Wednesday, 14 February 2024

తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో ఘనంగా కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం

 


 తిరుపతి, 2024 ఫిబ్ర‌వ‌రి 13 : ఫిబ్ర‌వ‌రి 16న ర‌థ‌స‌ప్త‌మి ప‌ర్వ‌దినాన్ని పుర‌స్క‌రించుకుని తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో మంగళవారం కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం ఘనంగా జ‌రిగింది.

 ఉదయం 6.30 నుండి 9 గంటల వరకు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం చేపట్టారు. ఇందులో ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజాసామగ్రి తదితర అన్ని వస్తువులను నీటితో శుద్ధి చేశారు. అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచీలీగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్రమిశ్రమాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేశారు. అనంతరం భక్తులను సర్వదర్శనానికి అనుమతించారు. 

 కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం సందర్భంగా మంగళవారం ఆలయంలో కల్యాణోత్సవం, ఊంజల్‌సేవలను రద్దు చేశారు.

 ఈ సంద‌ర్భంగా హైద‌రాబాదుకు చెందిన భ‌క్తురాలు శ్రీ‌మ‌తి స్వ‌ర్ణ‌కుమారి అందించిన ప‌ర‌దాల సెట్‌ను ఆల‌యంలో అలంక‌రించారు.

 ఫిబ్ర‌వరి 16న రథసప్తమి 

 ఫిబ్ర‌వరి 16న ఉదయం 7.15 నుండి 8.15 గంటల వరకు సూర్యప్రభ వాహనం, ఉదయం 8.45 నుండి 9.45 గంటల వరకు హంస వాహనం, ఉదయం 10.15 నుండి 11.15 గంటల వరకు అశ్వ వాహనం, ఉదయం 11.45 నుండి మధ్యాహ్నం 12.45 గంటల వరకు గరుడ వాహనంపై విహ‌రించి అమ్మ‌వారు భ‌క్తుల‌ను క‌టాక్షించ‌నున్నారు. మధ్యాహ్నం 1.15 నుండి 2.15 గంటల వరకు చిన్నశేష వాహనం, సాయంత్రం 6 నుండి రాత్రి 7 గంటల వరకు చంద్రప్రభ వాహనం, రాత్రి 8.30 నుండి 9.30 గంటల వరకు గజ వాహనంపై ద‌ర్శ‌న‌మిస్తారు.

 కాగా మ‌ధ్యాహ్నం 3.30 నుండి సాయంత్రం 4.30 గంటల వరకు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలోని శ్రీ కృష్ణస్వామివారి ముఖ మండపంలో అమ్మవారి ఉత్సవర్లకు స్నపనతిరుమంజనం వైభవంగా నిర్వహిస్తారు. ఈ సందర్భంగా అమ్మవారి ఆలయంలో నిర్వహించే అభిషేకానంత‌ర ద‌ర్శ‌నం, ల‌క్ష్మీపూజ‌, ఆర్జిత కల్యాణోత్సవం, కుంకుమార్చ‌న‌, బ్రేక్ ద‌ర్శ‌నం, ఊంజ‌ల‌సేవ‌, వేదాశీర్వ‌చ‌నం సేవలను టీటీడీ రద్దు చేసింది.

 తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయానికి అనుబంధంగా ఉన్న‌ శ్రీ సూర్యనారాయణ స్వామివారి ఆలయంలో ఉదయం 6 నుండి 7 గంటల వరకు స్వామివారు అశ్వవాహనాన్ని అధిష్టించి భక్తులకు దర్శనమివ్వనున్నారు.

 ఈ కార్యక్రమంలో విజివో శ్రీ బాలిరెడ్డి, ఆల‌య ఏఈవో శ్రీ ర‌మేష్‌, సూప‌రింటెండెంట్ శ్రీ శేష‌గిరి, ఎవిఎస్వో శ్రీ శైలేంద్ర‌బాబు త‌దిత‌రులు పాల్గొన్నారు.

 టీటీడీ ముఖ్య‌ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.

సర్వేజనా సుఖినో భవంతు
శుభమస్తు
వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.
జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర
ACCANKSHA YEDUR
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
శ్రీ విధాత పీఠం
Ph: 9666602371

No comments:

Post a Comment