Sunday, 3 July 2016

జాతక చక్రం ద్వారా దిక్కుల నిర్ణయం

జాతక చక్రం ద్వారా దిక్కుల నిర్ణయం





 జాతకచక్రం ద్వారా జాతకుడికి ఏ దిక్కు కలసి వస్తుందో అష్టకవర్గు ని పరిశీలించి తెలుసుకోవచ్చు.అష్టక వర్గుని పరిశీలించి జాతకుడికి నివశించే ఇల్లు ఏ దిక్కు కలిసి వస్తుందో తెలుసుకోవచ్చు.వ్యాపారం చేసే షాపు ఏ దిక్కున కలసి వస్తుందో అష్టక వర్గుని పరిశీలించి తెలుసుకోవచ్చును.


1)అగ్నితత్వ రాశులైన మేషం,సింహ,ధనస్సు రాశులు (1,5,9 రాశులు) తూర్పు దిక్కును తెలియజేస్తాయి.
2)భూతత్వ రాశులైన వృషభం,కన్య,మకర రాశులు (2,6,10 రాశులు) దక్షిణ దిక్కును తెలియజేస్తాయి.
3)వాయుతత్వ రాశులైన మిధునం,తుల,కుంభ రాశులు (3,7,11 రాశులు) పడమర దిక్కును తెలియజేస్తాయి.
4)జలతత్వ రాశులైన కర్కాటకం వృశ్చికం,మీన రాశులు (4,8,12 రాశులు) ఉత్తర దిక్కును తెలియజేస్తాయి.
అగ్ని,భూ,వాయు,జల తత్వ రాసుల యొక్క సర్వాష్టక వర్గుల యొక్క బిందువుల మొత్తాన్ని కలపగా ఏ తత్వ రాశులకు ఎక్కువ బిందువులు వస్తాయో ఆ దిక్కునకు లోబడి ఉంటే మంచి సంతృప్తి, అభివృద్ధి, జీవనోపాది, సంపాదన ఉంటుంది

No comments:

Post a Comment