Wednesday 21 February 2024

నిత్య రాశి ఫలాలు

 


22.02.2024/బృహస్పవాసరే (గురువారము)

🐐 మేషం

 (22-02-2024)

ప్రారంభించబోయే పనుల్లో అలసట చెందకుండా చూసుకోవాలి. తోటివారితో జాగ్రత్తగా వ్యవహరించాలి. మనః పీడ ఉంది. మానసిక ప్రశాంతత కోసం శివనామాన్ని జపించడం ఉత్తమం.

🐐🐐🐐🐐🐐🐐🐐

🐂 వృషభం 

 (22-02-2024)

శుభకాలం. అసాధారణ పట్టుదలతో అనుకున్నది సాధిస్తారు. ఆదాయమార్గాలను పెంచుకుంటారు. ఆ మేరకు కొత్త నైపుణ్యాన్ని సంపాదిస్తారు. శని దైవారాధన శుభప్రదం.

🐂🐂🐂🐂🐂🐂🐂 

💑 మిధునం

(22-02-2024)

పనిలో శ్రమ పెరుగుతుంది. అనుకోని విధంగా ఆర్థిక అవసరాలు పెరుగుతాయి. ఒక వార్త మీ మనఃశ్శాంతిని తగ్గిస్తుంది. శ్రీఆంజనేయస్వామి సందర్శనం శుభప్రదం.

💑💑💑💑💑💑💑

🦀 కర్కాటకం 

(22-02-2024)

ప్రారంభించిన పనులలో ఇబ్బందులను అధిగమిస్తారు. మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. ఊహించిన ఫలితాలను అందుకుంటారు. భవిష్యత్తుకు సంబంధించిన కీలక నిర్ణయాలు తీసుకుంటారు. శనిదేవుని నామాన్ని జపించాలి.

🦀🦀🦀🦀🦀🦀🦀

🦁 సింహం

 (22-02-2024)

కుటుంబ సభ్యులతో ఒక శుభవార్తను పంచుకుంటారు. శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. మీ ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి. శ్రీవారి సందర్శనం శుభప్రదం. ప్రారంభించిన పనులలో ఆటంకాలను అధిగమిస్తారు.

🦁🦁🦁🦁🦁🦁

💃 కన్య

(22-02-2024)

ప్రారంభించిన పనులు విజయవంతం అవుతాయి. మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. మంచి సమయం. మొదలుపెట్టిన పనులను బుద్దిబలంతో చక్కగా పూర్తిచేయగలుగుతారు. ఇష్టదైవారాధన శుభప్రదం.

💃💃💃💃💃💃💃

⚖ తుల*

(22-02-2024)

ముఖ్య విషయాల్లో కుటుంబ సహకారం ఉంటుంది. మీ మీ రంగాల్లో జాగ్రత్తగా పనిచేయాలి. కీలక విషయాలను కొన్నాళ్లపాటు వాయిదా వేసుకుంటే మంచిది. కలహసూచన ఉంది. ప్రయాణాలు ఫలిస్తాయి. ఇష్టదైవ ప్రార్ధన మేలు చేస్తుంది.

⚖⚖⚖⚖⚖⚖⚖

🦂 వృశ్చికం

(22-02-2024)

ఒక ముఖ్యమైన పనిని ఎట్టకేలకు పూర్తిచేయగలుగుతారు. ఒక వార్త బాధ కలిగిస్తుంది. కొన్ని సంఘటనలు నిరుత్సాహపరుస్తాయి. ప్రశాంత చిత్తంతో ముందుకు సాగితే అన్నీసర్దుకుంటాయి. సూర్య ఆరాధన శుభప్రదం.

🦂🦂🦂🦂🦂🦂🦂

🏹 ధనుస్సు

22-02-2024)

లక్ష్యంపై ఏకాగ్రత తగ్గకుండా చూసుకోవాలి. కొన్ని సందర్భాల్లో నిపుణుల సలహాలు అవసరం అవుతాయి. ఉద్యోగంలో మీ పై అధికారుల సహకారం ఉంటుంది. సొంత నిర్ణయాలు పనిచేస్తాయి. మీ నిబద్ధతే మిమ్మల్ని ఉన్నతుల్ని చేస్తుంది. దుర్గాధ్యానం శుభప్రదం.

🏹🏹🏹🏹🏹🏹🏹 

🐊 మకరం

22-02-2024)

మీ మీ రంగాల్లో ఆశించిన ఫలితాలను రాబడతారు. అదృష్టం వరిస్తుంది. విందు, వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. కుటుంబ సభ్యులతో ఆనందకర క్షణాలను గడుపుతారు. శనిదేవునికి తైలాభిషేకం శుభప్రదం.

🐊🐊🐊🐊🐊🐊🐊

🏺 కుంభం

 (22-02-2024)

వృత్తి,ఉద్యోగ,వ్యాపారాలలో సందర్భానుసారంగా ముందుకు సాగితే శుభఫలితాలు అందుకుంటారు. మీ పట్టుదలే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. ఆర్థికంగా మిశ్రమ కాలం. ఆరోగ్య పరిరక్షణ అవసరం. శ్రీలక్ష్మీధ్యానంతో మనోబలం పెరగడంతోపాటు శుభప్రదం.

🏺🏺🏺🏺🏺🏺🏺

🦈 మీనం

21-02-2024)

ప్రారంభించిన పనులలో ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు. ఒక వ్యవహారంలో మీకు డబ్బు అందుతుంది. ఒక శుభవార్త మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. శని ని ఆరాధిస్తే మంచిది.

సర్వేజనా సుఖినో భవంతు
శుభమస్తు
వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.
జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర
ACCANKSHA YEDUR
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
శ్రీ విధాత పీఠం
Ph: 9666602371

No comments:

Post a Comment