జననం ధర్మమని, మరణం తప్పదని అందరికి తెలుసు 60 లేదా 70 కాకపోతే 80 సంవత్సరాలు
ఉత్త చేతులలో తల్లి గర్భంనుండి వచ్చాము, ఖాళీ చేతులలో భూగర్భంలోకి పోతాం.... తొలిస్నానం గుర్తులేదు, చివరిస్నానం తెలియదు...
నీ గురించి నీవు ఎక్కువ మాట్లాడుతున్నావ్ అంటే నీకు నేను అన్నది పోలేదన్నమాట...
జ్ఞానమున్న వారితో వాదించు ఓడినా జ్ఞానం వస్తుంది.
అజ్ఞానునితో వాదించకు నీ విజ్ఞతను కోల్పోతావు..
ఈ ప్రపంచమంతా అవకాశవాదులతోనే నిండి ఉంది, ఎవరు ఏ క్షణాన ఎలా ప్రవర్తిస్తారో తెలియదు. అందుకే అనుక్షణం అప్రమత్తంగా ఉంటే మంచిది.
మనం ఎంత మంచిగా ఉన్న ఎవరో ఒకరి కథలో చెడ్డవాళ్లమే, కాబట్టి ఇతరులకు నచ్చాలని నటిస్తూ బ్రతకడం కన్నా మనకు నచ్చినట్లు బ్రతికేయడం మంచిది..
బయట గరికగడ్డి పెరిగినంత తొందరగా తులసి చెట్టు పెరగదు.
అలాగే మోసం చేసేవాడు అభివృద్ధి చెందినంత వేగంగా మంచివారు అభివృద్ధి చెందలేదు..
ఈ రోజుల్లో నిజం నిదానంగా నడిచేలోపు, అబద్దం అందంగా తయారై అందర్నీ తనవైపు ఆకర్షిస్తుంది..
మీ దగ్గర డబ్బులేకుంటే మీ రక్తసంబంధంలోనే విలువుండదు అలాంటిది సమాజంలో ఎలా ఉంటుంది. ఒకప్పుడు గుణం చూసి దగ్గరయ్యేవారు, ఇప్పుడు ధనం చూసి దగ్గరవుతున్నారు...
ఎదుటి వ్యక్తి నీపై నేరుగా నెగ్గే దమ్ములేనప్పుడే నీ వ్యక్తిత్వాన్ని విమర్శించడం మొదలు పెడతాడు..
నీ నొప్పి నువ్వు గ్రహిస్తే ప్రాణాలతో బతికి ఉన్నావని అర్ధం, ఇతరుల నొప్పిని కుడా నీవు గ్రహించగలిగితే మానవత్వం గల మనిషిగా బతికి ఉన్నావని అర్ధం..
మీ వెనుక మీ గురించి తప్పుగా మాట్లాడుకునేవారి గురించి ఆలోచించకండి ఎందుకంటే...? వారిస్థానం ఎప్పుడు మీ వెనుకే...
సర్వే జనాః సుఖినో భవంతు,
శుభమస్తు.
వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.
జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర
AKAANKKSHA YEDHUR
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Snskrit), MSW, LLB)
శ్రీ విధాత పీఠం
ph: 96666౦2371
No comments:
Post a Comment