ఇంద్రజిత్తు బ్రహ్మాస్త్ర ధాటికి మూర్చిల్లిన లక్షణుడిని బ్రతికించడానికి సంజీవని మూలిక అవసరమవుతుంది.. ఈ మూలిక హిమాలయ పర్వతాలలో లభిస్తుందని హనుమంతుని ఆ పర్వతంలోని ఆ మూలికను తెమ్మని చెప్పి పంపుతారు...హిమాలయాలకు లంఘించిన హనుమంతునికి అక్కడి ప్రతి మొక్కా సంజీవని లాగానే తోస్తుంది... ఏమి చేయాలో అర్థం కాదు.. ఒక ప్రక్కన చూస్తే లక్ష్మణ స్వామి సకాలంలో మూలికను అందించలేదంటే తమకు దక్కడు... ఒకవేళ వేరే మూలికను తీసుకువచ్చినా ప్రయోజనం లేదు...ఇలాంటి తర్క మీమాంసలో మన ఆంజనేయుడు మొత్తం సంజీవని పర్వతాన్ని పెకిలించుకుని తన వెంట తీసుకువెళతాడు... తిరిగి లంకకు మొత్తం పర్వతంతో సహా వచ్చిన హనుమంతుని చూసి అసుర గణం, వానర గణం..శ్రీరాముల వారు ఆశ్చర్య పోతారు... హనుమంతుని స్వామి భక్తి అటువంటిది మరి... అందుకే ఆయన శ్రీరాముని ప్రియభక్తులయ్యారు... ఈ పర్వతం ఇంకా మన మధ్యే ఉంది.. అవును..ప్రస్తుతం ఇంకా ఇది శ్రీలంకలో చెక్కు చెదరకుండా ఉంది... ఇక్కడ ఉన్న ఎన్నోవేల రకాల మూలికలను వాటి ఔషధ గుణాలను చూసి ఎంతో మంది విదేశీయులు ఇక్కడికి పరిశోధనకై వస్తారట... చుట్టు ప్రక్కలి గ్రామాల ప్రజలు తమకు ఏ వ్యాధి వచ్చినా ఇక్కడి మూలికలే ఉపయోగించుకుంటారట... ఈ పర్వతం మీద ఉన్న మొక్కలు శ్రీలంకలో మిగిలిన ఏ ఇతర ప్రాంతాలలోనూ దొరకదు... ఈ మొక్కల ఆనుపానులు హిమాలయాలలో మాత్రమే కనపడతాయని తెలిసింది... మన రామాయణము నిజమేనని చెప్పేదానికి ఇంత కంటే ఇంకేమి ఋజువులు కావాలి...
వివాహ పొంతనలు ,శుభముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం,విదేశీయానం,గృహం,సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc),పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయప్రతిష్ట, గృహప్రవేశ౦, శాంతిపూజలు ,ఆధ్యాత్మికవస్తువులు Astrology ,numerology-name setting,-visiting cards,bussiness boards,banners setting, scientific vasthu without dismantling,gems ,pujas,homas,japas,vrathas,all puja services
Subscribe to:
Post Comments (Atom)
-
శివ ఆరాధనలలో అత్యంత క్లిష్టమైనది, ప్రత్యక్ష ఫలదాయకమైనది ఈ పాశుపత మంత్రము. పూర్వ కాలములో అర్జునునికి కృష్ణుని ద్వారా ఈ పాశుపత మంత్ర విధానము...
-
ఆదివారం పునర్వసు నక్షత్రంనాడు ఇప్పవేరు ని సేకరించి మొలత్రాడుకు కట్టుకుంటే వశీకరణ శక్తి కలుగుతుంది. అమ్మవారికి విప్పపులతో పూజించటం ఎంతో...
-
పూజా గదిలో ఎలాంటి విగ్రహాలు పెట్టాలి? మనకు మనశ్శాంతిని, ధైర్యాన్న...
No comments:
Post a Comment