.
రాముడు ధనుస్సు మధ్యభాగం పట్టుకొని దిక్కులు ప్రతిధ్వనించేటట్లుగా ఒక్కసారినారి సారించి వదిలిపెట్టాడు .
ఆ ధనుష్టంకారానికి నలుదెసలలో కలకలం చెలరేగింది.సకల ప్రాణికోటి ఒళ్ళు జలదరించిపోయింది!
.ఆ ధ్వని తాటకకు సవాలు విసురుతున్నట్లుగా ఉంది .ఎక్కడో ఒకమూల పడుకున్న ఆ రాక్షసి ఏమీ ఆలోచించక తటాలున లేచి
శబ్దము వచ్చిన దిక్కుగా పరుగెట్టింది!.
.కొండంత ఆకారము ,వికృతమైన దేహం! అది కంటపడగానే ఎంతటి వారి గుండె అయినా ఆగిపోవలసిందే!.
.రాముడు క్షణకాలం ఆలోచించాడు ! ఆడుది ఇది , దీనిని చంపటమెందుకు? ముక్కు ,చెవులు కోసి బెదరగొట్టి దూరంపంపితె సరిపోతుంది అనుకున్నాడు!.
.రాముడిలా ఆలోచిస్తుండగా అది దుమ్మురేపుకుంటూ మహావేగంగా పెద్ద పెద్ద బండరాళ్లను విసురుతూ మహోద్రేకంతో మీదమీదకు రాసాగింది!.
.ఆ రాక్షసి కురిపించే శిలా వర్షాన్ని తన బాణవర్షముచేత ఆపివేసి మొదట దాని చేతులు నరికి వేశాడు ,ఆ రాక్షసి పట్టరాని బాధతో గర్జిస్తుంటే లక్ష్మణుడు దాని ముక్కు చెవులు కోసిపారేశాడు!.
.ఆ రాక్షసి తనకు కావలసిన రూపం దరించగల శక్తిగలది! అది పెక్కురూపాలు ధరించి అన్నదమ్ములను చీకాకు పరచ ప్రయత్నించింది!.
.ఇది స్త్రీ అని ఉపేక్షిస్తున్నాడు రాముడు ! అది గమనించిన మహర్షి, రామా! సంధ్యా సమయం రాబోతున్నది ,అంతకు ముందే దీనిని సంహరింపు, లేని పక్షమున రాక్షసులను సంధ్యాసమయంలో ఎదుర్కొని జయించడం కష్టసాధ్యమైన పని! అని పలికాడు.
.రాముడు మొదట దాని మాయ ఛేదించి ఒక పదునైన బాణంతో దాని వక్షస్థలం మీద గురి చూసి కొట్టగా అది పెద్దకొండలాగ నేలగూలింది!
.అప్పుడు ఇంద్రాది దేవతలంతా బాగుబాగు అనిమెచ్చుకొని పూలవానకురిపించారు.
.ఇంద్రుడు మహర్షితో నీ వద్దగల దివ్యాస్త్రములన్నింటినీ రామునకు ఉపదేశింపుము! అని పలికి మహర్షికి నమస్కరించి వెడలిపోయినాడు.
.ఆ రాత్రికి అత్యంత ప్రశాంతమయిన ఆ అడవిలోనే వారు విశ్రమించారు. తాటక నుండి ముక్తమైన ఆ వనము కుబేరుడి చైత్రరధంలాగా ప్రకాశించిందట! .
.తెలవారగనే శుభదర్శనుడైన రామునకు తనకు తెలిసిన అన్నిదివ్యాస్త్రాలు ఉపదేశించారు మహర్షి.
విశ్వామిత్రుడు కోపాన్ని జయించినవాడు అని మనకు తెలుసు. సకల ప్రాణిసంఘాలమీద ఆయన దయ అపారం!
.ఆయన ఏదో యాగం ఆరు రొజులు చేస్తున్నాడు !
ఆ యాగాన్ని ,ఆయనముందు కుర్రకుంకలైన వారు విఘ్నం చేయ ప్రయత్నిస్తున్నారు!
.మంత్రించిన దర్భచాలు ఆయనకు! యాగ సంరక్షణ చేయటానికి , అంత సమర్దుడు ఆయన!
.అన్ని కోరికలు జయించిన ఆయనకు ఒక కోరిక గలిగింది !
అది రామరసామృతపానం చేయాలని !
.మరి దశరధుడిదగ్గరకువెళ్లి నీ కొడుకుతో కబుర్లు చెప్పుకోవాలి వాడినే చూస్తూ కూర్చోవాలి కొన్ని రోజులు ,అని చెపితే పంపుతాడా!
.పంపడుగాక పంపడు !. కాబట్టి యాగమనే నెపంకావాలి !
.అదీ గాక రాముడు ఎందుకు పుట్టాడో ఆయనకు తెలుసు
.. రామునికి దివ్యాస్త్ర సంపద అమరాలి ! అందుకు ఊరకే ఇచ్చేస్తే ఏం ప్రయోజనం! ఆతడేదో ఘనకార్యం చేయాలి అందుకు తాను సంతోషించి ఇస్తున్నట్లుగా ఇవ్వాలి !
అందుకే తాటకను సంహరింపజేసి సకలదివ్యాస్త్రసంపద ఆయన వశం చేశాడు.
.ఇంత ఉంది ఇందులో!!
.పిబరే రామ రసమ్!
.సర్వేజనా సుఖినో భవంతు
No comments:
Post a Comment