ఒక వ్యక్తికి జీవితంలో వివాహము చాలా ముఖ్యమైన శుభకార్యము.
ఆ శుభకార్యము ఎల్లప్పుడు జీవితమంతా ఆనందమయంగా సుఖసంతోషాలతో మంచిసంతానముతో జీవించాలని కోరుకుంటారు. వ్యక్తి జాతకంలో వివాహమునకు సంబంధించి ( కలత్రదోషాలు) లేకుండ ఉంటె ఆ వ్యక్తికి వివాహ విషయాలలో ఇబ్బందులు ఉండవు. ఇరువురి జాతకాలలో కలత్రదోషాలు లేకుండా ఉండాలి.
కళత్రదోషాలు: కళత్రదోషం అంటె జాతకచక్రంలో సప్తమభావం వేదసప్తమాధిపతి బలహీనపడుట వలన ఎర్పడేదోషాలు, వివాహం ఆలస్యం, వివాహం జరిగే అవకాశము లేకపోవుట విడిపోవుటద్వారా, ద్వితీయవివాహం, వివాహేతరసంబంధాలు వివాహభాగస్వామిని కోల్పొవుట ,వివాహసౌఖ్యంలేకపోవుట మొదలయిన విషయాలను కళత్రదోషాలు అంటారు. జాతకచక్రంలో కొన్నిపాపగ్రహాల సంబంధం సప్తమానికి లేదా సప్తమభావానికి ఉంటె సప్తమభావం బలహీనపడుతుంది.
వివాహ ఆలస్యం . వివాహము జరుగకపోవుట :
లగ్నాధిపతి మరియు సప్తమాధిపతి కలసి లేదా విడివిడిగా 6,8,12 స్థానాలలో ఉంటె వివాహం జరుగదు. లేదా ఆలస్యం. లగ్నం నుండి లేదా చంద్రుని నుండి సప్తమస్థానాన్ని బలమైన పాపగ్రహాలు చూస్తున్న వివాహంజరుగదు. శుక్రుడు ఉన్న రాజ్యాధిపతి నీచలో ఉన్న లేదా 6,8,12 స్థానాలలో ఉన్నా వివాహం అనుమానం. శుక్రచంద్రులు కలసి సప్తమస్థానాలో ఉంటె వివాహం జరుగదు లేదా ఆలస్యం. చంద్రుడు మరియు గురువు సప్తమంలో ఉంటె ఆలస్యం. లగ్నంలో రవి ,సప్తమంలో శని లేదా సప్తమంలో రవి,లగ్నంలో శని ఉంటె వివాహము అనుమానమే. సప్తమాధిపతి బలంగ ఉంటె తప్ప వివాహం జరుగదు. వివాహసౌఖ్యం మరియు పరస్పరలైంగిక సామర్ద్యాలను శుక్రుని నుండి పరిశీలించాలి. శుక్రునినుండి 12వ స్థానాన్ని పరిశీలించి వారి యొక్క లైంగిక సామర్హ్యం మరియు సుఖాన్ని పరిశీలించాలి. సప్తమాధిపతి పంచమంలో లేదా లాభంలో ఉన్నా ,లాభాధిపతి సప్తమంలో ఉన్నా బహు వివాహలు జరుగుతాయి.సప్తమాధిపతి ద్వితీయంలో , ద్వితీయాధిపతి సప్తమంలో ఉంటె ద్వితీయ వివాహం.
పంచమాధిపతి సప్తమంలో సప్తమాధిపతి పంచమంలో ఉంటె వ్యక్తి తన జీవితభాగస్వామిని చాలాఇష్టపడి చేసుకుంటాడు.పంచమాధిపతి ,మరియు శుక్రుడు బలంగా ఉంటె వ్యక్తి ప్రేమలోపడతాడు .పైన చెప్పిన కలయికవలన కలత్రదోషం ఏర్పడుతుంది .అందువలన ఇద్దరి జాతకాలలో పైన చెప్పిన దోషాలు లేకుండా పరిశీలించి వివాహ నిర్ణయం చెయ్యాలి .సప్తమం ,సప్తమాధిపతులుపై లగ్నం లేదా చంద్రుని నుండి పరిశీలించినప్పుడు గురు ద్రుష్టి ఉంటె వివాహం సాంప్రదాయ పద్దతిలో తల్లితండ్రులు నిర్ణయించిన వివాహము సరియైన సమయంలో జరుగుతుంది.
వివాహ కారకుడైన చంద్రుడు, శుక్రుడు,సప్తమాధిపతి ఉన్న గ్రహాలతోరాహువు ,కేతువు సంబంధం ఉన్నా కులాంతర వివాహం జరిగే అవకాశము కలదు .
వీటితో పాటుగా ఇంకా అనేకం చూడవలెను.(1,2,4,5,7,8,12 భావాలు కూడ పరిశీలించాలి.)
No comments:
Post a Comment