🌾ఐశ్వర్యం అంటే అందరు ఏమనుకుంటారంటే ధనము ,
సంపదలు ,
ఆస్తులు ,
అంతస్తులు
అని అనుకుంటారు
కాని నిజమయిన ఐశ్వర్యము అంటే ...
🪷ఏ మనిషైతే శరీరము విడిచేనాటికి సంపూర్ణమైన ఆరోగ్యముతో జీవిస్తూ ఉంటాడో ,
🪷ఏ మనిషైతే శరీరము విడిచే నాటికి సంపూర్ణమైన ఆనందముతో జీవిస్తూ ఉంటాడో ,
🪷ఏ మనిషైతే శరీరము విడిచేనాటికి సంపూర్ణమైన ఆధ్యాత్మిక జ్ఞానం కలిగి ఉంటాడో అతడే ఐశ్వర్య వంతుడు.
🪷 దీనినే సంపూర్ణ ఐశ్వర్యం అంటారు.🪷
🪷అంతే గాని చనిపోయేంతవరకు సంపాదిస్తూ పోతూ,
సంపాదించిందంతా వైద్యాలయానికి పోయడం కాదు ఐశ్వర్యమంటే ,
🪷చనిపోయేంతవరకు ఇంటిలో గాని వీధిలోగాని ఘర్షణలతో జీవించడం కాదు ఐశ్వర్యమంటే ,
🪷చనిపోయేంతవరకు సంపాదించిన ధనము వల్ల శత్రువులను,
ఈర్షపరులను ఎవరు నాకు హాని తలపెడతారు అని భయముతో జీవించడము కాదు ఐశ్వర్యమంటే ,
🪷చనిపోయేంతవరకు నీ నిజస్వరూపాన్ని తెలుసుకొకుండా భగవంతునికోసం గుడి గోపురం తిరగడం,
తీర్ధయాత్రలు చేయడం కాదు ఐశ్వర్యమంటే ,
🪷వీటినన్న్నిటిని జయించినవాడే ఐశ్వర్య వంతుడు.
🪷శరీరము ఎవరైనా విడిచిపెట్టవలసినదే ఎవరైనా సరే ......
🪷పుట్టినవాడు మరణించక తప్పదు ,
మరణించినవారు మరలా పుట్టక మానరు.
🪷ఆత్మ అవినాశి ఆత్మకు చావు లేదు,పుట్టుకా లేదు.
🪷కాని వున్నదంతా ఈ శరీరానికే.
🪷అది తెలియక నేను ,నేను అంటూ వ్యామోహానికి గురై బాధపడుతున్నారు అందరు.
🪷ఈ జీవితంలో ఏవిదంగా ఆరోగ్యవంతునిగా జీవించాలో, ఏ విధంగా ఆనందంగా జీవించాలో, ఏవిధంగా ఐశ్వర్య వంతునిగా జీవించాలో, ఏవిధంగా ఆధ్యాత్మికంగా జ్ఞానంతో జీవించాలో తెలియజేసేదే యోగ సాధన.
🪷ఎవరు శరీరంతో వున్నంతవరకు ఏవిధంగానూ లోటుతో శరీరాన్ని వదలరాదు.....
No comments:
Post a Comment