Tuesday, 20 February 2024

రామాయణమ్.19

 


..

అంశుమంతుడు తన పినతండ్రులు వెడలిన దారిలో ప్రయాణంచేసి వారు భస్మరాశిగా మారిన చోటికి వెళ్లగా అక్కడ ఆతనికి బూడిదకుప్పలు,ఒక చోట మేయుచున్న అశ్వము కనిపించాయి.

.తన పిన తండ్రులకు జల తర్పణములివ్వవలెనని చుట్టూ కలియచూశాడు ఎక్కడా చుక్క నీరుకూడా కనపడలేదు.

.అప్పుడు అంశుమంతునకు ఆతని పిన తండ్రుల మేనమామ గరుత్మంతుడు కనపడి వీరికి మామూలు నీటితో తర్పణము విడువరాదు పావనగంగోదకము తో ఇచ్చిన తర్పణము మాత్రమే వీరికి పుణ్యలోకాలు కలుగచేస్తుంది .

.ప్రస్తుతమునకు నీవు ఈ గుర్రము తీసుకొని వెళ్ళి యాగమును పూర్తిచేయించుము అని తెలిపినాడు అప్పుడు అంశుమంతుడు యాగాశ్వాన్ని తీసుకొని తన పట్టణము చేరుకొన్నాడు.

.అంశుమంతుని ద్వారా సగరచక్రవర్తి ఈ వార్తను విన్నవాడై తీవ్రమైన వేదనతో దుఃఖిస్తూ గంగను భువికి తెచ్చే ఉపాయము కానరాక మిన్నకుండినాడు.

.కొంతకాలానికి అంశుమంతుడు రాజైనాడు.ఆయనకు దిలీపుడు అనే కొడుకు కలిగాడు.

.దిలీపుడు కూడా గంగను తెచ్చే మార్గము కనుగొనలేకపోయాడు.

.ఆ దిలీప మహారాజుకు పరమ ధార్మికుడైన భగీరధుడు పుత్రుడుగా జన్మించాడు.

.భగీరధుడి మనస్సులో తన పూర్వీకుల అధోగతి గురించి తీవ్రంగా మధనపడుతూ ఉండేవాడు,

.ఒకరోజు ఆయన తన రాజ్యాన్ని మంత్రులకు అప్పగించి గోకర్ణక్షేత్రానికి వెళ్లిపోయాడు .

అక్కడ ఆయన తన చేతులు పైకెత్తి ,నెలకొక్కసారి మాత్రమే భోజనం చేస్తూ వేలసంవత్సరాలు తపస్సుచేసాడు..

.ఆయన తపస్సుకు మెచ్చి బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై గంగ భూమికి వచ్చునట్లుగా అనుమతించి ,ఇక్ష్వాకు వంశానికి సంతానలోటు లేకుండా వరమిచ్చి అంతర్ధాన మయ్యాడు.

.ఇక్కడే ఒక చిక్కు వచ్చిపడ్డది భగీరధుడికి !

.తీవ్రమైన వేగంతో గంగ భూమిమీద దూకినప్పుడు ఆమెను భరించే సమర్ధత ఒక్క పరమశివుడికే మాత్రమే ఉన్నది .

.వేరే దారిలేక మరల శివానుగ్రహంకోసం ఒక సంవత్సరకాలం కేవలం బొటనవేలును ఆసరాగా చేసుకొని నిలబడి ఘోరతపస్సుచేశాడు..

.పరమశివుడు ప్రత్యక్షమై ఆతని అనుగ్రహించాడు.

.గంగను ఆకాశం నుండి దిగమని ప్రార్ధించాడు భగీరధుడు! 

.అహంకారంతో శివుడు ఎట్లా తట్టుకుంటాడో చూద్దామని ఒక్క ఉదుటున అతివేగంగా భూపతనం చెందింది గంగ. మహాశివుడిని తోసుకుంటూ పాతాళానికి వెళ్ళాలని గంగ ఆలోచన.

శివుడు అదిగ్రహించి తన జటాజూటంలో గంగను బందీ చేశాడు.

.అక్కడనుండి బయటపడే దారిలేక విలవిల లాడింది గంగ.

.సర్వేజనా సుఖినో భవంతు

శుభమస్తు
వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.
జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర
ACCANKSHA YEDUR
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
శ్రీ విధాత పీఠం
Ph: 9666602371

No comments:

Post a Comment