Wednesday 12 August 2020

ధర్మ సందేహాలు : గృహం లో ఎటువంటి వృక్షములు పెంచవలెను? ,ఎటువంటి వృక్షములు పెంచకూడదు?

 


జ్యోతిష్య శాస్ర రిత్య గృహం లో ఎటువంటి వృక్షములు పెంచవలెను ,ఎటువంటి వృక్షములు పెంచాకోడదు ?
సంపదను పెంచే 5 మొక్కలు
మీ ఇంట్లో ఈ 5 రకాల మొక్కలను పెంచుకోవడం వలన సిరిసంపదలు, సుఖశాంతులు కలుగుతాయి. అవి ఏంటో తెలుసుకుందాం.
మొదటిది అత్యంత శుభప్రదమైనది తులసి మొక్క. కృష్ణ తులసి, లక్ష్మి తులసి రెండు కలిపి మీ ఇంట్లో తూర్పు ముఖంగా ఉంచి పెంచితే మీ మనస్సుకు ఎంతో ప్రశాంతత కలుగుతుంది. మీరు చేసే పనులలో విజయం కలగడమే కాకుండా శుభ ఫలితాలు కలుగుతాయి.
రెండవది ఉసిరి చెట్టు. ఉసిరిని మొక్కగా అయినా పెంచవచ్చు లేదా వృక్షం లాగా అయినా పెంచవచ్చు. ఉసిరి సాక్షాత్తు విష్ణు స్వరూపంగా పురాణాలు చెప్తాయి. కార్తిక మాసంలో ఉసిరి చెట్టుకు ఎంతో ప్రాధాన్యతను ఇస్తారు. ఉసిరి చెట్టును పెంచడం వలన మీ ఇంట్లో చెడు ప్రభావాలన్నీ తొలగిపోతాయి.
మూడవది మారేడు చెట్టు. దీనినే బిల్వ వృక్షం అని కూడా అంటారు. మారేడు చెట్టును ఆ సిరుల తల్లి యొక్క స్వరూపంగా మన పురాణ గ్రంధాలు చెబుతున్నాయి. సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపంగా చెప్పబడే మారేడు మొక్కను నాటడం వలన 7 జన్మల పాపం పోతుంది అని పండితులు చెప్తున్నారు. మారేడు చెట్టుకు ప్రతి శుక్రవారం 5 సార్లు ప్రదక్షిణ చేస్తే సంపాదకు ఎటువంటి లోటు ఉండదు. మారేడు ఆకును శుభ్రపరిచి దాని మీద తేనే వేసి ప్రతి శుక్రవారం తులసి చెట్టు దగ్గర ఉంచి నమస్కరిస్తే ధనానికి కొరత ఉండదు.
నాల్గవది అరటి చెట్టు. దీనిని మీ ఇంట్లో పెంచుకోవడం వలన అష్ట ఐశ్వర్యాలకు లోటు ఉండదు. అరటి మొక్కను పెరట్లో గాని కుండీలో గాని పెంచుకోవచ్చు.
ఐదవది అలోవేరా లేదా కలబంద మొక్క. ప్రతి ఇంట్లో పెంచుకోవడానికి వీలుగా ఉండే మొక్క. అందరి ఇంట్లో తప్పకుండా ఈ మొక్క ఉండాలి. ఏ ఇంట్లో అయితే ఈ మొక్క ఉంటుందో ఆ ఇంటికి ఉన్న నరదృష్టి, నరఘోష, శాపాలు అన్ని తొలగిపోతాయి. కలబంద మొక్క యొక్క వేరు ప్రధాన ద్వారం యొక్క కుడి వైపు కట్టడం వలన మీ ఇంట్లోకి ఎటువంటి చెడు శక్తులు ప్రవేశించవు.
కావున ఈ 5 మొక్కలను మీరు పెంచుకోవడం వలన మీరు ధనపరంగా  ఎటువంటి ఇబ్బందులు లేకుండా అష్టైశ్వర్యాలతో ఆనందంగా జీవిస్తారు.
దురదృష్టముని పెంచే వృక్షములు : 
సాధారణంగా ప్రకృతిలోని ప్రతి చెట్టు కూడా మానవ మనుగడకు ఎంతో పనిచేస్తుంది. “వృక్షో రక్షిత రక్షిత:” అని పెద్దలు చెప్పారు. అంటే చెట్లను మనం రక్షిస్తే మనలను చెట్లు కాపాడుతూ ఉంటాయి. చెట్ల నుండి ఔషధాలను, ఆహారాలను సంపాదిస్తారు. కాని ఒక చెట్టు మీ ఇంటి ముందు ఉండటం వలన చాలా అనర్ధాలు ఎదురవుతాయని పెద్దలు చెప్తున్నారు. ఆ చెట్టు ఏంటో, దాని వలన వచ్చే సమస్యలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
మీ ఇంటి ముందు ప్రవేశ ద్వారం వద్ద ములగ చెట్టును ఎప్పటికి పెంచకండి. ములగ చెట్టు ఇంటికి ఎడమ భాగంలో గానీ మీరు ఇంటి నుండి బయటకు వచ్చిన వెంటనే మీకు కనపడే స్థలంలో పెంచుకోవచ్చు. దీనిని మూఢనమ్మకం అని చాలా మంది భావిస్తారు. కాని దీని ప్రభావం తప్పకుండా ఉంటుంది. మరి ఆ ప్రభావం ఏంటో, ఎలా ఉంటుందో తెలుసుకుందాం.
మీలో చాలామంది ఇలా గమనించి ఉండవచ్చు. అదేంటంటే ఒకరు వ్యాపారం చేస్తూ ఉన్నప్పుడు మొదటి దశలో చాలా అభివృద్ధి చెంది తరువాత అకస్మాత్తుగా నష్టపోయి దివాళా తీస్తూ ఉంటారు. ఇలా ఎందుకు జరిగిందంటే వారు వారి ఇంటి ముందు తెలిసో తెలియక ములగ చెట్టును పెంచి ఉంటారు. అంతేకాదు దీని ప్రభావం భార్యాభర్తల మీద కూడా ఉంటుంది. పెళ్లి అయిన దంపతుల మధ్య సరైన అవగాహన లేకుండా అనుమాన జీవితం గడుపుతూ రోజు గొడవలు పడుతూ ఉంటారు. ఆనందంగా ఉండాల్సిన వారి జీవితం నరకంగా మారుతుంది. ఎవరి ఇంటి ముందు అయితే ఈ ములగ చెట్టు ఉండి లేచిన వెంటనే చూస్తూ ఉంటారో వారి ఇంట్లో వారికి ఎప్పుడు ఆరోగ్య పరంగా సమస్యలు ఉంటూనే ఉంటాయి. చివరికి పిల్లలు కూడా అనారోగ్యపాలవుతారు. కుటుంబంలో మనస్పర్ధలు, గొడవలు ఇతర సమస్యలు మొదలవుతాయి. ఆ ఇంట్లో దరిద్ర దేవత తిష్ట వేసుకుని కూర్చుంటుంది. మీరు అనుకున్న ఏ పనులు జరగవు. మీరు ఏ పని మీద బయటకు వెళ్ళిన మీకు ఇబ్బందులు తలెత్తుతాయి. ములగ చెట్టు మీ ఇంటి ముందు ఉంటె ఇలాంటి అనర్ధాలే సంభవిస్తూ ఉంటాయి.
అందుకే ములగ చెట్టు ఇంటి ముందు ఉంటే ముప్పు అని ఇంటి నుండి బయటికి వెళ్ళేటప్పుడు గాని ఇంటి లోపలి ప్రవేశించేటప్పుడు గాని ములగ చెట్టును చూడకూడదు అని చెప్తారు.ఎక్కడ కనపడని, అంతగా ఎవరు చూడని, తిరగని ప్రదేశంలో ఈ చెట్టుని పెంచుకోవచ్చు.ఒకవేళ మీ ఇంట్లో  ములగ చెట్టు ఉంటె దానిని ఆదివారం రోజున కొట్టి మీ ఇంటి వెనుక స్థలంలో పాతిపెట్టాలి. ఆ సందర్భంలో “ఓం వృక్షరాజా నమస్తేస్తుత్ అభిష్ట ఫలదాయనీ” అని చెప్పాలి. ఇలా చేయడం వలన ఎటువంటి దోషాలు ఉండవు.

సర్వే జనాః సుఖినో భవంతు,


శుభమస్తు.


 వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ,, సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు, పూజ ,హోమ,వివాహ,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ శాంతి పూజల సర్వీసెస్ కొరకు,  ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.


శ్రీ విధాత పీఠం

ph: 96666౦2371

No comments:

Post a Comment