Thursday 15 February 2024

రామాయణమ్ 15

 

..అస్త్రప్రయోగము తెలియటం ఎంత ముఖ్యమో ,ఉపసంహారము తెలియటం అంతే ముఖ్యము! ప్రయోగ,ఉపసంహారాలు రెంటినీ ముని వద్ద నుండి ఉపదేశము పొందాడు రామచంద్రుడు! 

ఆయనతో పాటు లక్ష్మణుడు కూడా ఉపదేశం పొందాడు.

.అలా మునితో నడుస్తూ నడుస్తూ ప్రయాణం సాగించారు!

వారికి అత్యంత మనోహరంగా ,ప్రశాంతంగా ,దేదీప్యమానంగా వెలుగొందుతూ ఉన్న ఒక ఆశ్రమము కనపడ్డది .అది చూడగనే రాముడు మునితో ఇన్ని కాంతులు వెదచల్లుతూ ప్రకాశమానంగా ఉన్న ఈ ప్రాంతము ఇలా ఉండటానికి కారణమేమిటి? అని ప్రశ్నించాడు!.

.మహర్షి అందుకు ప్రతిగా ,రామా ! ఇది పూర్వము విష్ణువు వామానావతారంలో నివసించిన పుణ్యభూమి ,ప్రస్తుతం నేను ఉంటున్నాను ,దీని పేరు సిద్ధాశ్రమము.

.ఆశ్రమంలో ప్రవేశించగనే అచట నివాసముండే మునులందరూ మహర్షికి ఎదురేగి స్వాగతం పలుకారు.

 ,రాముడు మహర్షితో స్వామీ మీరు యాగ దీక్షాస్వీకారం గావించండి మేము రక్షణబాధ్యతలు ఈ క్షణం నుండే స్వీకరిస్తున్నాము అని పలికి మహర్షి యాగ శాల చుట్టూ తిరుగుతూ వేయికళ్ళతో కాపలా కాస్తున్నారు!

.యాగము ఆరురోజులు కొనసాగుతుంది! అయిదురోజులు ఏవిధమైన విఘ్నము లేకుండా గడచిపోయింది ! 

.ఆరవ రోజు అన్నదమ్ములిద్దరూ ఏమాత్రము అజాగ్రత్త లేకుండా కళ్ళలో వత్తులేసుకొని కాపలా కాస్తున్నారు. తమ్ముడిని రాముడు హెచ్చరించాడు ఇంకా జాగ్రత్తగా ఉండమని!

.ఇంతలో అందరూ చూస్తూ ఉండగనే ఒక్కసారిగా యజ్ఞకుండంలోనుండి భగ్గుమని ఒక్కసారిగా అగ్నిజ్వాలలు పైకి లేచినవి! ఆ విధంగా జ్వలించటం రాబోయే ప్రమాదాన్ని సూచిస్తున్నది!.

.యజ్ఞం సాగుతున్నది మంత్రపూర్వకంగా ,శాస్త్రానుసారంగా యజ్ఞనిర్వహణగావిస్తున్నారు విశ్వామిత్రునితో కూడిన ఋత్విక్కులు. ఇంతలో ! ఆకాశం బ్రద్దలయినంత చప్పుడు !

ఒక్కసారిగా ఆకాశమంతా నల్లని మేఘాలావరించినట్లుగా మిడతలదండులాగా రాక్షస సైన్యం యాగశాల పయిన ఆకాశాన్ని కప్పివేసింది! చిమ్మచీకట్లు కమ్మినట్లున్నది! .

.పెద్దపెద్ద కడవలు పట్టుకొని మారీచ,సుబాహులు యజ్ఞకుండంలోకి రక్తధారలు కురిపిస్తున్నారు రక్తంతో ఆ వేదిక నిండిపోయింది!.

.((మారీచసుబాహులు నానారాత్రించరులతోడ నభమున మాయా

నీరదములుపన్ని యసృగ్ధారలు వేదిపయి గురిసి గర్జనలెసగన్

( భాస్కర రామాయణం నుండి)

.లక్ష్మణ చూడు నా "లా" వంచు విజయ లక్ష్మీ ధనుర్ఘోష లక్షణం బెసగ నెలకొని వినువీధి నిజదృష్టి నిలిపినాడట..

(ఇది గోనబుద్ధారెడ్డిగారు వ్రాసిన రంగనాధరామాయణంలోని వాక్యము).)

.వీరు చేస్తున్న దుష్కార్యాన్ని గమనిస్తూనే ఒక్కసారిగా విల్లు ఎక్కుపెట్టి నారిసారించి మానవాస్త్రం మంత్రించి విడిచిపెట్టాడు !

అది రయ్యిన దూసుకుంటూ వెళ్ళి మారీచుడికి తగిలి వాడిని తోసుకుంటూ తీసుకెళ్ళి నూరుయోజనాల దూరంలోని సముద్రంలో పడవేసింది! ఆ దెబ్బకు వాడిదిమ్మతిరిగి కళ్ళు బైర్లుగమ్మి మూర్ఛపోయాడు.

.మరల క్షణం కూడా వ్యవధి లేకుండా ఆగ్నేయాస్త్రాన్ని అభిమంత్రించి సుబాహుడిమీదకు వదిలాడు అది వాడి గుండెల మీద పిడుగులా కూలి శరీరాన్ని చీల్చి ఛిద్రం చేసి వాడిని నేల కూల్చింది !

మిగిలిన రాక్షసులందరూ రాముడు ప్రయోగించిన వాయవ్యాస్త్రం దెబ్బకు ఎక్కడివారక్కడ చెల్లాచెదురయై చెట్టుకొకరు పుట్టకొకరుగా నేల కూలారు!

.యజ్ఞం నిర్విఘ్నంగా పరిసమాప్తమయ్యింది.

.సర్వేజనా సుఖినో భవంతు

శుభమస్తు
వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.
జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర
ACCANKSHA YEDUR
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
శ్రీ విధాత పీఠం
Ph: 9666602371

No comments:

Post a Comment