Friday, 2 February 2024

భగవంతునికి ఇష్టమైన పూలు

 

              


చాలా మందికి తెలీదు, మొదటి మెట్టు అయిన, భౌతిక పూజ కోసం, బయట చెట్ల పూలకోసం పరుగులు తీసి, వాటితో గంటలు గంటలు నామస్మరణతో, దండలు చేసి,దేవునికి సమర్పిస్తారు. దీనివలన పుణ్యమే వారి మానసిక స్థితిని బట్టి, కానీ, మనకు ఎక్కువ పుణ్యం కావాలి కదా.  

ఇంకొంత మంది ఆ ఓపిక కూడా లేక, తేలికగా ధనంతో కొన్న మాల వేస్తారు, డబ్బుకు దేవుడు లొంగుతాడు అని, తమ అదృష్టము ఉన్నంతవరకు.

కానీ దేవునికి కావలసింది, భౌతిక పూలు కాదు. మానసిక పూలు, అందుకే ఆయన అన్నారు, పత్రం ఫలం తోయం, నువ్వు ఏమి ఇచ్చావు అన్నది ముఖ్యము కాదు. ఎలాంటి మంచి నిర్మలమైన భక్తి మనసుతో ఇచ్చావు అన్నది ముఖ్యం. 

మరి మంచి మనసు అంటే, మనసా వాచా కర్మణా(త్రికరణశుద్ది), అన్ని ఒకే విధముగా ఉండాలి. మామూలు పూలతో, బయట నటించే వారు చాలా మంది ఉన్నారు. కాని, మానసిక పూలతో, సంవత్సరాలు నటించడం కష్టం, అందరికీ తెలిసిపోతుంది, తమ నటన.

మరి ఆ పూలేమిటో చూద్దామా…

మానస పూజారాధకులకు అష్టపుష్పపూజ అనేది ఉన్నది.

*అష్టపుష్ప మానస పూజ:

*శ్లో. అహింసా ప్రథమం పుష్పం - పుష్పమింద్రియ నిగ్రహః సర్వభూతదయా పుష్పం క్షమా పుష్పం విశేషత || శాంతి పుష్పం, తపః పుష్పం - ధ్యాన పుష్పం తథైవచ సత్య మష్టవిధం పుష్పం - శివ ప్రీతికరం భవేత్‌ ||*

(శివా! ఈ పుష్పాష్టకంతో నీవు సంతృప్తుడవయ్యెదవు గాక! అహింస, ఇంద్రియచాపల్యరాహిత్యం, అన్ని ప్రాణుల పట్ల దయ, కష్ట నష్టాలను భరించగలిగే ఓర్పు, అన్నిటినీ సమానంగా చూసే నిర్మల శాంత గుణం, నిరంతర తపం, నిత్య ధ్యానం, నిజం చెప్పే గుణం... వీటితో నిన్ను మానసికారాధన చేయుదును.)

అనగా - ఈ గుణాలు ఎవరిలో వుంటాయో వారు వేరే పూజలేవీ చేయనక్కర్లేదు. తమ గుణాలద్వారానే, శివపూజ వారు చేస్తున్నట్లేనని భావం!

**1. అహింస:*

ఏ ప్రాణికీ మానసికంగా బాధ కలిగించకుండా ఉండటం.

*ఇది ప్రధమ పుష్పం.*

*మరి ఎవరికి వారు ప్రశ్నించుకోవాలి, ఇంట్లో వారిని, బయట వారిని మాటలతోనే ఎంత హింసిస్తున్నామో. అలాగే చేతలతో కూడా. జీవిత భాగస్వామి, అత్త కోడలు, అల్లుడు మామ, స్నేహితులు, ఇంకా ఎన్నో ఉదాహరణలు. ముదుసలి తల్లి దండ్రులను అలాగే పసి పిల్లలను, దూరంగా ఒంటరిగా వదిలేయడం కూడా హింసనే.

2. ఇంద్రియ నిగ్రహం:*

మనసు, ఇంద్రియాలను అదుపులో ఉంచుకోవడం. 

*ఇది రెండో పుష్పం.*

*ప్రపంచాన్ని జయించిన వారు కూడా, తమను తాము జయించలేరు అనేది ఇందుకే. ఉదాహరణ రావణాసురుడు.  

*మత్తు, తాగుతూ, బయట తిండి తింటూ, నోటికివచ్చిన విధముగా అరుస్తూన్న, అబద్దాలు చెపుతున్నా, చెడుతిరుగుళ్ళు తిరుగుతూ ఉన్నా ఇంద్రియ నిగ్రహం లేనట్టే సుమా.

3. దయ:*

కష్టాల్లో, బాధలో ఉన్న వారి యెడల దయ కలిగి ఉండటం.

*ఇది మూడో పుష్పం.*

*మంచి వారు కష్టాల లో బాధలలో ఉన్నప్పుడు, వారి బాధ విని అర్ధము చేసుకుని, వారికి కనీసము 4 మంచి మాటలు అయినా చెప్పి, భవిష్యత్ పై ఆశ కలిగించాలి. వీలైతే సహాయం చేయాలి.

4. క్షమ:*

ఎవరైనా మనకి అపకారం చేసినా, ఓర్పుతో సహించడం. 

*ఇది నాలుగవ పుష్పం.

*ఎదుటివారు తాము చేసిన తప్పులు ఒప్పుకుని, క్షమించమని అడిగితే, వారు నిజముగా మారారు అని భావిస్తే, క్షమించడం ఉత్తమ లక్షణం, ప్రతీకార ఆలోచన లేకుండా లేదా దూరంగా ఉండటం ఉత్తమం. 

 5. ధ్యానం/ శాంతి:*

ఈశ్వరుడిని నిరంతరం మనసులో తలచుకుంటూ ఆయన మీదే మనసు లగ్నం చేయడం.

*ఇది ఐదో పుష్పం.*

 *నిరంతరం ఆయన మీదనే మనసు లగ్నం చేయడం. 

వేకువనే  లేవడం, స్నానం తో పాటు, అలాగే పూజ, నడకలో, రైల్ లో, ఉద్యోగం మధ్య బ్రేక్ లో, ఎప్పుడు వీలైతే అప్పుడు నిరంతర ధ్యానంలో. దీనివలన, తప్పు చేయడానికి, భయపడతాము. ఇతరులకు కష్టం కలిగించము. ఏకాగ్రత కుదురుతుంది, మనశ్శాంతి తో ఉంటుంది.

6. తపస్సు:*

మనసా, వాచా, కర్మణా, నియమాలు పాటించడం. ఇదే తపస్సు.

*ఇది ఆరవ పుష్పం.*

*త్రికరణ శుద్ది గా మంచి నియమాలను పాటించడం, ఇదే తపస్సు. అడవికి వెళ్ళి ముక్కు మూసుకోవక్కర లేదు. చేసే పనిలో నిబద్దత నీతి నియమము ముఖ్యము.

7. జ్ఞానం:*

పరమాత్మ గురించి సరైన తెలివితో ఉండడమే జ్ఞానం.

*ఇది ఏడవ పుష్పం.*

*ప్రపంచం అంతా మిద్య. మనము అద్దెకు వచ్చిన తోలు బొమ్మలము. ఇప్పుడు చేసిన పాపాలకు, శిక్ష ఏనాటికైనా తప్పదు, మరు జన్మలో అయినా. 

నిరాకారుడు నిరంజనుడు ఒకరే. తల్లి దండ్రులను సేవించనిదే, పరమాత్మను సేవించలేము. ఈ జగత్తు లో ఏదీ మనది కాదు. 

మనము ప్రజలను మోసము చేయవచ్చేమో కానీ, పంచభూతాలను కాదు, ప్రతిదీ రికార్డు చేస్తూనే ఉంటాయి.

8. సత్యం:*

*ఇతరులకు బాధ కలుగకుండా నిజాన్ని చెప్పడమే సత్యం.*

*ఇది ఎనిమిదవ పుష్పం.*

కనీసం 75 శాతం అయినా, నిజాలు మాట్లాడుతూ, నిష్టగా ఉండటము. ఎందుకంటే, ఇప్పుడు అందరము, 10 శాతం కూడా నిజాలు చెపుతున్నామో లేదో ఎవరికీ తెలీదు. 

జీవిత భాగస్వాములు తో, తల్లి దండ్రులతో, స్నేహితులతో, ఆఫీసులో, అందరితో వీలైనన్న అబద్దాలు చెపుతూ, మన భవిష్యత్ ను మనమే మోసం చేసుకుంటున్నాము. ఎప్పుడు అయినా, అబద్దాలు, బయటకు వస్తాయి సుమా. 

ఇవీ అరుదైన, భగవంతునికి ఇష్టమైన పుష్పాలు,త్రికరణ శుద్దితో,ప్రతి నిత్యము మనము ఇవ్వాల్సిన పుష్పాలు. 

ఇతరులు దొంగిలించలేనివి, వాడిపోనివి, నటించలేనివి, బయట దొరకనివి ఇవే సుమా. 

మనము ఈ 8 ఉచిత పుష్పాల దైవ పూజ రోజూ చేస్తూ ఉంటే, మన ముదుసలి సంస్కార తల్లి దండ్రులు మనతో ఉంటారు, అలాగే మన ముదుసలి వయస్సులో,మన సంస్కార పిల్లలతో ఉంటాము. దేవుడు మనతో ఉంటాడు.

.సర్వేజనా సుఖినో భవంతు

శుభమస్తు
వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.

జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర
ACCANKSHA
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
శ్రీ విధాత పీఠం
Ph: 9666602371

No comments:

Post a Comment