా తలితండ్రులకు ,కుటుంబమునకు చేసిన మేలు మరువలేనిదయ్యా! 

.నీవుకూడా ధన్యుడవయితివయ్యా! అనితర సాధ్యమైన బ్రహ్మర్షిపదాన్ని స్వయం కృషితో అందుకున్న ఈ మహాతేజోసంపన్నుడైన విశ్వామిత్రుని శిష్యరికము నీకు లభించినది.

.ఈయన సామాన్యుడనుకున్నావా! కాదు ,కాదు! ఈయన ఒక్కడే!(unique) .చరిత్రలో మరొకరులేరు.

.ఒక సామాన్య రాజుగా జన్మించి రాజర్షియై,ఋషియై,మహర్షియై,బ్రహ్మర్షిఅయిన ఈయన చరిత్ర అత్యంత స్ఫూర్తి దాయకం ,ఆదర్శవంతము.

.ఒక లక్ష్యము కోసము పట్టువిడవక వేల ఏండ్లు తపస్సు చేసి సాధించిన మహోన్నతమయిన వ్యక్తి విశ్వామిత్రమహర్షి! .

.తపస్సు ద్వారా మనస్సులోని మలినములు ఒక్కొక్కటిగా తొలగించు కుంటూ మనస్సు అత్యంత పరిశుద్ధమైన మానససరోవరంగా మార్చుకున్న వాడయ్యా ఈయన ! 

.ఈయన చరిత్ర మానవాళికి అందించే పాఠం అత్యంత విలువైనది ! .ఈ చరిత్ర కార్యసాధకుడైన ప్రతి వ్యక్తి హృదయంలో స్ఫూర్తి రగిలిస్తుంది!

.రామచంద్రా ఈ బ్రహ్మర్షిగూర్చి నీకు వివరించ ప్రయత్నం చేస్తాను. 

.అంటూ శతానందులవారు విశ్వమిత్రమహర్షి చరిత్ర చెప్పటం మొదలుపెట్టారు!.

సర్వేజనా సుఖినో భవంతు
శుభమస్తు
వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.
జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర
ACCANKSHA YEDUR
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
శ్రీ విధాత పీఠం
Ph: 9666602371

.

No comments:

Post a Comment