మనసులో ఉండే కోరిక నెరవేరడానికి కూడా ఈ అమావాస్య రోజు చేసే ఈ చిన్న ప్రక్రియ మన కోరిక నెరవేరడమే కాకుండా సమస్యల నుంచి దూరం చేస్తుంది. 🔥🔥
💐💐💐పితృ దోషం తొలగడానికి చొల్లంగి అమావాస్య లేదా మౌని అమావాస్య లేదా పుష్య అమావాస్య,తమిళనాడు ప్రజలు తయ్ అమావాస్య అని పిలిచే ఈ రోజున చేయాల్సిన పూజలు, దానాలు ఏమిటో తెలుసుకుందాము. 💐💐💐
ఈ ఏడాది
చొల్లంగి అమావాస్య ఈ మాసంలో 9 ఫిబ్రవరి 2024న వస్తుంది.
ఈ రోజున పురాణ గ్రంధాలు సూచించిన కొన్ని నివారణలు చేయడం ద్వారా పితృ దోషం నుండి ఉపశమనం పొందుతారని నమ్మకం. చొల్లంగి అమావాస్య రోజున నువ్వులు, నువ్వులతో చేసిన వస్తువులను దానం చేయడం వల్ల విష్ణువు అనుగ్రహం లభిస్తుంది. అమావాస్య రోజున ఉపవాసం ఉండడం వల్ల పూర్వీకులు మోక్షం పొంది పుణ్యఫలం పొందుతారని మత విశ్వాసం. ఈ నేపథ్యంలో ఈ రోజు చొల్లంగి అమావాస్య రోజు ఎలాంటి చర్యలు తీసుకోవాలో తెలుసుకుందాం..
🌹🌹పుష్య మాసంలోని కృష్ణ పక్ష అమావాస్య తిథిని చొల్లంగి అమావాస్య లేదా మౌని అమావాస్య అంటారు. ఏడాది పొడవునా వచ్చే అమావాస్యలలో చొల్లంగి అమావాస్యకు విశేష ప్రాధాన్యత ఉందని గ్రంధాలలో చెప్పబడింది. 🌹🌹
🌹🌹చొల్లంగి అమావాస్య రోజున నువ్వులు, నువ్వులతో చేసిన వస్తువులను దానం చేయడం వల్ల విష్ణువు అనుగ్రహం లభిస్తుంది. 🌹🌹
🌹🌹 అమావాస్య రోజున ఉపవాసం ఉండడం వల్ల పూర్వీకులు మోక్షం పొంది పుణ్యఫలం పొందుతారని మత విశ్వాసం. ఇలా చేయడం వల్ల పూర్వీకులు సంతుష్టులై తమ వారసులను ఆశీర్వదిస్తారు. చేపట్టిన పనులు ఆటంకాలు లేకుండా అన్ని పనులు పూర్తవుతాయని విశ్వాసం. 🌹🌹
🌹🌹 అమావాస్య రోజున పూర్వీకులు వంశస్థులను కలవడానికి వస్తారని గరుడ పురాణంలో చెప్పబడింది. ఈ రోజున ఉపవాసం ఉండడం, పవిత్ర నదిలో స్నానం చేయడం, దానాలు చేయడం, నైవేద్యాలు సమర్పించడం ద్వారా పూర్వీకులు సంతుష్టులవుతారట. 🌹🌹
💐💐చొల్లంగి అమావాస్య రోజున బియ్యం పిండిలో పంచదార కలిపి దానిని చీమలకు ఆహారంగా అందించండి. ఇలా చేయడం వలన పూర్వీకుల దోషాలు తొలగిపోవడమే కాకుండా వారి ఆశీస్సులతో కోరిన కోరికలు నెరవేరుతాయి.
💐💐చొల్లంగి అమావాస్య రోజున తప్పనిసరిగా నల్ల నువ్వుల లడ్డూలు, నువ్వుల నూనె, దుప్పటి, ఉసిరి కాయలు, నల్లని వస్త్రాలను పేదవారికి దానం చేయాలి. ఇలా చేయడం వల్ల పితృ దోషం తొలగిపోతుంది.
💐💐అమావాస్య రోజున పవిత్ర నదిలో స్నానం చేసి నల్ల నువ్వులను దానం చేయడం ద్వారా పూర్వీకులు సంతుష్టులవుతారని పితృ దోషం నుండి విముక్తి పొందుతారని నమ్మకం.
💐💐పితృ దోషం పోవాలంటే చొల్లంగి అమావాస్య రోజున మీ పూర్వీకులను స్మరించుకుని ఆ రోజున సూర్య భగవానుడికి అర్ఘ్యం సమర్పించండి. అంతే కాకుండా రాగి పాత్రలో నల్ల నువ్వులు, ఎర్రటి పువ్వులను నీటిలో కలిపి ఈ నీటితో సూర్య భగవానుడికి సమర్పించండి.
💐💐ఈ రోజున రావి చెట్టుకు తెల్లటి మిఠాయిలను సమర్పించి.. చెట్టుకు 108 సార్లు ప్రదక్షిణ చేయండి. ఇలా చేయడం వల్ల మీ పూర్వీకుల ఆశీస్సులు మీకు లభిస్తాయి.
💐💐చొల్లంగి అమావాస్య రోజున ఇంటి దక్షిణ దిశలో తెల్లటి గుడ్డపై నల్ల నువ్వులను ఉంచి ఇత్తడి లేదా రాగిపై పితృ యంత్రాన్ని అమర్చండి. అనంతరం కుడి వైపున పూర్వీకులను స్మరిస్తూ నువ్వుల నూనె దీపం వెలిగించాలి. మధ్యలో నీటితో నింపిన స్టీల్ పాత్రను ఉంచండి. దానిపై స్టీల్ ప్లేట్, ప్లేట్ మీద నువ్వుల గింజలతో తయారు చేసిన ఆహారాన్ని ఉంచండి. అనంతరం ఆహారంపై తులసి ఆకులను ఉంచండి. తెల్లటి పుష్పాన్ని సమర్పించండి. ఈ నైవేథ్యంలో కొంత భాగాన్ని కుక్కకు, ఆవుకి ఆహారంగా అందించి మిగిలిన దానిని రావి చెట్టు కింద ఉంచండి. ఇలా చేసే సమయంలో మాట్లాడకుండా మౌనంగా ఉండాలి.
🔥🔥ఈ అమావాస్య రోజు ఇలా చేస్తే కోరికలు నెరవేరతాయి!🔥🔥
💐💐మౌని అమావాస్య పదాల్లో ఉన్న ఆధ్యాత్మిక తత్వం ఎంతో గొప్పది. దీనిని మౌని, అమా, వాస్య పదాలుగా విడగొట్టి.. మౌని అంటే- మాట్లాడకుండా మౌనంగా ఉండటం, అమ- చీకటి.. వాస్య అంటే కామం.
💐💐మౌని అమావాస్య పదాల్లో ఉన్న ఆధ్యాత్మిక తత్వం ఎంతో గొప్పది. దీనిని మౌని, అమా, వాస్య పదాలుగా విడగొట్టి.. మౌని అంటే- మాట్లాడకుండా మౌనంగా ఉండటం, అమ- చీకటి.. వాస్య అంటే కామం. దీని అర్థం పగటిపూట మౌనంగా ఉండి చీకటిని, కామాన్ని తొలగించుకోవడం. మౌని అమావాస్య రోజున ఉపవాసం ఉండి, మౌనవ్రతం పాటించి, నోటి నుంచి ఒక్క మాట కూడా రాకుండా జాగ్రత్త తీసుకుంటారు. గంగానదిలో స్నానం కూడా ఆచరిస్తారు. సాంప్రదాయకంగా మౌని అమావాస్యను జరుపుకోలేకపోతే, ఈ ఆచారాలను పాటించడం వల్ల అలాంటి ఫలితమే దక్కుతుంది.
💐💐గంగానదిలో స్నానం అందరికీ వీలుకాదు. కాబట్టి, ఇంట్లో స్నానం చేసేటప్పుడు ఆ నీటికి కాశీ గంగను కలిపి,🌹🌹‘గంగేచ యమునేచైవ గోదావరి సరస్వతి, నర్మదా సింధు కావేరి జలేస్మిన్ సన్నిధుం కురు.🌹🌹 అన్న మంత్రాన్ని ఉచ్చరించాలి. ఇలా చేయడం వల్ల దేశంలోని అన్ని పవిత్రనదుల ఆశీర్వాదం, వాటి అంశలు స్నానం చేసే నీటిలో చేరుతాయనేది శాస్త్రోక్తి.
💐💐అలాగే పితృ తర్పణాలకు మౌని అమావాస్య తిథి చాలా మంచి రోజు. పూర్వీకులను గుర్తు చేసుకుని, వారిని స్మరిస్తూ ఆశీస్సులు పొందుతారు. ధ్యానం, మంత్రోచ్ఛారణ, సంగీతం వినడం వల్ల మానసిక ప్రశాంతత, శాంత గుణం అలవడతాయి. మనస్సు మన అధీనంలో ఉంటుంది. చంద్రుడితో సంబంధం ఉన్నందున రుద్రాక్షమాలను ఈరోజు ధరించవచ్చు. అయితే, ఇవి ద్విముఖి లేదా షోడశ ముఖి (పదహారు ముఖాలు) అయివుండాలి. ఇవి ధరిస్తే ఆందోళన తగ్గి ప్రశాంతత చేకూరుతుంది. చంద్ర శిలను ధరించడం వల్ల కూడా సానుకూలత ఏర్పడుతుంది. కుక్కలు, ఆవులు, కాకులకు ఆహారం పెట్టడం పవిత్రంగా భావిస్తారు.
💐💐మౌని అమావాస్య రోజున శనిదేవుడిని కూడా పూజిస్తారు. తిలలు, నూనెతో అభిషేకం చేస్తారు. పేదలకు అన్నదానం, వస్త్రదానం చేయడం వల్ల గత జన్మలో పాపాలు తొలగిపోతాయి.
💐💐🔥🔥రోజంతా మౌనవ్రతం చేయలేని వారు మనసులోని కోరికను కాగితంపై తులసి లేదా పసుపు కొమ్ముతో రాసి అరచేతుల్లో ఉంచి, దానినే కళ్లార్పకుండా చూడాలి. ఇలా ఎంతసేపు చూడగలిగితే అంత వరకూ చూసి, రెప్పలు వేసే సమయం వచ్చినప్పుడు ‘ఓ ప్రకృతి మాతా.. నా ఈ కోరిక తీర్చు అని వేడుకోవాలి. మనసులోనే కోరుకుని, ఆ కాగితంపై నోటితో ఊది మడవాలి. అనంతరం దానిని పూజా మందిరంలో దేవుడి పటం వెనుక ఉంచితే’ ఆ కోరిక తప్పక నెరవేరుతుందని, అద్భుతం జరుగుతుందని ఋషులు చెప్పి ఉన్నారు... 🔥🔥💐💐
No comments:
Post a Comment