మనం జన్మ జన్మలుగా సంపాదించుకున్న పుణ్య ఫలాలన్నీ ఏ జన్మలో ఎలా తుడిచిపెట్టుకు పోతాయో ఎవరికి తెలియదు, అందు కోసం చేసుకున్న పుణ్యాన్ని చూసి మురుసి పోవడం వద్దు, అహంకార మమ కారాలకు దూరంగా ఉండి, అంత భగవదేచ్ఛ అని ఆయనకే అర్పితం చేయడం నేర్చుకోవాలి. అప్పుడే ఈ మానవ జీవితంలో సుఖశాంతులు మిగులుతాయి.
భూమి మీద
పడినప్పటినుండి భూమిలో కలిసేంత వరకు అనుక్షణం జాగ్రత్తలో ఉండాలి. ఏ ఆధ్యాత్మిక కధ విన్నా గజేంద్ర మోక్షము కాని, ఏ కధైనా మనకర్మ ఫలమే. నవ్వులో గానీ, మాటలాడుటలో గానీ, అతి జాగ్రత్తవహించాలి. గతాన్ని ఏమీ చేయలేకపోయినా ఇప్పటినుండి జాగ్రత్తగా వ్యవహరించాలి.
🐂🐂🐂🐂🐂
గోశాలలు దేవాలయముగా- గోమాతను దేవతగా పూజించాలి.
No comments:
Post a Comment