Tuesday, 6 February 2024

రామాయణమ్.8

 



రాముడికి ఎవరు సహాయం చేస్తారు?

.మీరంతా రావణ సంహారం జరగాలని కోరుకున్నారు . విష్ణువు దశరధమహారాజు కొడుకుగా జన్మించాడు ,మరి రావణుని తో జరిగే పోరాటంలో ఎవరు పాల్గొంటారు? 

.ఆయన సైన్యం ఎవరు? విష్ణువుకు సైన్యసహకారం ఎవరిస్తారు? 

ఆందరు దేవతల మదిలో ఈ ఆలోచన పుట్టించి వారిని ప్రేరేపించాడు బ్రహ్మదేవుడు .

.ఒకప్పుడు రావణాసురుని నందీశ్వరుడు శపించాడు!

నీకు వానరుల(కోతుల)వలన భయం కలుగుగాక ! అని

.ఈ శాపాన్ని తమకు వరంగా మార్చుకోవాలనుకున్నారు ! దేవతలంతా!.

.దేవతలంతా వానర స్త్రీల యందు మహాబలశాలురయిన పుత్రులుగా జన్మించారు! 

.అంతకుఎన్నో ఏళ్ళ  పూర్వమే జాంబవంతుడు బ్రహ్మదేవుడి ఆవులింతనుండి జన్మించాడు.

.ఋషులు,సిద్ధులు,విద్యాధరులు,ఉరగులు,చారణులు  దివ్యశక్తులు కలవారంతా తమతమ కుమారులుగా వీరాధివీరులైన వానరులను సృజించారు.

.దేవేంద్రుడు వాలిని,

 సూర్యుడు సుగ్రీవుని, 

దేవగురువు బృహస్పతి తారుడు అనే బుద్ధిశాలి అయిన వానరుడిని,

కుబేరుడు ; గంధమాధనుని

విశ్వకర్మ : నలుడిని

అగ్ని : నీలుడిని

అశ్వనీ దేవతలు : మైంద ,ద్వివిదులను

వరుణుడు : సుషేణుడిని

పర్జన్యుడు: శరభుని

వాయుదేవుడు ,శ్రీమంతుడు,వీర్యవంతుడు,వజ్రమయ దేహముగలవాడు,గరుత్మంతునితో సమానవేగము గలవాడు ,శత్రుభయంకరుడు అయిన హనుమంతుని సృజించాడు.

.ఏ దేవుడికి ఏ రూపము,ఏ వేషము ,ఏ పరాక్రమము ,ఏ తేజస్సు ఉండెనో ముమ్మూర్తులా అవే లక్షణాలతో అనేక కోట్ల వానరులు జన్మించారు!.

.ఈ వానరులంతా కూడా అమితబల సంపన్నులు !

యుద్ధంలో పెద్దపెద్ద కొండల వంటి రాళ్లు శత్రువుల మీద విసిరివేయగలరు,మహా వృక్షాలు వేళ్ళతో సహా పెకిలించి వైరివీరులను చావచితక కొట్టగలరు!

సముద్రాలను కలియబెట్టగలరు,భూమిని నిట్టనిలువుగా చీల్చివేయనూగలరు!

అరణ్యాలలో స్వేచ్చగా తిరిగే మదగజాలను ( ఏనుగులు) పిల్లిపిల్లల్లా చంకనవేసుకొని తిరుగగలరు!

వారి సింహనాదాలకు ముల్లోకాలు కూడా కంపించి పోతాయి!

.ఇలాంటి లక్షణాలున్న వానరవీరులంతా రామసహాయార్ధము భూమినిండా జన్మించి ఉన్నారు!.

.అక్కడ అయోధ్యలో రాముడు శుక్లపక్ష చంద్రునివలే దినదిన ప్రవర్ధమానమవుతున్నాడు! ఆయన చేసే అల్లరికి అంతేలేకుండా ఉన్నది ! ఆయన ఏమిచేసినా ఆ తండ్రికి మురిపెమే  !

రారా  నారామా ! అని గుండెలమీద కొడుకుని పరుండపెట్టి అంత పెద్ద మహారాజు తాను కూడా చిన్నపిల్లవాడై వయసుమరచి,రాజునని మరచి కొడుకుతో ఆటలు ,పాటలు.

.రాముని విడిచి ఒక్క క్షణముండలేని మరో ప్రాణి కూడా ఉంది అయోధ్య లో ! ఎవరో కాదు లక్ష్మణస్వామి ఆయన ! 

రాముడి నీడ ఎలా ఉంటుంది ? అని అడిగితే ఇదిగో ఇలా ఉంటుంది అని లక్ష్మణుడి వైపు వేలెత్తి చూపటం అలవాటు చేసుకున్నారు అయోధ్యానగరవాసులు!

ఇక అన్నగారికి తమ్ముడంటే పంచప్రాణాలు సౌమిత్రి ప్రక్కనలేనిదే ఈయనగారు ఏ పనీ చేయరు ! అన్నం తినడు! ఆఖరుకు నిద్రపోవాలన్నా ప్రక్కన తమ్ముడు ఉండవలసినదే! 

అదేవిధంగా మరొక జంట భరతశత్రుఘ్నులు 

ఇలా నలుగురు కుమారులు ఆయన ఆనందాన్ని పెంపొందిస్తూ ఉండగా కాలం ఎలా గడచిపోతున్నదో తెలియరావటం లేదు దశరధమహారాజుకు!.

.ఆ కుమారులు నలుగురూ కూడా ధనుర్విద్యలో అపారపాండిత్యం సంపాదించారు,వేదవేదాంగాలు వారికి కరతలామలకం!

తల్లిదండ్రులను,పెద్దలను సేవించటంలో వారితరువాతనే ఎవరైనా,

సకలసద్గుణాలతో శోభిల్లే వరాల మూటలు దశరధతనయులు!.

.కాలమిలా గడుస్తుండగా ఒకరోజు!

సర్వేజనా సుఖినో భవంతు
శుభమస్తు

వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.

జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర

ACCANKSHA YEDUR
(
M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
శ్రీ విధాత పీఠం
Ph: 9666602371

No comments:

Post a Comment