వసంత పంచమి సందర్భంగా సరస్వతి దేవి గురించిన సమాచారం*
📖 అక్షరాలకు అధిదేవత, సకల విద్యల రాణి, జ్ఞాన ప్రదాయిని- సరస్వతీదేవి. ఆ వాగ్బుద్ధి వికాస స్వరూపిణి జన్మదినోత్సవమే శ్రీ పంచమి. నేటి మాఘ శుద్ధ పంచమి పర్వదినాన్ని ‘వసంత పంచమి’ అని పిలుస్తారు. మానవజాతి మనుగడకు, అక్షయ సంపదకు మూలమైన ప్రణవ స్వరూపిణి సరస్వతి. ఆమె జ్ఞానానంద శక్తిగా, వేదజ్ఞాన మాతృకగా వెలుగొందుతోంది. గాయత్రిగా, లౌకిక-అలౌకిక విజ్ఞాన ప్రదాతగా భాసిస్తోంది. పరిపూర్ణ అనుగ్రహంతో స్వరాన్ని, వరాన్ని ఆ దేవి ప్రసాదిస్తోంది.
📗 విజ్ఞాన నిధులు అనేకం. వాటిలో ప్రతిభ, మేధ, శ్రద్ధ, స్ఫురణ, ధారణ ఉంటాయి. చైతన్యం, కళా నైపుణ్యం, జ్ఞాన రహస్యం, సంస్కారం సైతం నెలకొంటాయి. వాటితో పాటు సత్కీర్తి, తర్కం, వ్యాకరణం, మీమాంస, వ్యాఖ్యానం, భాష్యం... ఇలా విభిన్న రీతుల్లో సాగిపోతుంటాయి. అన్ని విజ్ఞాన నిధులూ ఆ చల్లని తల్లి కటాక్ష వీక్షణ ఫలితాలే!
✒ శుంభ, నిశుంభులను సంహరించిన వీర నారి ఆమె. మహా సరస్వతిగానే కాదు- సిద్ధ, నీల, ధారణ, అంతరిక్ష సరస్వతిగా ఆ దేవికి అనేక రూపాలున్నాయని ‘మంత్ర శాస్త్రం’ చెబుతోంది.
No comments:
Post a Comment