Thursday, 8 February 2024

రామాయణమ్ 9

 


కుశిక వంశీయుడు,గాధి కుమారుడు అయిన విశ్వామిత్రుడు వచ్చినాడని మీ రాజుకు ఎరుక పరచండి! మహారాజ దర్శనం కోరుతూ వచ్చిన ఒక మునిపుంగవుడు పలికిన పలుకులివి.

.ద్వారపాలకులు ఆ వచ్చిన వ్యక్తిని చూచి భయముతో వణకిపోయి దశరధసముఖమునకు శీఘ్రమే చేరి మహర్షివిశ్వామిత్రుని ఆగమనాన్ని ఆయనకు తెలిపినారు!.

.అంతటి పరమపూజనీయుడయిన మహర్షి తన నగరుకు రావటాన్ని తన పుణ్యఫలంగా భావించి, దశరధుడు ఆయనకు ఎదురేగి అర్ఘ్యపాద్యాదులనిచ్చి, ఒక ఉచిత ఆసనం అలంకరింపచేసి అంజలిఘటించి నిలుచున్నాడు.

మహారాజు వినయ విదేయతలకు సంతసించిన మహర్షి దశరధుడిని కుశలప్రశ్నలు వేసి అందరి క్షేమము విచారించినాడు!.

.మహర్షి ఎదుట నిలుచున్న దశరధుడు ఆయన రాకలోని ఆంతర్యమేమిటో తెలియనివాడై ,మహర్షిని ఏ పని మీద మీరు ఇచటికి వచ్చినారో సెలవిండు ,మీ కార్యము ఎటువంటిదైనా తప్పక నెరవేర్చెదను, నా వద్దనున్న సమస్తము మీ పాదాక్రాంతము చేస్తున్నాను మీ కేమికావాలో తీసుకొనుడు అని సవినయంగా ప్రార్ధించాడు.

.అప్పుడు బ్రహ్మర్షి తాను వచ్చిన పని బయటపెట్టాడు ! 

.మహర్షికోరిక తెలుసుకొని ఒక్కసారిగా నవనాడులూ కృంగిపోయి ,జవసత్వాలుడిగినవానిలాగా నీరసించాడు దశరధుడు! .

.ఆ కోరిక ఏమై ఉంటుంది? .

.మహారాజును పంచప్రాణాలు అడిగినా సంతోషంగా అప్పటికప్పుడు ఇచ్చేవాడు ,

కానీ ఆయన అడిగింది ! శ్రీరాముని తనతో పంపమని !

. క్రూర,ఘోర రాక్షసులైన మారీచ ,సుబాహులనుండి మహర్షి చేసే యాగాన్ని రక్షించడం కోసం ముక్కుపచ్చలారని తన ముద్దుబిడ్డడిని పంపాలట!

.మహర్షి కోరిక వినగానే మ్రాన్పడిపోయాడు దశరధుడు!

.మహర్షి కోరిక ఆయన హృదయాన్ని నిలువునా కత్తితో చీల్చినట్లయినది ,తన ముద్దులమూట,ముక్కుపచ్చలారని పసికూన ,నిండా పదహారు నిండనివాడు ,అరవిచ్చినతామరల వంటి కన్నులుగల తన గారాలపట్టిని ఈ మహర్షివెంట అడవులకు పంపడమా! మనసు ససేమిరా అంటున్నది!.

.మహారాజు మదిలోని ఆలోచనలు పసిగట్టిన మహర్షి !

దశరధా ! 

రాముని గురించి నీ కేమి తెలుసని అలా ఆలోచిస్తున్నావు!

.అహం వేద్మి మహాత్మానం రామం సత్యపరాక్రమమ్

వసిష్టోపి మహాతేజా యే చేమే తపసి స్థితాః.

.రాముడెవరో నాకు తెలియును,నీ కుల గురువైన వసిష్ఠునకు తెలియును, ఈ ముని సంఘాలకూ తెలియును! 

.రామునికి తప్ప నా కార్యము చేయుటలో ఎవరికినీ సామర్ధ్యము లేదు! రాముని ఎదుట మారీచ,సుబాహులు ఏవిధముగనూ నిలువజాలరు!

.న చ తౌ రామమాసాద్య శక్తౌ స్థాతుం కథం చన!.

.అని ఇంకా చెపుతున్నారు మహర్షి!..

సర్వేజనా సుఖినో భవంతు
శుభమస్తు

వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.

జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర
ACCANKSHA YEDUR
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
శ్రీ విధాత పీఠం

..

No comments:

Post a Comment