Tuesday 25 August 2020

ఆగస్టు 26 2020, నేటి రాశి ఫలాలు

 


మేషం: పనుల్లో జాప్యం జరిగినా పూర్తి చేస్తారు. ఆకస్మిక ప్రయాణాలలో కొత్త మిత్రులు పరిచయం అవుతారు. ఆత్మీయులతో ఏర్పడిన వివాదాలు పరిష్కార దశకు చేరుతాయి. వృత్తి, వ్యాపారాల్లో స్వల్ప లాభాలు పొందుతారు. ఉద్యోగులకు స్వల్ప మార్పులు.

వృషభం: ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా అవసరాలకు డబ్బు అందుతుంది. దూర ప్రాంతాల నుంచి విలువైన సమాచారం అందుతుంది. ఇంటా బయటా ప్రోత్సాహం లభిస్తుంది. వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. బంధువులను కలిసి ఆనందంగా గడుపుతారు.

మిథునం: కొత్త మిత్రులు పరిచయమవుతారు. కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. ప్రముఖులతో పరిచయాలు, సంఘంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. ముఖ్యమైన వ్యవహారాల్లో విజయం సాధిస్తారు.

కర్కాటకం: శ్రమ పెరుగుతుంది. పనులు నిదానంగా సాగుతాయి. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉన్నా సన్నిహితుల సహాయం అందుతుంది. వృత్తి, వ్యాపారాల్లో ఏర్పడిన ఆటంకాలు కొంతవరకు తొలగుతాయి.


 సింహం: సోదరుల నుంచి శుభవార్తలు అందుతాయి. వ్యవహారాలు సకాలంలో పూర్తి చేస్తారు. ముఖ్యమైన నిర్ణయాల్లో జీవిత భాగస్వామి సలహాలు తీసుకుంటారు. ప్రతిభా పాటవాలు వెలుగులోకి వస్తాయి.

కన్య: బంధువులతో ఏర్పడిన విభేదాలు తొలగుతాయి. ఇంటి నిర్మాణ ఆలోచనలు సాగిస్తారు. బాధ్యతలు పెరిగినా సమర్థవంతంగా నిర్వహిస్తారు. ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడతారు.

తుల: నూతన ఉద్యోగాలు పొందుతారు. సోదరులతో ఏర్పడిన వివాదాలను పరిష్కరించుకుంటారు. నూతన మిత్రులు పరిచయమై కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. వృత్తి, వ్యాపారాల్లో అభివృద్ధి సాధిస్తారు.


వృశ్చికం: చిన్ననాటి మిత్రులను కలిసి ఆనందంగా గడుపుతారు. ప్రముఖుల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. సంఘంలో విశేష ఆదరణ, వృత్తి, వ్యాపారాల్లో అభివృద్ధి సాధిస్తారు. ఉద్యోగాలలో ప్రోత్సాహం లభిస్తుంది. ఆర్థిక లావాదేవీలు లాభిస్తాయి. నూతన కార్యక్రమాల్లో విజయం సాధిస్తారు.

ధనుస్సు: దీర్ఘకాలిక రుణాలు కొంతవరకు తీరుస్తారు. ఆకస్మిక ప్రయాణాలు లాభిస్తాయి. బంధువులను కలిసి ఉల్లాసంగా గడుపుతారు. వివాదాలకు దూరంగా ఉండండి. ఆరోగ్యం, వాహనాల విషయంలో జాగ్రత్త అవసరం. ఉద్యోగాల్లో ఏర్పడిన ఒడిదుడుకులు తొలగుతాయి.

మకరం: ముఖ్య నిర్ణయాల్లో తొందరపాటు వద్దు. జీవిత భాగస్వామి సలహాతో ముందుకు సాగుతారు. వృత్తి, వ్యాపారాల్లో స్వల్ప లాభాలు పొందుతారు. ఉద్యోగులకు పనిభారం పెరిగినా సమర్థవంతంగా పూర్తి చేస్తారు.

కుంభం: నూతన వ్యక్తులతో పరిచయమై కొత్త వ్యాపారాలు ప్రారంభిస్తారు. దూర ప్రాంతాల నుంచి వచ్చిన సమాచారంతో ఆనందం కలుగుతుంది. ఆస్తి వివాదాలు తీరి లబ్ది పొందుతారు.

మీనం: ఇంటర్వ్యూలకు హాజరవుతారు. పనుల్లో విజయం సాధిస్తారు. విందు, వినోదాలు, శుభకార్యాల్లో చురుగ్గా పాల్గొంటారు. పాతబాకీలు వసూలవుతాయి. వృత్తి వ్యాపారాల్లో లాభాలు పొందుతారు.


సర్వే జనాః సుఖినో భవంతు,


శుభమస్తు.

 వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు,  ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.

జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర

AKAANKKSHA YEDHUR

(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Snskrit), MSW, LLB)

శ్రీ విధాత పీఠం

ph: 96666౦2371

No comments:

Post a Comment