ఆదివాసీల మహాకుంభమేళాకు వేళ అయింది. ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతర ప్రారంభమైంది.. ఆదివాసీ సాంప్రదాయాల ప్రకారం వన దేవతల జాతరకు అంకురార్పణ జరిగింది. మేడారం సమ్మక్క - సారక్క జాతరలో అత్యంత కీలక ఘట్టమైన మండమెలిగే ఉత్సవాన్ని వైభవంగా నిర్వహించారు ఆదివాసీలు.జాతరకు సరిగ్గా వారం రోజుల ముందు ఈ మండమెలిగే పూజ చేస్తారు. ఈ పూజ జరిగిందంటే.. అధికారికంగా జాతర ప్రారంభమైనట్టే.. అంటే జాతర మొదలైందన్నమాట.. దీంతో భక్తజనం మేడారానికి పోటెత్తుతోంది.
ఫిబ్రవరి 21 నుంచి 24 వరకు మహా జాతర జరగనుంది. ఫిబ్రవరి 21న బుధవారం.. కన్నేపల్లి నుంచి సారలమ్మను గద్దెపైకి తీసుకొస్తారు. అదే రోజు పూనుగొండ్ల నుంచి పగిడిద్దరాజును, కొండాయి గ్రామం నుంచి గోవిందరాజును మేడారం గద్దలపైకి చేర్చుతారు.. 22న గురువారం.. చిలకలగుట్ట నుంచి సమ్మక్క తల్లిని తీసుకొచ్చి. గద్దెపై ప్రతిష్ఠించడంతో జాతర ప్రధాన ఘట్టానికి చేరుతుంది. 23న శుక్రవారం.. వన దేవతలు గద్దెలపై కొలువుదీరుతారు. 24న దేవతల వనప్రవేశంతో జాతర ముగుస్తుంది.
No comments:
Post a Comment