Friday, 9 February 2024

రామాయణమ్ 10

 .


విశ్వామిత్రమహర్షి మాటలు విన్నాడు దశరధుడు.

మనసొప్పటంలేదు ఆయనకు! ఇలా అంటున్నాడు!

.ఊన షోడశ వర్షేణ రామో రాజీవ లోచనః

న యుద్ధయోగ్యతామస్య పశ్యామి సహ రాక్షసైః

.రాజీవ లోచనుడైన నా రామునకు పదహారు సంవత్సరాలు ఇంకారాలేదు ( పదహారుకు ఒకటి తక్కువ ,ఊన అంటే -1 )

రాక్షసులతో యుద్ధం చేసే యోగ్యత ఉన్నదని నేను అనుకోవడంలేదు! .

.నా రాముడు ఇంకా బాలుడయ్యా! పూర్తిగా ఇంకా విద్యలే నేర్వలేదు ! అస్త్రాలు ఇంకా తెలువవు ! అలాంటి వాడు మాయావులైన రాక్షసులతో ఎలా యుద్ధం చేయగలడు ! కోరి కోరి కొడుకును కొలిమిలో ఎవరైనా నెట్టివేస్తారా!.

.మహర్షీ నేనే ధనుస్సు ధరించి మీవెంట నడుస్తాను ,నా వెంట మెరికల్లాంటి యోధులు ఒక అక్షౌహిణి సైన్యం నడుస్తుంది!

మీ యాగసంరక్షణ నేనుగావిస్తాను మునీంద్రా! .

.నా రాముడు బాలుడు! ముక్కుపచ్చలారని ముద్దుబిడ్డడు వాడిని విడచి ఒక్కక్షణమైనా నేను బ్రతుకజాలను!.

.అంతగా నీకు రాముడే కావలెనంటే అతనితోపాటు నన్ను నా చతురంగబలాలనూ కూడా తీసుకొని వెళ్ళు,అంతేకానీ ఒంటరిగా రాముని నే పంపజాలను!.

.మునిచంద్రా అసలు ఆ రాక్షసులు ఎవరు? ఎవరు పంపగా వారు నీ యాగానికి విఘ్నం గావిస్తున్నారు?.

.రాజా ఆరాక్షసులు రావణాసురుడు పంపగా వచ్చినవారు ,రావణుడు బ్రహ్మవరప్రసాది ! విశ్రవసు పుత్రుడు! 

వాడిచే ప్రేరేపింపబడి మారీచ సుబాహులనెడి వారు యజ్ఞవిఘ్నానికి పూనుకొన్నారు!

.అసలు విషయం వినగానే దశరధమహారాజు తీవ్రమైన వేదనకు గురి అయి మహర్షీ ! 

దేవ,దానవ,యక్ష,గంధర్వ, పతగ,పన్నగులలో రావణుని ఎదిరించువారులేరే ! 

నా పసికూన! రాముని ,వానికి ఎదురు వెళ్ళమంటావా! నన్ను క‌నికరించు మహర్షీ! నా కొడుకు పట్ల అనుగ్రహము చూపు !.

.మహర్షీ ! అంతటి బలవంతుడికి నేనుగానీ,నాసైన్యముగానీ ,నా కుమారుడుగానీ ఎదురునిలవలేము! యుద్ధము చేయజాలము!

.ఆ మారీచ ,సుబాహులు మాయావులు మహాబలవంతులు వారిలో నా స్నేహితులతో కలసికూడా ఎవరో ఒకరితోనే తలపడగలను అలాంటిది ఇద్దరితో  తలపడమని రాముని పంపటమా నా వల్ల కాదు! పంపనుగాక పంపను ! అని ఖండితముగా పలికాడు దశరధుడు!

.దశరధుడి ఈ అసంబద్ధ ప్రేలాపనలు విని మహర్షి ఒక్కసారిగా తోకతొక్కిన త్రాచు అయినాడు! యజ్ఞ కుండంలో నేయివోయ భగ్గున లేచిన పెనుమంట అయినాడు ,తీవ్రమైన కోపంతో కనులు అరుణ వర్ణం దాల్చాయి!.

.అడిగినది ఇస్తానని ప్రతిజ్ఞ చేసి మాట తప్పుతున్నావ్ దశరధా!ఇది రఘువంశ సంజాతులు చేయవలసిన పనికాదు! సరే నీ కొడుకుతో ,బంధుమిత్రులతో సుఖంగా ఉండు వచ్చిన దారినే నే వెడతాను అని తీవ్రమైన ఆగ్రహావేశాలతో కంపించిపోయాడు!.

.విశ్వామిత్రుని గురించి సకలము తెలిసిన మహర్షి వసిష్ఠుడు కల్పించుకొని !రాజా ! నీవు ఇక్ష్వాకుడవు ! నీ వంశమెట్టిది? లోకంలో మీరే ఆడిన మాట తప్పితే ఇంక మాటమీద నిలబడే వారెవరయ్యా! నీ మనసులో ఏ విధమైన శంకకు తావివ్వకు రాముని విశ్వామిత్రునితో యాగసంరక్షణార్ధమై పంపు!.

.ఈ విశ్వామిత్రుడెవరనుకొన్నావు? ఈయన సంరక్షణ లొనున్న రామునికి అస్త్రములు తెలిస్తే నేమి? తెలియకున్న నేమి?.

.విశ్వామిత్రుడు మూర్తీభవించిన ధర్మము! పరాక్రమవంతులలో శ్రేష్టమైన వాడు!

.ఈయనకు తెలిసినన్ని అస్త్రములు సకలభువనాలలో ఎవరికీ తెలియవు! మరి భవిష్యత్తులో కూడా ఈయనకంటే ఎక్కువగా ఎవరికీ తెలవవు!.

.ఈయనకు తెలిసిన శస్త్రాస్త్రాలెలాంటివో చెపుతాను విను!

.సర్వేజనా సుఖినో భవంతు

శుభమస్తు

వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.

జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర
ACCANKSHA YEDUR
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
శ్రీ విధాత పీఠం
Ph: 9666602371

No comments:

Post a Comment