Thursday, 1 February 2024

కుక్కే సుబ్రహ్మణ్య – నాగదేవత నివసించే ప్రదేశం


🌿🌼🙏నాగదోష పరిహారం చేయించుకోవాలను కుంటున్నారా?!. మీ అనుకూలాన్ని బట్టి ఈ ఆలయాన్ని సందర్శించండి. మహిమాన్విత మైన శ్రీ కుక్కీ సుబ్రహ్మణ్య స్వామి వారి అనుగ్రహాన్నీ పొందండిక.🙏🌼🌿

🌿🌼🙏కుక్కే శ్రీ సుబ్రమణ్యేస్వామి వారి గుడి KUKKE SREE SUBRAMANYA Temple నాగదోష పరిహారములకు చాలా ప్రసిద్ధమైనది. ఇక్కడ ప్రధానముగ సర్పహత్యదోషం, ఆశ్లేష బలి పూజ మరియు నాగ ప్రతిష్ట పూజలు చాలా నిష్టగ నిర్వహిస్తారు. ఇక్కడ గుడిలో నాగదోష పరిహారములు చేసుకుంటే వారికి జీవితంలో ఎటువంటి భాదలు లేకుండా మంచి సంతానం కలిగి సుఖసంతోశాలతో జీవిస్తారు అని పురాణ గాధలలో ఉంది.🙏🌼🌿

🌿🌼🙏కర్ణాటకలోని మంగళూరు దగ్గరలోని సుల్లియా అనే ఊళ్ళో కుక్కే సుబ్రమణ్య దేవాలయం వుంది. సుబ్రహ్మణ్య స్వామిని ఇక్కడ నాగ దేవతగా ఆరాధించడం విశేషం. ఇది ఒక ప్రసిద్ధ యాత్రా స్థల౦ – ఇక్కడి క్షేత్ర గాధ కూడా యాత్రికుల్ని ఇక్కడికి ఆకర్షిస్తుంది.🙏🌼🌿

🌿🌼🙏ఆలయ స్థలపురాణం🙏🌼🌿

🌿🌼🙏ఎన్నో వేల సంవత్సరాల చరిత్ర కలిగిన మన దేశంలో ఎన్నో దేవాలయాలు వెలిశాయి. వాటిల్లో కొన్ని ఆలయాలను భక్తులు, రాజులు, వంశస్థులవారు దేవుడిపై భక్తిని చాటిచెప్పేందుకు నిర్మించగా.. మరికొన్ని దేవాలయాల్లో దేవతలు స్వయంభువులుగా వెలిశారు. అలా వెలిసిన దేవాలయాల్లో కుక్కే సుబ్రహ్మణ్య స్వామి ఆలయం ఒకటి. కుమారస్వామి (సుబ్రహ్మణ్యేశ్వరస్వామి, కార్తికేయుడు) కి నిలయమైన ఈ క్షేత్రం ‘పరశురామ’ క్షేత్రాలలో ఒకటి.🙏🌼🌿

🌿🌼🙏ఈ ఆలయం ప్రాకృతిక సౌందర్యారాలు వెలువరించే కర్ణాటక రాష్ట్రం, దక్షిణ కన్నడ జిల్లాలో మంగళూరుకు 100 కి.మీ.ల దూరంలో కుమార పర్వతశ్రేణుల మధ్య ధారా నది ఒడ్డున ఉన్న గ్రామం ’సుబ్రహ్మణ్యం’లో వుంది. పూర్వం ఈ గ్రామాన్ని ‘కుక్కే పట్నం’ అనే పిలిచేవారు. క్రమంగా ఇది ‘కుక్కె సుబ్రహ్మణ్య’గా ప్రాచుర్యంలోకి వచ్చింది. సుబ్రహ్మణ్య ఆలయం గురించి ‘స్కాందపురాణం’లో సనత్‌కుమార సంహితలోని సహ్యాద్రికాండలోని తీర్ధక్షేత్రమహామణి పురాణంలో తెలుపబడింది.🙏

సర్వేజనా సుఖినో భవంతు
శుభమస్తు

వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.

జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర
ACCANKSHA
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
శ్రీ విధాత పీఠం
Ph: 9666602371

No comments:

Post a Comment