కేతుగ్రహ దోష నివారణకు వక్క గణపతి..
కేతువు జాతకంలో బలీహనంగా ఉన్నట్లయి తే... మానసిక బలహీనతలు, అతిభక్తి, జీవి తంపై విరక్తి, ఏకాంతంగా ఉండాలనే కోరిక, లేనివి ఉన్నట్టు ఊహించుకోవడం, తనలో తా నే మాట్లాడుకోవడం, తనను తాను చాలా గొ ప్పవాడిగా లేదా దేవుడు, దేవతగా ఊహించు కోవడం, దేన్ని చూసినా భయపడడం, ఉద్యో గం, భార్యాపిల్లలను వదిలివేసి దేశసంచారం చేయడం, పిచ్చివానిలా ప్రవర్తించడం, విచిత్ర వేషధారణ, సంతానం కలుగకపోవడం, గర్భం వచ్చి పోవడం, చిన్న పిల్లలకు తీవ్ర అనారో గ్యం, చదువులో ఆటంకాలు,అంటువ్యాధులు, వైద్యులు కూడా గుర్తిం చలేని రోగాలు కేతుగ్రహ దోషం వల్ల కలుగు ను.
కేతువు ద్వాదశ భావంలో ఉంటే బాలారిష్ట దోషం.పంచమంలో ఉంటే సంతాన సమస్యలు,చతుర్దంలో బలహీనంగా ఉంటే విద్యా సమస్యలు,ఇలా కేతుగ్రహ సమస్యలు ఉన్నవారు వక్క గణపతిని పూజిస్తే మంచి ఫలితాన్ని పొందవచ్చును.
వక్క(సుపారి)గణపతి ని కేతుగ్రహ దోషాలు ఉన్నవారు పూజిస్తే మంచిది.వక్క(సుపారి)గణపతి ని పూజించడం వలన కార్యాలు సఫలీకృతం కావడమే కాకుండా, గ్రహ సంబంధమైన దోషాలు కూడా తొలగిపోతాయని చెప్పబడుతోంది.
విద్య .. ఉద్యోగం .. వివాహం .. వ్యాపారం .. ఇలా దేనిలో అనుకున్న ఫలితాలను పొందాలన్నా అందుకు అడ్డుపడుతోన్న ఆటంకాలు తొలగిపోవాలి. అలాంటి ఆటంకాలు తొలగించే దైవంగా వినాయకుడు కనిపిస్తుంటాడు. అందుకే ప్రతిఒక్కరూ అత్యంత భక్తిశ్రద్ధలతో వక్క(సుపారి)గణపతి ని పూజిస్తూ వుంటారు.
సర్వేజనా సుఖినో భవంతు
No comments:
Post a Comment