Thursday, 8 February 2024

సింహాద్రి అప్పన్న తెప్పోత్సవం :

 


చందనోత్సవం తరువాత సింహాద్రిలో అంత భారీగానూ నిర్వహించే అప్పన్న తెప్పోత్సవం కన్నుల పండువగా ఉంటుంది. మూడులోకాలలోనూ నృసింహునికి సాటిదైవం లేడు. సింహాచలం వంటి క్షేత్రం లేదు. సింహాద్రి అప్పన్న సేవకోసం జన్మించిన గంగధార వంటి తీర్థం లేదు. సింహాచలం కొండ దిగువన వరాహ పుష్కరిణి ఉంది. గంధం అమావాస్య, వైశాఖ పౌర్ణమి రోజులలో ఉత్తరాంధ్రలోని సముద్రతీర ప్రాంత వాసులు పుష్కరిణికి వచ్చి పూజలు చేస్తారు. ప్రతి ఏటా పుష్య అమావాస్య రోజున సింహాద్రి అప్పన్న వేణుగోపాలస్వామి అలంకరణతో ఉభయదేవేరులతో కలిసి వరాహ పుష్కరిణిలో హంస వాహనంపై విహరిస్తాడు. వరాహ పుష్కరిణి సింహగిరి కొండ క్రింద అడవివరం గ్రామంలో ఉంది. కృష్ణుని రూపంలో అలంకరించిన స్వామివారిని కొండపైనుంచి ప్రత్యేకంగా అలంకరించిన పల్లకిలో మెట్లమార్గం గుండా కొండదిగువకు తీసుకువస్తారు. తొలిపావంచా వద్ద స్థానికులు స్వామికి స్వాగతం పలుకుతారు. అక్కడి నుంచి వరాహ పుష్కరిణికి నేరుగా తీసుకు వెళతారు. ప్రత్యేక ఆసనంపై స్వామిని ప్రతిష్ఠిస్తారు. ప్రత్యేక పూజల అనంతరం హంసవాహనంపై వరాహ పుష్కరిణిలో ఊరేగిస్తారు. ఉద్యాన మండపానికి తీసుకెళ్లి మరోసారి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. సర్వజన మనోరంజకం వాహనంపై స్వామివారిని అధిష్టింప చేసి తిరువీధి ఉత్సవం నిర్వహిస్తారు. అనంతరం మెట్లమార్గంలో ఉత్సవ మూర్తులను సింహగిరికి తీసు కువెళ్తారు. తెప్పోత్సవం సందర్భంగా పుష్కరిణి రోడ్డును దేదీప్యమానంగా అలంకరిస్తారు. వేలాది భక్తజనుల మధ్య సింహాద్రి అప్పన్న తెప్పోత్సవం వైభవంగా జరుగుతుంది

సర్వేజనా సుఖినో భవంతు
శుభమస్తు

వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.

జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర
ACCANKSHA YEDUR
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
శ్రీ విధాత పీఠం

No comments:

Post a Comment