విష్ణుసంకీర్తనం
ప : చాలదా బ్రహ్మ మిది సంకీర్తనం మీకు
జాలెల్ల నడఁగించు సంకీర్తనం
చ : సంతోషకరమైన సంకీర్తనం
సంతాప మణఁగించు సంకీర్తనం
జంతువుల రక్షించు సంకీర్తనం
సంతతముఁ దలఁచుఁ డీసంకీర్తనం
ప : చాలదా బ్రహ్మ మిది సంకీర్తనం మీకు
జాలెల్ల నడఁగించు సంకీర్తనం
చ : సంతోషకరమైన సంకీర్తనం
సంతాప మణఁగించు సంకీర్తనం
జంతువుల రక్షించు సంకీర్తనం
సంతతముఁ దలఁచుఁ డీసంకీర్తనం
చ : సామజముఁ గాంచినది సంకీర్తనం
సామమున కెక్కు డీసంకీర్తనం
సామీప్య మిందరికి సంకీర్తనం
సామాన్యమా విష్ణుసంకీర్తనం
చ : జముబారి విడిపించు సంకీర్తనం
సమబుద్ధి వొడమించు సంకీర్తనం
జమళిసౌఖ్యములిచ్చు సంకీర్తనం
శమదమాదులఁ జేయు సంకీర్తనం
సామమున కెక్కు డీసంకీర్తనం
సామీప్య మిందరికి సంకీర్తనం
సామాన్యమా విష్ణుసంకీర్తనం
చ : జముబారి విడిపించు సంకీర్తనం
సమబుద్ధి వొడమించు సంకీర్తనం
జమళిసౌఖ్యములిచ్చు సంకీర్తనం
శమదమాదులఁ జేయు సంకీర్తనం
No comments:
Post a Comment