Thursday, 1 February 2024

పుష్య కృష్ణ అష్టమి



 కాలాష్టమి...ఫిబ్రవరి. 2, 2024, శుక్రవారం .

తిథి ప్రారంభం: 04:02 PM, ఫిబ్రవరి 02

Tithi Ends: 05:20 PM, Feb 03

పురాణాల ప్రకారం, శివయ్యను భైరవ రూపంలో పూజిస్తారు. హిందూ మత గ్రంథాల ప్రకారం, భైరవుడికి మూడు రూపాలు ఉన్నాయి. 

అందులో ఒకటి.... కాల భైరవ,

 రెండోది వటుక భైరవ, 

మూడోది రురు భైరవ. 

అయితే కాలాష్టమి రోజున కాలభైరవుడిని పూజించాలనే సంప్రదాయం ఉంది. ఈ పవిత్రమైన పర్వదినాన కాలభైరవుడికి ప్రత్యేక పూజలు చేయడం వల్ల జీవితంలో కష్టాలన్నీ తొలగిపోతాయని, శత్రువులపై విజయం సాధిస్తారని, ప్రతికూల శక్తుల నుంచి ఉపశమనం లభిస్తుందని పండితులు చెబుతారు. 

అంతేకాదు తాము కోరిన కోరికలన్నీ నెరవేరుతాయని చాలా మంది నమ్ముతారు. ఈ సందర్భంగా ఈసారి కాలాష్టమి శుభ ముహుర్తం ఏ సమయంలో వచ్చింది.. కాలాష్టమి వ్రతం ఆచరించే వారు ఎలాంటి పద్ధతులను పాటించాలనే పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.      

     పురాణాల ప్రకారం, కాలాష్టమి కాలభైరవునికి అంకితం ఇవ్వబడింది. ఈ పవిత్రమైన రోజున సూర్యోదయం కంటే ముందే నిద్ర లేచి స్నానం చేసి, ఉతికి బట్టలు ధరించాలి. ముందుగా పూజా గదిలో లేదా పరమేశ్వరుని ఆలయంలో పార్వతీ పరమేశ్వరులను పూజించాలి.

* ఇంట్లో కాలభైరవుడిని ఆరాధించే వారు పూజా ప్రదేశంలో నల్లని వస్త్రాలను పరచి, దానిపై పార్వతీపరమేశ్వరుల విగ్రహాన్ని లేదా ఫొటోను ప్రతిష్టించాలి.

* ఆ తర్వాత కాలభైరవుడికి నల్లని మినుములు, తీపి పదార్థాలను, పాలు, పెరుగు వంటి వాటిని నైవేద్యంగా సమర్పించాలి. వీటితో పాటు ఆవాల నూనె, బెల్లం నూనెను సమర్పించొచ్చు.కాలాష్టమి మంత్రాలు..

శివ పురాణం ప్రకారం, కాలాష్టమి వ్రతాన్ని ఆచరించే వారు కాలభైరవుడి ఆరాధన సమయంలో ఈ మంత్రాలను పఠించడం వల్ల ప్రతికూల శక్తుల నుంచి ఉపశమనం లభిస్తుంది.

కాలాష్టమి ప్రాముఖ్యత..

కాలాష్టమి రోజున ఉపవాస వ్రతాన్ని ఆచరిస్తూ.. కాలభైరవుడిని పూజించడం వల్ల అన్ని రకాల భయాల నుంచి విముక్తి పొందుతారని పండితులు చెబుతారు. ఈ పవిత్రమైన రోజున ఉపవాసం ఉండటం వల్ల తమ కోరికలన్నీ నెరవేరుతాయని, శుభ ఫలితాలొస్తాయని చాలా మంది నమ్ముతారు. అంతేకాదు భైరవుడిని పూజించడం వల్ల శత్రువుల నుంచి ఉపశమనం లభిస్తుంది.    

.కాలాష్టమి నాడు చేయాల్సిన పనులు..కాలాష్టమి నాడు ఎరుపు లేదా తెలుపు చందనంతో ఓ బట్టపై ‘ఓం నమ శివాయ’ అని శివలింగానికి సమర్పించాలి. పూజ చేసే సమయంలో మీ ముఖం తూర్పు లేదా ఉత్తరం వైపు ఉండేలా చూసుకోవాలి. కాలభైరవుడికి నిమ్మకాల హారం సమర్పించాలి. శని లేదా రాహు కేతువు దోషాలతో ఇబ్బంది పడుతున్న వారు కాలభైరవ ఆలయాన్ని సందర్శిస్తే మీకు శుభ ఫలితాలొస్తాయి

. అంతేకాదు మీ పెండింగ్ పనులన్నీ ఎలాంటి ఆటంకాలు లేకుండా పూర్తవుతాయి.

ఓం భం భైరవాయ నమః 

సర్వేజనా సుఖినో భవంతు
శుభమస్తు

వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.

జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర
ACCANKSHA
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
శ్రీ విధాత పీఠం
Ph: 9666602371

No comments:

Post a Comment