ముత్యాలు కావాలనుకునేవారు సముద్రపు లోతులకు పోవాలే తప్ప ఒడ్డున నిలబడి వెతికితే దొరుకుతాయా?!
అదే విధముగా ఆత్మానందము కావలెనన్నా మన హృదయాంతరములోకి పోయి అందు కొలువైయున్న పరమాత్మను పట్టుకోవాలే తప్ప బాహ్యమైన, అల్పమైన పూజలతో సరిపెట్టుకోకూడదు.
సముద్రపు ఒడ్డున నిలబడి వెతికితే దొరికేవి కేవలం రాళ్లురప్పలే!
అలానే బాహ్యమైన పూజల వలన కూడా రాళ్ల మాదిరి ఆనందమే కలుగుతుంది.
రాయికి, ముత్యానికి పోలిక చెప్పలేము.
అలానే సాధారణ ఆనందానికి, ఆత్మానందానికి కూడా పోలిక చెప్పలేము.
ఆత్మానందము విలువ కట్టలేనిది, విశిష్టత కలది. ఇది మానవుని సహజ సంపద. కనుక ప్రతీ ఒక్కరూ బాహ్యమైన పూజలు తగ్గించుకుని అంతరంగమునందు భగవంతుని ఆరాధించుచూ ఆత్మానందము పొందుటకు సాధన చేయాలి.
No comments:
Post a Comment