Thursday, 15 February 2024

దిన ఫలాలు



ఫిబ్రవరి 16, 2024

 వారం : భృగువాసరే (శుక్రవారము) 

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)

ఆదాయం నిలకడగా ఉంటుంది. అయితే, విలాస జీవితం మీద ఖర్చు పెరుగుతుంది. ఉద్యోగంలో అధికారం చేపట్టడానికి అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో తీరిక లభించకపోవచ్చు. నిరుద్యోగుల ప్రయత్నాలు సఫలమవుతాయి. కుటుంబపరంగా శుభవార్తలు వింటారు. అదనపు ఆదాయ ప్రయత్నాలు ఉత్సాహాన్నిస్తాయి. ఆస్తి సంబంధమైన వ్యవహారాల్లో లాభాలు అందుకుంటారు. తల్లితండ్రుల సహాయంతో ఆర్థిక సమస్యలు దూరమవుతాయి. విహార యాత్ర చేసే అవకాశం ఉంది.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)

ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. అవసరానికి తగ్గట్టుగా చేతిలో డబ్బు ఉంటుంది. స్థిరాస్తి సంబంధమైన క్రయ విక్రయాల్లో లాభాలు పొందుతారు. ఇంటా బయటా ఆదరణ పెరుగుతుంది, వృత్తి, ఉద్యోగాల వారికి ఆదాయం బాగుంటుంది. వ్యాపారంలో ఆశించిన లాభాలు కనిపిస్తాయి. ఉద్యోగంలో పదోన్నతికి అవకాశం ఉంది. వ్యయ ప్రయాసలతో ముఖ్యమైన పనులు పూర్తవు తాయి. స్వల్ప అనారోగ్యానికి అవకాశం ఉంది. నిరుద్యోగులు తమ ప్రయత్నాలు పెంచాల్సి ఉంటుంది.

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)

వృత్తి, వ్యాపారాల్లో రాబడికి లోటుండదు. ఉద్యోగంలో మీ మాట చెల్లుబాటు అవుతుంది. ఏ ప్రయత్నం తలపెట్టినా నిర్విఘ్నంగా పూర్తవుతుంది. ఆస్తి సంబంధమైన వ్యవహారాలు లాభదాయకంగా ముందుకు సాగుతాయి. ఆదాయానికి, ఆరోగ్యానికి లోటు ఉండదు. ప్రయాణాల్లో మాత్రం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. చేపట్టిన పనులు సకాలంలో సంతృప్తికరంగా పూర్తి చేస్తారు. తోబుట్టువులతో వివాదాలు పరిష్కారం అవుతాయి. నిరుద్యోగులకు కొత్త ఆఫర్లు అందుతాయి.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)

ఉద్యోగ జీవితంలో ఆశించిన గుర్తింపు లభిస్తుంది. అదనపు బాధ్యతల నుంచి విముక్తి పొందు తారు. వృత్తి, వ్యాపారాల్లో బాగా డిమాండ్ పెరుగుతుంది. ఆర్థిక సమస్యల నుంచి బయటపడ తారు. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. ఉద్యోగ సంబంధమైన ఏ ప్రయత్నం తలపెట్టినా విజ యవంతం అవుతుంది. ఆహార విహారాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది. నిరుద్యోగులకు కలసి వచ్చే సమయం ఇది. వివాహ ప్రయత్నాలు సఫలమవుతాయి. కుటుంబ జీవితం సాఫీగా సాగి పోతుంది.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)

వృత్తి, వ్యాపారాలలో ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. కొన్ని కొత్త నిర్ణయాలతో, కొత్త వ్యూహాలతో ముందుకు వెడతారు. ఉద్యోగంలో సహచరుల నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి. నిరు ద్యోగుల ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఆరోగ్య సంబంధమైన జాగ్రత్తలు పాటించడం మంచిది. తల పెట్టిన ముఖ్యమైన పనులు మందకొడిగా ముందుకు సాగుతాయి. కుటుంబపరంగా తొందరపాటు నిర్ణయాలకు అవకాశం ఇవ్వవద్దు. వ్యక్తిగత సమస్య ఒకటి అనుకోకుండా పరిష్కారం అవుతుంది.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)

ఆర్థిక పరిస్థితి చాలావరకు మెరుగ్గా ఉంటుంది. అదనపు ఆదాయ ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. వృత్తి, ఉద్యోగాలలో ఆశించిన ప్రోత్సాహకాలు అందుతాయి. పదోన్నతులకు కూడా అవకాశం ఉంది. ఆధ్యాత్మిక వ్యవహారాలకు ప్రాధాన్యం ఇస్తారు. తోబుట్టువులతో సఖ్యత పెరుగు తుంది. వ్యాపారాలు లాభసాటిగా సాగిపోతాయి. ఒక ముఖ్యమైన వ్యక్తిగత సమస్య నుంచి బయట పడతారు. నిరుద్యోగులకు కొత్త ఆఫర్లు అందుతాయి. కుటుంబ జీవితం సుఖ సంతోషాలతో సాగిపోతుంది.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)

ముఖ్యమైన వ్యవహారాలను సకాలంలో పూర్తి చేస్తారు. వృత్తి, వ్యాపారాల్లో ఒడిదుడుకులు తొలగి పోతాయి. ఉద్యోగంలో మరింత ఉత్సాహకర వాతావరణం ఉంటుంది. స్వల్ప అనారోగ్య బాధలు తప్పకపోవచ్చు. వివాదాలకు దూరంగా ఉండడం మంచిది. ఉద్యోగంలో మార్పులకు లేదా స్థాన చలనానికి అవకాశం ఉంది. ఆర్థిక ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. నిరుద్యోగుల ఉద్యోగ ప్రయత్నం ఫలిస్తుంది. కుటుంబ జీవితం సామరస్యంగా సాగిపోతుంది. దైవ కార్యాల్లో పాల్గొంటారు.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ఠ)

వ్యాపారాలు ప్రోత్సాహకరంగా ఉంటాయి. ఉద్యోగంలో ఆదరణ, గుర్తింపు పెరుగుతాయి. ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది. కొన్ని వ్యక్తిగత కీలక విషయాలలో కార్యసిద్ధి కలుగుతుంది. వృత్తి జీవితం ఆశించిన స్థాయిలో అభివృద్ధి చెందుతుంది. నిరుద్యోగులు శుభవార్తలు వింటారు. ఆర్థిక వ్యవహా రాల్లో అనుకూల పరిస్థితులుంటాయి. చిన్ననాటి మిత్రులతో ఎంజాయ్ చేస్తారు. రాదనుకున్న డబ్బు చేతికి అందుతుంది. ఇప్పుడు తీసుకునే నిర్ణయాలు మున్ముందు సత్ఫలితాలనిస్తాయి.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)

ఉద్యోగులకు హోదాలు పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాల్లో పని భారం వల్ల విశ్రాంతి కరువవు తుంది. ఆస్తి వివాదం ఒకటి పరి‌ష్కారం అవుతుంది. కీలక సమయంలో సన్నిహితుల నుంచి సహకారం అందుతుంది. కుటుంబ వాతావరణం ఆనందంగా ఉంటుంది. ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. ఉన్నత విద్యల కోసం ప్రయత్నిస్తున్న విద్యార్థులు ఆశించిన శుభవార్త వింటారు. బంధుమిత్రులతో ఆచితూచి వ్యవహరించడం మంచిది. కుటుంబ జీవితం హాయిగా సాగిపోతుంది.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)

నిరుద్యోగులకు ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ఇంటా బయటా అనుకూల వాతావరణం ఉంటుంది. ముఖ్యమైన పనులు పూర్తవుతాయి. వ్యవహారాలు సానుకూలపడతాయి. ఆర్థిక వ్యవ హారాలు ఆశాజనకంగా ఉంటాయి. తోబుట్టువులతో స్థిరాస్తి వివాదాలు సానుకూలంగా పరిష్కారం అవుతాయి. వృత్తి, వ్యాపారాలు నిలకడగా రాణిస్తాయి. ఉద్యోగంలో ప్రాధాన్యం, ప్రాభవం పెరుగుతాయి. కుటుంబ సభ్యుల మీద ఎక్కువగా ఖర్చవుతుంది. కుటుంబ జీవితం సాఫీగా సాగిపోతుంది.

కుంభం (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)

వృత్తి, ఉద్యోగాలలో కొద్దిగా ఒత్తిడి ఉన్నప్పటికీ, ఆశించిన స్థాయిలో ప్రతిఫలం ఉంటుంది. వ్యాపా రాలు లాభసాటిగా ముందుకు సాగుతాయి. వ్యక్తిగత సమస్యలు తగ్గుముఖం పడతాయి. ఇతరు లకు వాగ్దానాలు చేయడం గానీ, హామీలు ఉండడం కానీ ప్రస్తుత పరిస్థితుల్లో మంచిది కాదు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది. పెండింగు పనుల్ని కొద్ది శ్రమతో పూర్తి చేస్తారు. కుటుంబ జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది. నిరుద్యోగులకు దూర ప్రాంతం నుంచి ఆఫర్ వస్తుంది.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)

ఉద్యోగ సంబంధమైన ప్రయత్నాలలో విజయం వరిస్తుంది. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. స్నేహితుల సహాయంతో అదనపు ఆదాయ ప్రయత్నాలు సానుకూలపడతాయి. వృత్తి, వ్యాపా రాల్లో లాభాలు పెరిగే అవకాశం ఉంది. అనుకోని ఖర్చుల వల్ల కొద్దిగా ఇబ్బంది పడతారు. ఉద్యో గంలో పని భారం పెరుగుతుంది. దూర ప్రాంతంలో ఉన్న పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. ఒకటి రెండు శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. దాంపత్యంలో అనుకూలత ఏర్పడు తుంది.

సర్వేజనా సుఖినో భవంతు
శుభమస్తు
వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.
జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర
ACCANKSHA YEDUR
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
శ్రీ విధాత పీఠం
Ph: 9666602371

No comments:

Post a Comment