తొమ్మిది రోజులపాటు వినాయక విగ్రహాన్ని భక్తితో పూజించి ఊరేగింపుగా తీసుకువెళ్లి నీటిలో కలిపేయడం బాధాకరంగానే ఉంటుంది. కానీ అదొక సంప్రదాయం. నవరాత్రి ఉత్సవాలలో వినాయక విగ్రహాలను మట్టితో, ప్లాస్టిక్‌తో, పింగాణితో, రంగులతో, ఇతర పదార్థాలతో తయారు చేస్తారు. అదే ఆలయాల్లో గానీ, ఇళ్లలో గానీ పెట్టుకునే విగ్రహాలను లోహాలతో తయారు చేస్తారు. లోహాల్లో గూడసత్తు, ఇనుము, ఉక్కులను వాడరు. పంచలోహ విగ్రహాలు గానీ, కంచువి, వెండివి, బంగారం గానీ వాడతారు. అవి శాశ్వతంగా ఉంచి పూజలు చేయడానికి పనికొస్తాయి. ఇంట్లో విగ్రహాలైతే తొమ్మిది అంగుళాలకి మించినవి వాడకూడదంటారు. వా టిని రోజూ నియమ నిష్టలతో పూజించాలి. అం దుకే తొమ్మిది రోజుల పూజల తర్వాత తాత్కాలికంగా ఏర్పాటు చేసుకున్న వినాయక విగ్రహాలను ఉద్వాసన పలికి, ఎక్కడైనా ప్రవహించే నీటిలోగాని, లోతైనా నీటిలో గాని నిమజ్జనం చేస్తారు.
ఎన్నో అలంకరణలతో మనం పోషించుకునే ఈ శరీరం తాత్కాలికమేనని మూన్నాళ్ల ముచ్చటేనని, పంచభూతాలతో నడిచే ఈ శరీరం ఎప్పటికైనా పంచభూతాల్లో కలిసిపోవలసిందే అనే సత్యాన్ని వినాయక నిమజ్జనం మనకు తెలియ జేస్తుంది.
నిమజ్జనం ఎలా చేయాలి?
వినాయక చవితినాడు కానీ 3,5,7,9 రోజు కానీ విగ్రహాన్ని నిమజ్జనం చేయాలి. అంటే బేసి సంఖ్య ఉన్న ఏ రోజైనా స్వామిని నిమజ్జనం చేయొచ్చు. నిమజ్జనం చేసే ముందు గణపతికి భక్తితో ధూపదీప నైవేద్యాలు సమర్పించాలి. తీర్థ ప్రసాదాలను అందరూ భుజించి ఆ తరువాత సంప్రదాయ
బద్ధంగా నిమజ్జనం ఊరేగింపు నిర్వహించాలి. నిమజ్జన ఊరేగింపు సమయంలో ఉత్సాహంతో కేరింతలు కొట్టడం, పాటలు, నృత్యాలు చేయడం సహజమే. కాబట్టి ప్రతి ఒక్కరూ గణనాథుడ్ని నీటిలోకి జారవిడిచే ముందు ఈ శ్లోకాన్ని చెప్పుకోవాలని పెద్దలు చెబుతారు. ‘శ్రీ గణేశం ఉద్వాసయామి… శోభానార్థం పునరాగ మనాయచ’
సర్వే జనాః సుఖినో భవంతు,
వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.
follow us :
like and share
facebook page
https://www.facebook.com/vidhathaastornumerology/?view_public_for=1712439968969888
Printerest
https://in.pinterest.com/vastronumerology/sree-vidhatha-peetam/
https://twitter.com/VidhathaAstrolo
https://www.instagram.com/sreevidhathapeetam/
AKAANKKSHA YEDHUR
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Snskrit), MSW, LLB)
శ్రీ విధాత పీఠం
No comments:
Post a Comment