Monday 26 February 2024

 


ఈ పువ్వును ఎంత మంది చూసారు ? ఈ పువ్వు విశిష్టత తెలుసుకుందామా ?

ఇందులో సహజ సిద్ధంగా శివ లింగము, ఆ శివ లింగానికి పడగ పడుతున్నట్లు పైన పువ్వు రేకులు ఉంటాయి. ఈ పువ్వును చూస్తే మనసులో భక్తి భావం కలగడం కూడా సహజమే. కార్తీక మాసంలో ఈ పువ్వుతో పూజలు చూస్తుంటాము. ఈ పువ్వు అన్ని చోట్లా పూయదట, అంతే కాదు అందరికీ కనిపించదు అని కూడా అంటుంటారు పెద్దలు. ఈ చెట్టు దగ్గరలో తప్పకుండా శివాలయం ఉంటుంది అని ప్రతీతి. దీనిని నాగమల్లి పువ్వు అని, శివ లింగం పువ్వు అని కూడా అంటుంటారు.

 పూర్వము కాశీ యాత్రకు వెళ్ళే శివ భక్తులు అడవుల మధ్య ప్రయాణించవలసి వచ్చేది. వారికి మార్గ మధ్యంలో ఈ శివలింగం పువ్వుల చెట్లు తారసపడేవి. ఈ పువ్వులను చూడగానే వారు దగ్గరలో శివాలయం ఉంటుందని గ్రహించి, ఆ పరిసరాల్లో గాలించేవారు. వారికి జీర్ణావస్థకు ( శిథిలావస్థకు ) చేరిన పురాతన శివాలయాలు దర్శనమిచ్చేవి. ఆ శివాలయాలను ఉద్ధరించేవారు. ఇలా కాశీకి వెళ్ళే మార్గంలో ఎన్నో అద్భుతమైన, మహామహిమాన్వితమైన శివాలయాలు పునరుద్ధరింపబడ్డాయి. ఈ పువ్వును శివ గణాలలో ఒకటి అని కూడా చెబుతుంటారు. ఈ పువ్వును, దర్శించడం, స్పర్శించడం విశేష పుణ్యప్రదం. 

ఓం నమః శివాయ శివాయ నమః ఓం🙏

సర్వేజనా సుఖినో భవంతు
శుభమస్తు
వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.
జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర
ACCANKSHA YEDUR
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
శ్రీ విధాత పీఠం
Ph: 9666602371

No comments:

Post a Comment