మనిషి ఎంత ఎత్తుకు ఎదిగితే అంత కఠినమైన పరీక్షలను, విమర్శలను ఎదుర్కోవలసి వస్తుంది.
ప్రపంచ చరిత్రలో మహత్కార్యాలను సాధించిన మహనీయులెందరో ఎన్నో అపజయాలను, విమర్శలను చవిచూశారు.
అయినా ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగి అద్భుతాలు సాధించారు.
సాహసాలు, సత్కార్యాలు సాధించాలనుకున్నప్పుడు ఇతరులు ఎగతాళి చేసినా, విమర్శించినా వెనకంజ వేయకూడదు. ఏకాగ్రతతో మన పని మనం చేసుకుంటూ ముందుకుసాగాలి. మార్పును అభిలషించాలి. నవ్విన నాపచేను పండుతుందని, మనల్ని అవహేళన చేసినవాళ్లే మన గురించి గొప్పగా చెప్పుకొనే రోజులు వస్తాయని గట్టిగా నమ్మాలి.
విమానం కనిపెట్టేముందు రైట్ సోదరులు,
అమెరికా అధ్యక్షుణ్ని కావాలని ఉందని చిన్నప్పుడే అనుకున్న బిల్‌క్లింటన్ సైతం ఎన్నో విమర్శలు ఎదుర్కొన్నారు.
వాటిని ధైర్యంగా ఎదుర్కొని తమతమ రంగాల్లో పరిణతి సాధించారు. ఎన్నిసార్లు ఓటమి ఎదురైనా తనకున్న ఆత్మవిశ్వాసమే థామస్ ఆల్వా ఎడిసిన్‌ను ఎలక్ట్రిక్ బల్బ్ కనిపెట్టేలా చేసింది.
సద్విమర్శలు మన పురోగమనానికి దారిచూపే కాంతిపుంజాలు. మన వికాసానికి తగిన పాఠాలై అవి మార్గదర్శకాలవుతాయి. మన వివేచనను, వివేకాన్ని జాగృతం చేస్తాయి. వాటిని స్వీకరించి ఆత్మస్థైర్యంతో ముందుకు సాగితే అనుకున్న లక్ష్యాలను తప్పక సాధిస్తాం. విజయ శిఖరాలను అధిరోహిస్తాం!
సర్వేజనా సుఖినో భవంతు
No comments:
Post a Comment