Friday, 2 February 2024

 



పనులను మానివేయడం ద్వారా కార్యభారం తగ్గదు, వాటిని చాకచక్యంగా చేయడం ద్వారా తేలిక అవుతుంది.

“నీవు సంగము లేని వాడవై అనగా ఫలాపేక్షను వదలి చేయదగిన కర్మలను ఎల్లప్పుడూ చక్కగా చేస్తూ ఉండు. అసక్తుడై కర్మలను చేసే మానవుడు క్రమముగా ముక్తిని పొందుచున్నాడు.”                       

                -భగవద్గీత.

జీవితంలో సాఫల్యం పొందాలంటే కలిసికట్టుగా ప్రయత్నం చేయడం ఆవశ్యకం. అందుకై అన్ని అంగాలు సహకరించాలి. కేవలం భౌతిక సంపదలు ఉంటే సరిపోదు. జ్ఞానం కూడా దానికి తోడైనప్పుడే నిజమైన పురోగతి సాధించబడుతుంది.

మనకు హాని కలిగించే వాటి జోలికి పోరాదు. కోపం, భయం, అసూయ, అహంకారం వంటివి మనలను కృంగదీస్తాయి.

అహంకారం మానవ జీవనంలో నిర్మూలించదగిన పెద్ద లోపంగా భాసిస్తుంది. అది సంకుచిత స్వభావం నుండి అంకురిస్తుంది. వీటి నుండి బయటపడాలి. జీవితాన్ని మలిచే శక్తి మనలోనే ఉన్నదనే సంగతిని నిశ్శబ్ధ ఆలోచనలు, కార్యాచరణం ద్వారా గుర్తించాలి.

ఎన్నడూ ఈర్ష్యాసూయలకు, నిరుత్సాహాలకు లొంగకుండా ఉండడానికి ప్రయత్నం చేయాలి. శారీరక అలవాట్లూ, మనోవృత్తులు పరిపూర్ణంగా, శక్తి దాయకంగా పరిణమించడానికి ప్రయత్నించాలి. 

మన ప్రతి పనిలోనూ విశ్వాసం, చిత్తశుద్ధి ఇమిడి ఉండేలా చేసుకోవాలి. నిరాశా నిస్పృహలకు, దురదృష్టానికి అతి దూరంగా ఉండేందుకు ప్రయత్నించాలి.

.సర్వేజనా సుఖినో భవంతు
శుభమస్తు
వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.
జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర
ACCANKSHA
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
శ్రీ విధాత పీఠం
Ph: 9666602371


No comments:

Post a Comment