పురందర దాసు కర్ణాటక సంగీత పితామహుడు. గొప్ప వాగ్గేయకారుడు. ఆయన జన్మనామం శ్రీనివాస నాయక్. ఒకప్పుడు ధనార్జనే ముఖ్యంగా బతికిన వజ్రాల వ్యాపారి. పరమ పిసినారిగా ఉండేవాడు. పిల్లికి బిచ్చం పెట్టేవాడు కాదు. ఆయన భార్య పాండురంగడి భక్తురాలు. ఒకసారి తన భార్య చేసిన దానం వల్ల కోపగించుకున్న శ్రీనివాస నాయక్ కి పాండురంగని మహిమ అనుభవంలోకి వచ్చింది. దాంతో కన్ను తెరిచి, తన సంతానానికి కావలసిన డబ్బు ఉంచి, మిగిలిన సొమ్మంతా పేదవారికి పంచిపెట్టేడు. భార్యతో కలిసి పండరీపురం చేరాడు. కానీ ఆ రోజుల్లో మహమ్మదీయుల పరిపాలస పల్ల ఇబ్బందులు పడలేక, విజయనగర సామ్రాజ్య రాజధాని హంపి చేరాడు. శ్రీ కృష్ణ దేవరాయలు ఆశ్రయం పొందాడు. శ్రీకృష్ణ దేవరాయలు గురువైన వ్యాసరాయలు శుశ్రూష చేశాడు. వ్యాసరాయలే ఆయన పేరు పురందర దాసుగా మార్చారు. 'పురందర విఠలా' అనే మకుటంతో పురందర దాసు కన్నడ భాషలో అనేక కీర్తనలు రచించాడు. కర్ణాటక సంగీత సంప్రదాయంలో దాదాపు 80 రాగాలను సృష్టించాడు. నాలుగు లక్షల కీర్తనలు ఆలపించాడు. కాని ప్రస్తుతం కొన్ని వేల కీర్తనలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. అన్నమయ్య వలెనే పురందరదాసు కూడా తిరుపతి వేంకటేశ్వర స్వామి భక్తుడు. ఒకసారి తిరుమలలో అన్నదానం చేస్తున్న పురందరదాసుకు ఆ వేంకటేశ్వరుడే స్వయంగా నేతిగిన్నె అందించాడని చెబుతారు. శరణు వేంకటరమణా అనే పురందరుల కీర్తన ప్రసిద్ధమైనది. త్యాగరాజ పంచరత్న కీర్తనల వలె పురందరుల న పురందరులు 1464 సంవత్సరం
లో జన్మించి, 1563 పుష్యమాస బహుళ అమావాస్య నాడు హంపి లో సిద్ధిపొందారు. తిరుమలలో అలిపిరి నుంచి కొండ పైకి వెళ్ళే మార్గంలో పురందర దాసు విగ్రహాన్ని నెలకొల్పారు. ఆయన సాహిత్యం ‘దాస సాహిత్య ప్రాజెక్టు' పేరుతో ప్రచారం సాగుతోంది. ఏటా పురందర దాసు ఆరాధనా ఉత్సవాలను దాస ప్రాజెక్టు ఆధ్వర్యంలో తిరుపతి లోను, హంపి, పండరీపురం, మంత్రాలయ, మైసూర్ మహారాజు ప్యాలెస్ లోను
ప్రత్యేకంగా నిర్వహిస్తారు.
No comments:
Post a Comment