🔯'నరుని కంటికి నల్లరాయి కూడా పగలును' అనేది ఒక నానుడి. అవును.. నరుని దృష్టిలో అతనికే తెలియని దుష్ట అగ్ని శక్తి వుంటుంది. అందుకే దేవాలయం ప్రతిష్ఠ జరిగిన తర్వాత దేవతా మూర్తిని ముందుగా భక్తులకు అద్దంలో దర్శించిన తర్వాతే నిజ దర్శనం చేయిస్తారు.
🔯నర దృష్టి అభివృద్ధిని చిన్నాభిన్నం చేసి బాధలకు గురి చేయును. ఈర్ష్య, ఆసూయ, ద్వేషాదులు మనిషి అభివృద్ధిని కుంటుపడేలా చేయును. ఈ నరఘోష యంత్రం ధరించిన వారికి పది దిక్కుల యందు ఎవరు ఏ దిక్కు నుంచి ఘోచించిన దిష్టి తగలకుండా కాపాడును. వారి కను దృష్టి తిరిగి వారి వద్దకే పోయేలా చేయును.
🔯ఈ యంత్రంలో ఉండే పది త్రిశూలాలు, పది దిక్కుల నుంచి వచ్చే నరఘోషను, దిష్టి దోషాన్ని, ప్రయోగ దోషాలను, ఈర్ష్య, అసూయలను పారద్రోలుతుంది. అష్ఠదిక్పాలకులు అనుగ్రహం కలుగ చేసి, మట్టిలో నుంచి దోషాలను హరించి ఆయుర్థాయము, ఇంటికి పూర్వ వైభవం చేకూర్చును.
🔯గృహంకు ప్రవేశ ద్వారం ఎదురుగా నరఘోష యంత్రం ఉంటే.. అది నరఘోష లేదా నరదృష్టి నుంచి వచ్చే అనార్థాలను, అడ్డంకులను ఇంటి బయటకే పంపించి వేస్తుంది. ఈ యంత్రం ఫలం గాలి, చీడ, పీడ సమస్త ప్రయోగ దోషాలను హరించి, ఆరోగ్యం ప్రశాంతతను చేకూర్చును.
No comments:
Post a Comment