Tuesday 20 February 2024

సృష్టిలో మనం ఏమి చేస్తామో… అదే తిరిగి మనకు చేరుతుంది!

 


నిజంగా జరిగిన కథ!

               

          (Newton’s Third Law)

*‘హ్యారీ’ ఒక పేద వృద్ధుడు. రోజూ రాత్రి వీధిలో పడుకునే అవసరం రాకుండా ఉండడం కోసం రోడ్డు పక్కన కూర్చుని డబ్బులు అడుక్కునేవాడు.

*ఒకరోజు ఉదయం, ఎప్పటిలాగే అతను చాప వేసుకొని, భిక్షాటన కోసం తన పాత్ర ను బయటపెట్టి, భిక్ష అడగడం ప్రారంభించాడు. సమీపంలో చాలా కార్యాలయాలు ఉన్నాయి, ప్రతిరోజూ ఉదయం చాలా మంది అతనిని దాటి వెళ్తుంటారు.     కానీ ఆ రోజు, అతని అభ్యర్థనలను ఎవరూ పట్టించుకోక పోవడంతో, నిరుత్సాహానికి గురయ్యాడు.

 *ఆ రోజు తన అదృష్టం మారబోతోందని అతనికి తెలియదు. 

*ఒక యువతి ఆ వీధిలో నడుస్తూ వెళ్తూ, ‘హ్యారీ’ని చిరునవ్వుతో పలకరిస్తూ, పాత్ర లో $.20 నోటు పెట్టింది. ఎవరైనా భిక్షలో ఇంత డబ్బు ఇవ్వడం ఇదే మొదటిసారి కావడంతో అతను ఆశ్చర్యపోయాడు! కృతజ్ఞతలు తెలుపుతూ, ఆ వృద్ధుడు ఆమె పేరు అడిగాడు.

*ఆమె నవ్వుతూ తన పేరు ‘సారా’ అని చెప్పింది. వృద్ధుడు చాలా సంతోషించి, "ఈ రాత్రి నేను వీధిలో పడుకోనవసరం లేదు! మీకు ధన్యవాదాలు, నేను ఈ రాత్రి ప్రశాంతంగా నిద్రపోగలను!" అని ఉత్సాహంగా ఆమెకు చెప్పాడు. 

*అప్పుడతను "నాకెందుకు ఇంత సహాయం చేసావు?" అని అడిగాడు.

*’సారా’ చాలా ప్రేమగా బదులిచ్చింది, "మనం ‘ఏ పని చేస్తే దానిని ఖచ్చితంగా ప్రకృతి  మనకు తిరిగి ఇస్తుంద’ని నేను నమ్ముతాను. ‘మనం చెప్పేది, చేసే ప్రతిదీ తిరిగి మన వద్దకే వస్తుంది!"

*వారు కాసేపు కబుర్లు చెప్పుకున్నారు, ‘సారా’ తన భోజన విరామం ముగియడంతో అక్కడి నుండి బయలుదేరవలసి వచ్చింది. ఆమె అతనికి మంచి జరగాలని కోరుకుంటూ, వీడ్కోలు పలికింది.

*కాసేపటి తర్వాత ‘హ్యారీ’ ఆ రోజుకి సరిపడా డబ్బు వచ్చిందో లేదో తెలుసుకోవడానికి వచ్చిన డబ్బును లెక్కించడం ప్రారంభించినప్పుడు, పాత్ర లో ఏదో మెరుస్తున్నట్లు గమనించాడు. అక్కడ పడి ఉన్న ఉంగరాన్ని చూసి ఆశ్చర్యపోయాడు, అది అక్కడికి ఎలా వచ్చిందా అని ఆశ్చర్యపోయాడు.

‘సారా’  డబ్బులు    వేసినప్పుడు  పొరపాటున పాత్ర లో ఉంగరం పడిపోయిఉంటుందని  అతనికి అనిపించింది.

వెంటనే ఆమె కోసం వెతకడానికి వెళ్ళాడు, వీధుల్లో చుట్టూ చూస్తూ, సమీపంలోని కార్యాలయాల్లో ఆమె కోసం అడిగాడు. కానీ ఆమె ఎక్కడా కనిపించకపోవడంతో వెతికి వెతికి అలిసిపోయాడు.

*అకస్మాత్తుగా, అతని మనస్సులో దురాశ మొదలైంది. ఆ ఉంగరం అమ్మితే కొన్ని నెలలపాటు వీధిలో పడుకునే అవసరం ఉండదని అనుకున్నాడు!

*వెంటనే ఒక స్వర్ణకారుని దుకాణంలోకి వెళ్లి, ఉంగరానికి ఎంత ఇస్తావని అడిగాడు. స్వర్ణకారుడు అతనికి $.4000/- ఇస్తానన్నాడు, అది విని హ్యారీ తన చెవులను   నమ్మలేక పోయాడు.  

*అతనికి అది చాలాపెద్ద మొత్తం! ఆ డబ్బు తీసుకుని కొన్ని నెలలు విలాసవంతంగా గడపాలని తాపత్రయపడ్డాడు. దానితో తాను పొందే అన్ని సౌకర్యాలను, ప్రశాంతంగా నిద్రపోగలిగే వెచ్చని రాత్రులను ఊహించుకోగలడు!

 కానీ …… 

*అకస్మాత్తుగా, ‘సారా’ మాటలు అతని చెవులలో మారుమ్రోగాయి: "మనం ఏమి చేస్తే, ప్రకృతి ఖచ్చితంగా మనకు దానిని తిరిగి ఇస్తుంది!"

*అది ఒక మెరుపులా తాకింది, ఆ మాటలు తిరిగి అతనిని వర్తమానంలోకి తీసుకువచ్చాయి, తప్పును గ్రహించాడు. ఉంగరాన్ని విక్రయించకూడదని నిర్ణయించుకుని, ‘సారా’ కోసం వెతకడానికి దుకాణం బయటకు వచ్చాడు. 

*సమీపంలోని అన్ని కార్యాలయాలకు వెళ్లాడు. అప్పుడు ఆమె వెనుక వీధిలో పని చేస్తున్నదని అనడం గుర్తువచ్చింది.

*అందుకని, ఆవీధిలోకి వెళ్ళాడు, ప్రతి కార్యాలయంలో ఆమెకోసం అడుగుతూ చివరగా, అక్కడ ఉన్న ఆఖరి కార్యాలయానికి చేరుకుని, "సారా అనే మహిళ ఇక్కడ పనిచేస్తుందా?" అని అడిగాడు.

*అక్కడ తను ఆమెను కనుగొన్నాడు.

*ఆమె అక్కడ అతనిని చూసి ఆశ్చర్యపోయి, కలవరపడి,  ‘ఏమన్నా సహాయం చేయాలా?’ అని  అడిగింది.

*వెంటనే ఆమె ఉంగరాన్ని తీసిఇచ్చి, ఇలా అన్నాడు, "ఇది మీదేనని నేను అనుకుంటున్నాను. మీరు డబ్బులు వేస్తున్నప్పుడు అది నా పాత్ర లో పడింటుంది." 

*ఆ ఉంగరాన్ని చూసిన ‘సారా’ సంతోషం మాటల్లో చెప్పలేనంతగా ఉంది. ఆమె ‘హ్యారీ’కి మనస్పూర్తిగా కృతజ్ఞతలు తెలిపింది. "మీరు దానిని తిరిగి తీసుకువచ్చినందుకు నేను నిజంగా కృతజ్ఞతతో ఉన్నాను. ఇది నాకు ఎంత విలువైనదో మీకు తెలియదు!" అని కన్నీళ్లు పెట్టుకుంది. 

*కానీ ఆమె తన ఆసక్తిని ఆపుకోలేక , "కావాలంటే, మీరు ఈఉంగరాన్ని అమ్మి, చాలా డబ్బు సంపాదించవచ్చు. మీరు దీనిని ఎందుకు తిరిగి ఇచ్చారు?" అని  అడిగింది.

 *’హ్యారీ’ ఇలా అన్నాడు, "మీరు నాకు చాలా ఉదారంగా సహాయం చేశారు. దానికి ప్రతిగా నేను చేయగలిగింది ఇదే. అదే కాకుండా, ఒక వివేకమైన మహిళ, ‘మనం ఏమి చేస్తే, ప్రకృతి ఖచ్చితంగా మనకు అదే తిరిగి ఇస్తుంది!’ అని చెప్పగా విన్నాను."

*వృద్ధుడి మాట వినగానే ఆమె గుండె దడదడలాడింది. అది తన పెళ్లి ఉంగరం అని, అతని దయను తాను ఎప్పటికీ మరచిపోలేనని వివరిస్తూ, హృదయపూర్వకంగా మళ్లీ కృతజ్ఞతలు తెలిపింది.

*ఇలా చెప్పి, హ్యారీ ఉంగరాన్ని తిరిగి ఇచ్చి వెళ్లిపోయాడు.

అతను వెళ్లిపోయిన తర్వాత, సారా సహోద్యోగి ('GoFundMe') ' గో ఫండ్ మీ' అనే వెబ్‌సైట్ ద్వారా ఆవృద్ధుడికి సహాయం చేయవచ్చని సూచించాడు. అక్కడ ఆమె తన కథను పంచుకోవచ్చు, ప్రజల నుండి విరాళాలు సేకరించవచ్చు.

*‘సారా’ సంతోషించి, "నేను ఇది ఖచ్చితంగా చేస్తాను. ఈ కథను చదివిన దాతలు విరాళాలు కూడా ఇస్తారని నేను నమ్ముతున్నాను" అని చెప్పింది.

*ఆమె ‘హ్యారీ’ కోసం క్రౌడ్ ఫండింగ్ పేజీని ప్రారంభించింది. తన ఉంగరాన్ని ఎలా పోగొట్టుకుంది, హ్యారీ దానిని ఎలా తిరిగి ఇచ్చాడు అని ఆమె వ్రాసిన కథనంతో అది బాగా ప్రాచుర్యాన్ని పొందింది. 

*ప్రజలు దయతో విరాళాలు ఇవ్వడం ప్రారంభించారు. 

*కొద్ది రోజుల్లోనే, ఆమె $.190,000 విరాళాలు సేకరించింది. ఆ తర్వాత హ్యారి ని వెతకడానికి బయలుదేరింది.

వారు మొదట కలుసుకున్న అదే స్థలంలో ఆమె అతన్ని చూసి, ఒక బ్యాగ్ ఇచ్చింది. అతనికి సహాయం చేయడానికి ఆమె తనకి అవసరమయ్యే వస్తువులను తెచ్చిందని అనుకుని చాలా కృతజ్ఞతలు తెలిపాడు. 

*అయితే బ్యాగ్ తెరిచి డబ్బులు చూసే సరికి నోరు మెదపలేకపోయాడు. 

*సారాను, "నాకు ఇంత డబ్బు ఎందుకు ఇస్తున్నావు?!" అని అడిగాడు.

*సారా చిరునవ్వుతో, "ఇది నీ నిజాయితీకి ప్రతిఫలం. నువ్వు సంపాదించుకున్నదే!", అని అంది.

*అతని నిజాయితీకి, దయకి ప్రజలు ఇష్టపడి, ' గో ఫండ్ మీ' ( GoFundMe ) ద్వారా  $.190,000 విరాళంగా ఎలా ఇచ్చారో, ఆమె చాలా ఆనందంగా వివరించింది. 

*ఇప్పుడు హ్యారీ ఇంక వీధిలో రాత్రులు గడపవలసిన అవసరం లేదు, ఈ డబ్బుతో తనకోసం ఒక స్వంత ఇల్లు కొనుక్కోవచ్చునని చాలా ఉత్సాహపడింది.

*ఇది విని ఉప్పొంగిపోయి, హ్యారీ ఆనందభాష్పాలతో సారాకు దీవెనలు ఇచ్చాడు. సారా హృదయం కూడా ఆనందంతో ఉప్పొంగింది. ఆమె వృద్ధుడికి వీడ్కోలు పలికినప్పుడు ఆమె కళ్ళు చెమ్మగిల్లాయి.

ఆమె వెళ్లిపోయిన తర్వాత, వృద్ధుడు ఆ బ్యాగ్‌లో ఒక కాగితం ముక్క ఉండటం చూశాడు, "ప్రకృతి ఎల్లప్పుడూ మనం చేసే పనిని తిరిగి మనకు అందిస్తుంది. ఏదో ఒకవిధంగా మన చర్యలు ఎల్లప్పుడూ మనవద్దకు తిరిగి వచ్చే మార్గం ఉంటుంది" అని రాసి ఉంది.

*”హృదయం ఎల్లప్పుడూ సత్యమే మాట్లాడుతుంది. మనకు సరైన మార్గనిర్దేశం చేస్తుంది, కానీ దురాశ, అహం మనల్ని తప్పుదారి పట్టిస్తాయి!" ✍️

సర్వేజనా సుఖినో భవంతు
శుభమస్తు
వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.
జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర
ACCANKSHA YEDUR
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
శ్రీ విధాత పీఠం
Ph: 9666602371

No comments:

Post a Comment