2️⃣0️⃣/ఫిబ్రవరి /2️⃣0️⃣2️⃣4️⃣-మంగళవారం
🐐 మేషం
(20-02-2024)
శుభఫలితాలు ఉన్నాయి. సౌభాగ్యసిద్ధి ఉంది. ఒక ముఖ్యమైన సమస్య పరిష్కారం అవుతుంది. సమయానికి సహాయం చేసేవారు ఉన్నారు. నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. హనుమాన్ చాలీసా చదివితే మంచిది.
🐂 వృషభం
(20-02-2024)
లక్ష్యాన్ని దృష్టిలో ఉంచుకుని ముందుకు సాగి మంచి ఫలితాలను సాధిస్తారు. వ్యాపారంలో సొంత నిర్ణయాలు వికటిస్తాయి. కీలక విషయాల్లో తోటివారి సలహాలు తప్పనిసరి. కొందరి ప్రవర్తన మీకు ఇబ్బంది కలిగిస్తుంది. శత్రువులతో జాగ్రత్త. సమయాన్ని వృథా చేయకండి. నవగ్రహ ఆరాధన శుభప్రదం.
💑 మిధునం
(20-02-2024)
అనుకున్న పనులను అనుకున్నట్టు పూర్తిచేసి అందరి ప్రశంసలను అందుకుంటారు. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. సమాజంలో మంచిపేరు దక్కుతుంది. దైవారాధన మానవద్దు.
🦀 కర్కాటకం
20-02-2024)
ప్రారంభించబోయే పనులలో ఇబ్బందులు పెరగకుండా చూసుకోవాలి. అధికారులను ప్రసన్నం చేసుకునే విధంగా ముందుకు సాగండి. క్రమంగా సమస్యలు తగ్గుముఖం పడతాయి. తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి. మానసిక ప్రశాంతత తగ్గకుండా చూసుకోవాలి. శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయ సందర్శనం శుభప్రదం.
🦁 సింహం
20-02-2024)
దృఢమైన మనస్సుతో ముందుకు సాగండి. ప్రయత్నాలు ఫలిస్తాయి. బంధు ప్రీతి ఉంది. భోజన సౌఖ్యం కలదు. మానసిక ఉల్లాసాన్నిపొందుతారు. ఇష్టదైవధ్యానం శుభప్రదం.
💃 కన్య
(20-02-2024)
ఉద్యోగంలో శ్రమతో కూడిన ఫలితాలు ఉన్నాయి. కుటుంబ సమస్యలు ఇబ్బంది పెడతాయి. అధికారులతో కాస్త జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఇష్టదేవతా సందర్శనం శుభప్రదం.
⚖ తుల*
63 (20-02-2024)
ముఖ్యమైన కార్యక్రమాలలో ఆలస్యం జరిగే సూచనలు ఉన్నాయి. కొన్నివ్యవహారాలలో మీ శ్రమకు తగిన గుర్తింపు దక్కడానికి బాగా కష్టపడాల్సి వస్తుంది. అధికారులతో అప్రమత్తంగా ఉండాలి. విష్ణు సహస్రనామ పారాయణ మంచిది.
🦂 వృశ్చికం
63 (20-02-2024)
ఒక వ్యవహారంలో తోటివారి సహాయం అందుతుంది. ఇంటి వ్యవహారాల విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. అధికారులతో అప్రమత్తంగా ఉండాలి. కుటుంబంలో చిన్నపాటి అభిప్రాయబేధాలు వస్తాయి. దుర్గా స్తోత్రం చదవాలి.
🏹 ధనుస్సు
20-02-2024)
మంచిమనస్సుతో చేసే పనులు త్వరగా నెరవేరుతాయి. ఒక సంఘటన మీ మానసిక శక్తిని పెంచుతుంది. స్థానచలన సూచనలు కనిపిస్తున్నాయి. ప్రయాణాల్లో జాగ్రత్తలు అవసరం. మానసిక ప్రశాంతత తగ్గకుండా చూసుకోవాలి. శ్రీసుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆరాధన మేలైన ఫలితాలను ఇస్తుంది.
🐊 మకరం
(20-02-2024)
మీ అభివృద్ధికి సంబంధించిన వార్త వింటారు. బంధు, మిత్రులతో కలిసి శుభకార్యక్రమంలో పాల్గొంటారు. మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. కొన్ని సంఘటనలు మిమ్మల్ని ఉత్సాహపరుస్తాయి. ఆరోగ్యమే మహాభాగ్యమని మరువద్దు. సుబ్రహ్మణ్య భుజంగ స్తవం చదవాలి.
🏺 కుంభం
(20-02-2024)
వృత్తి,ఉద్యోగ,వ్యాపారాలలో ఆచితూచి ముందుకు సాగాలి. అధికారులతో నమ్రతగా ప్రవర్తించాల్సి ఉంటుంది. మీరు చేయని పొరపాటుకు నింద పడాల్సి రావచ్చు. నవగ్రహ శ్లోకాలు చదవడం మంచిది.
🦈 మీనం
(20-02-2024)
శుభ ఫలితాలు ఉన్నాయి. స్పష్టమైన ఆలోచనలతో మంచి ఫలితాలను సాధిస్తారు. ప్రారంభించిన పనిలో విజయం సిద్ధిస్తుంది. ఒక శుభవార్త మీ ఇంట్లో సంతోషాన్ని నింపుతుంది. ఒక ముఖ్య వ్యవహారంలో తోటివారి సాయం అందుతుంది. శివారాధన శుభప్రదం.
No comments:
Post a Comment