పవనముక్తాసనం అనే సంస్కృత పదం. వాస్తవానికి మూడు పదాల మిశ్రం. ఇందులో పవన అంటే వాయు లేదా గాలి. ముక్త అంటే విడుదల లేదా విసర్జన. ఆసనం అంటే యోగాలో శరీర స్థితి. ఈ మూడు పదాల కలయికనే పవనముక్తాసనం అంటారు.
ఈ ఆసనం ద్వారా ఉదరము, పేగులలోని అదనపు గాలి బయటకు వస్తుంది. గ్యాస్ట్రిక్ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. సమస్యతో బాధపడుతున్నవారికి ఈ చాలా ఉపయుక్తంగా ఉంటుంది.
ఆసనం వేయు పద్దతి:
నేలపై వెల్లకిలా పడుకోవాలి.
మీ భుజాలు నేలపై విస్తారం పరచండి.
అరచేతులు నేల వైపు ఉండాలి.
కాళ్ళను మెల్లగా వెనక్కు మడవాలి.
పాదాలు నేలను తాకేటట్టు ఉండాలి. తరువాత
మెల్లగా ఊపిరితిత్తుల నిండా గాలి పీల్చుకోండి.
ఈ స్థితి నుంచి ఆసనం కింది చర్యలు చేయండి.
కాళ్ళను పాదాలకు వ్యతిరేక దిశలో మడవాలి.
మోకాళ్ళను ఛాతీభాగం వైపు తీసుకురండి.
అరచేతులను నేలపై ఒత్తి పట్టాలి.
భుజాలు, తల భాగాన్ని నేలకు వ్యతిరేకంగా పైకి తీసుకురండి.
మళ్ళీ ఒక్క మారు అరచేతులను నేలపై ఒత్తి పట్టాలి.
తుంటి, పిరుదలను మెల్లగా పైకి లేవనెత్తండి.
మోకాళ్ళను ఛాతీకి మరింత దగ్గరగా తీసుకురండి.
మోకాళ్ళు, పాదాలు సమేతంగా ఉండాలి.
అయితే తల కిందకు దించరాదు.
మడిచి ఉన్న మోకాళ్ళు, భుజాలను ఆలింగనం చేసుకునేలా ఉంచాలి.
మోకాళ్ళను ఛాతీభాగాన్ని హత్తుకునేలా చేయండి.
ఈ స్థితిలో ఊపిరి బిగబట్టి 5 సెకనుల పాటు ఉండాలి.
గాలి వదులుతూ మెల్లగా ఆసనం నుంచి అదే క్రమపద్దతిలో బయటకు రావాలి.
భుజాలు, తల, కాళ్ళను నేలను తాకించి ఉపశమనం పొందాలి.
ఇలా పలుమార్లు చేయాలి.
No comments:
Post a Comment