.
మాఘ శుద్ధ షష్ఠి... దీన్నే వరుణ షష్ఠి అంటారు.
ఈ తిథి నాటి పర్వానికి వరుణ షష్ఠి అని పేరు. విష్ణు స్వరూపుడైన వరుణ దేవుడిని ఈనాడు ఎర్రచందనం , ఎర్రని వస్త్రాలు , పుష్పాలు , ధూపం , దీపంతో పూజించాలి.
మాఘ షష్ఠి... దీన్నే వరుణ షష్ఠి అంటారు. పడమర దిక్కుకు అధిష్టాన దైవంగా ఉండే ఈ దిక్పాలకునీ ఆరాధన చేయడం వల్ల మన శరీరంలో నీరు సంభదిత ఆరోగ్య సమస్యలు లేకుండా అనుగ్రహిస్తాడు. అదే విధంగా మనం గృహ నిర్మాణం మొదలు పెట్టినప్పుడు బోరు లేదా బావి నిర్మాణం చేపట్టినప్పుడు మనకు ఎలాంటి ఇబ్బంది లేకుండా భూగర్భ నీటిని సౌకర్యంగా ప్రసాదిస్తాడు. వరుణ గాయత్రి ని లేదా శ్రీమన్నారాణమూర్తి ని ధ్యానం చేయండి.
ఈరోజు ప్రాతఃకాలమున నదీ లేదా చెరువుస్నానం , కనీసం బావిస్నానం చేయుట అత్యుత్తమం. ఈ తిథి అష్టదిక్పాలకులలో పశ్చిమ దిక్పాలకుడయిన వరుణుడికి, లక్ష్మీనారాయణులకు ప్రీతికరమైనది, కనుక ఎర్రటిపుష్పాలతో అర్చించాలి. అలాగే వరుణిడి అనుగ్రహానికై వరుణగాయత్రి జపం చేయుటవలన జీవితంలో ఎప్పుడూ జలలోటు వుండదు. నిర్మాణాలపుడు , బావుల తవ్వకాలపుడూ వెంటనే జలం లభ్యమవును. జలసంబంధ వ్యాధులు తొలగిపోతాయి. ఈ వరుణడు శ్రద్ధావతి నగరవాసుడు. భార్యపేరు నీటిని , పాశహస్తధారి. ఈ శుభదినాన నారాయణుడి దర్శనం చేసుకోవాలి.
ఓం పశ్చిమేశాయ విద్మహే పాశహస్తాయ ధీమహి! తన్నో వరుణః ప్రచోదయాత్||.
No comments:
Post a Comment