Tuesday, 6 February 2024

దేవుడు అడగని ప్రశ్నలు !

 


               

*మీ ఇంటిగదులు ఎంతవిశాలమైనవి అని దేవుడు అడగడు.

*నువ్వెంతమందిని విశాల హృదయం తో  నీ ఇంటికి ఆహ్వానించావు అని అడుగుతాడు.

*నీది ఎన్ని అంకెల జీతం? అని దేవుడు అడగడు.

*నీ సంపదలో ఎంత నిజాయితీ వుంది? అని అడుగుతాడు.

*నీవు ఎంత గొప్ప పరిసరాలలో నివసిస్తున్నావు? అని అడగడు.

నువ్వు నీ ఇరుగుపొరుగు వాళ్లతో ఎలా మెలుగుతున్నావని అడుగుతాడు .

నీవు ఎంత ఘనమైన పిండి వంటలతో భోజనము చేస్తున్నావని దేవుడు అడగడు .

నీవు ఎంతమంది అన్నార్తుల ఆకలి తీర్చావని అడుగుతాడు .

నీ అలమరాలో ఎన్ని జతల బట్టలు ఉన్నాయని దేవుడు అడగడు .

నీవు ఎంతమంది నిర్భాగ్యులకు బట్టలిచ్చి చలి బాధ తీర్చావని అడుగుతాడు .

నువ్వెన్ని అధ్యాత్మిక గ్రంథాలు చదివావు? అని దేవుడు అడగడు .

నీవు చదివిన పుస్తకాలలో నువ్వెంత సారాన్ని గ్రహించావు? అని అడుగుతాడు .

నీవు ఎన్ని పుణ్య క్షేత్రాలు దర్శించావని దేవుడు అడగడు .

నీవు ఎంత మానవ సేవ చేసావని అడుగుతాడు .

నీవు ఎంత ఆనందకరమైన జీవితాన్ని గడుపుతున్నావని దేవుడు అడగడు .

ఇంకొకరికి సహాయపడటంలో ఎంత ఆనందముందో అనుభవించి మాటాడు అంటాడు .

ముక్తి పధమునకు ఇంత ఆలశ్యం చేసామేమని దేవుడు అడగడు .

నీవు రాగానే నీ చెయ్యి పట్టుకొని స్వర్గ ధామమునకు తానే తీసుకు వెళ్తాడు

సర్వేజనా సుఖినో భవంతు
శుభమస్తు

వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.

జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర

ACCANKSHA YEDUR
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
శ్రీ విధాత పీఠం
Ph: 9666602371

No comments:

Post a Comment