మొదట శాస్త్రము ఏమి తెలిపినది అను విషయములో గమనిస్తే
👉ముహూర్తదర్పణము నందు ద్వాదశకూటములు ఈవిధముగా తెలిపినది.
దినం గణంచ మాహేంద్రం స్త్రీదీర్ఘం యోనిరేవచ
రాశీరాశ్వధిపోవశ్వోరజ్జుర్వేదాతథాదశ
పునశ్చవర్ణ కూటంచ నాడీకూటం ప్రశస్యతే
ఏతేద్వాదశకూటాస్యుః కూటభేద్రాః ప్రకీర్తితాః
భావము:-1)దినకూటమి,
2)గణకూటమి,
3)మాహేంద్రకూటమి,
4)స్త్రీదీర్ఝ కూటమి,
5)యోనికూటమి,
6)రాశి కూటమి,
7)రాశ్యాధిపతుల కూటమి,
8)వశ్యకూటమి,
9)వేదాకూటమి,
10)రజ్జుకూటమి, ఇంకనూ
11)వర్ణకూటమి,
12)నాడీకూటమి చూడమని తెలిపినది. ఇందులొ బంగారు,వెండి,రాగి,ఇనుము పాదముల ప్రస్తావన తెలుపలేదు. ఏ ముహూర్త గ్రంథములో వెతికననూ దొరకదు.ఇంకనూ
👉కాలామృతగ్రంథము నందు:-
వింశతికూటములు:-
నాడీరాశీశ యోని వనితాదీర్ఘా గణశ్చాపి ష
డ్వర్గా ముఖ్యతరా వివాహసమయే శేషాస్తు మధ్యాస్తతః
1)నాడీకూటమి,
2)రాశీకూటమి,
3)రాశీఅధిపతులకూటమి,
4)యోనికూటమి,
5)వనితాదీర్ఝకూటమి,
6)గణకూటమి ఈ ఆరు ప్రధానమైనవిగా చూడమని మిగతావి మధ్యస్థమని తెలుపుతూ అవి
మాహేంద్రోగణితాయ వశ్య దివసా వర్ణోడువిద్ధాండజా
రజ్జుర్యోగినిలింగభూతశశియుగ్గోత్రాహ్వయా వింశతిః
7)మాహేంద్రకూటమి,
8)వశ్యకూటమి,
9)దినకూటమి,
10)జాతికూటమి,
11)వేధాకూటమి,
12)పక్షికూటమి,
13)రజ్జుకూటమి,
14)యోగినికూటమి,
15)లింగకూటమి,
16)భూతవర్గుకూటమి,
17)చంద్రయోగకూటమి,
18)గణితవర్గుకూటమి,
19)ఆయవర్గుకూటమి,
20)గోత్రవర్గుకూటమి.
ఇందులో కూడ బంగారు,వెండి,రాగి,ఇనుము పాదములు ప్రస్తావన తెలుపలేదు.
బంగారు,వెండి,రాగి,ఇనుముపాదములు గురించి ఎక్కడ ఉన్నది. గోచారవిషయములో గ్రహమూర్తి నిర్ణయమువో వీటి గురించి ఉన్నది. 👉
జన్మఋక్షే రాజేశ్చ గ్రహప్రవేశకాలోడు రాశౌ
యదిచారజంచ రుద్రేరసే జన్మని హేమమూర్తి
శ్శుభంక రాజేషు రాజితశ్చ సచాద్రి దిగ్వహ్నిషు
తామ్రమూర్తిః కష్టం గజార్కాబ్దిషు కౌహితస్య
మనము ఉగాది రోజునుంచి సం!!ర ఫలము ఎలా వుంటుందో పైశ్లోకభావము ఈవిధముగా ఉన్నది.
రవి మొదలు నవగ్రహములు ఒకరాశినుండి మరియొకరాశికీ మారునపుడు ఆరాశినిప్రవేశించుకాలమునందు గల నిత్యనక్షత్రము ఏదియగునో పంచాంగము ద్వారా తెలుసుకుని, జాతకుని జన్మరాశిమొదలు నిత్యనక్షత్రరాశి వరకూ లెక్కపెట్టగా 1,6,11రాశులలో ఉన్నచో సువర్ణమూర్తి(బంగారుపాదము)అనగా శుభఫలితములను ఇచ్చునని, 2,5,9రాశులలో ఉంటే రజితమూర్తి(వెండిపాదము)అనగా శుభఫలితములను ఇచ్చునుఅని,
3,7,10 రాశులలో ఉన్న తామ్రమూర్తి(రాగిపాదము)అనగాచెడుఫలితములను ఇచ్చునని,
4,8,12 రాశులలో ఉన్న లోహమూర్తి(ఇనుముపాదము) అనగా చెడుఫలితములను ఇచ్చును అని సంవత్సరఫలితములుగా చెప్పవలెను.
మరి అబ్బాయి లక్ష్ముమయ్య కావున బంగారు పాదము అయ్యాడు-అమ్మాయి నాగమ్మ ఇనుముపాదము అయింది కాబట్టి పనికిరాదని లక్ష్మీ అని పేట్టండి బంగారుపాదమౌతుంది అని చెప్పడము నేడు సర్వసాధారణం ఇదీ శాస్త్ర విరుద్ధమైన అంశము.
అదే అబ్బాయి బంగారుపాదమై అమ్మాయి రాగిపాదమైతె కలిసిపోతాయని, లేదా అబ్బాయి వెండిపాదమై, అమ్మాయి ఇనుము పాదమైతె కలిసిపోతాయని గుణాలు 18పైనె వచ్చాయని సూపర్ అని తెలుపుటకూడ అపహాస్యమే. కారణము బంగారులో రాగి కలవాలన్న కొన్ని రసాయన ప్రక్రియలద్వారా జరుగుతుంది. మన ఇది ఎలా ప్రచారములోనికి వచ్చింది.మన అనంతపురంజిల్లా మరియు సత్యసాయిజిల్లా అంతయు ఎక్కువగా ముక్తేశ్వర పంచాంగము వాడుకలో ఉండుటవలన అందులో వారు గుణమేళనము అనుపట్టికలో నక్షత్రాలవారిగా బంగారు, వెండి, రాగి, ఇనుము పాదములు అని ఇచ్చుట వలన వచ్చిన ఇబ్బందులు. మరి వారు ఎలా ఇచ్చారు. ఇక్కడే పంచాంగ వాడుతున్న వారు సదరు పంచాంగ కర్త హెడ్డింగ్ లైన్ గా పాణిగ్రహణోపయోగ పంచకూట ప్రసూతి రజస్వలా శాంతి నక్షత్ర విమర్శన చక్రము అని స్పష్ఠముగా తెలిపారు. అంటే గుణమేళనములో పాణిగ్రహణ ఉపయోగముగా పంచకూటములు నక్షత్రములవారిగా-1)గణము-2)నాడీ-3)యోని-4)రాశిని మరియూ 5)రాశ్యాధిపతులను పరిగణలోనికి తీసుకుని వధూ-వరులకు గుణమేళనము నిర్ణయించండి అని మరీయు సం!!రఫలితాలు గ్రహములు ప్రవేశముతో నక్షత్రముల వారిగా ఇచ్చిన బంగారు,రాగి,వెండి,ఇనుము పాదములుగా గుర్తించి గోచార ఫలితాలు తెలుపండి అనివారు చెప్పారు. ఈవిషయము తెలియక సదరు పంచాంగకర్త వ్రాసిన అంశము తెలుసుకోకుండా- తాము శాస్త్రము చదువుకోకుండా, శాస్త్రశోధన చేయకుండా తాము చేయు దోషములను సదరు పంచాంగకర్త ఇచ్చారని ఆపాదన చేయడము కడు విచారణీయము.
No comments:
Post a Comment