భీష్మ ఏకాదశి సందర్భంగా...
రేపు మధ్యాహ్నం 12 గంటలకు తర్పణం ఇచ్చేటప్పుడు పఠించవలసిన సంకల్ప, తర్పణ, అర్ఘ్య శ్లోకాలు.
దక్షిణం వైపుకు తిరిగి
సంకల్పం:
యావత్ భూమండల శాంత్యర్ధం, మమ వంశాభివృధ్యర్ధం, భీష్మ దేవతా ప్రీత్యర్ధం, జల తిల తర్పణం కరిష్యే!
తిల తర్పణం:
(కొన్ని నువ్వులు చేతిలోకి తీసుకుని, బ్రొటన వేలు మీదుగా నీరు వదులుతూ... మూడు మార్లు వదలాలి)
వైయ్యాఘ్ర పధ్య గోత్రాయా, సాంకృత్య ప్రవరాయచ
గంగా పుత్రాయ భీష్మాయా, ఆజన్మ బ్రహ్మచారిణే
జల తర్పణం:
కొన్ని నీళ్ళు దోసిట్లోకి తీసుకుని, మూడు మార్లు అర్ఘ్యం వదులుతూ...
వసు నామావతారాయా, శంతనోరాత్మ జాయచ
అర్ఘ్యం దదామి భీష్మాయా, ఆబాల్య బ్రహ్మచారిణే
అపుత్రాయ దదామ్యేతత్, ఉదకం భీష్మ వర్మణే
No comments:
Post a Comment