సద్గుణములు - స్తుతి 1
ఈ భూమియందు ఏ జీవులయందు ప్రసిద్ధము లైన గుణములైనను నారాయణుని అంతర్యామి లక్షణములే గాని ఆ వ్యక్తులవి కావు. ఒకరి నొకరు చూచి గుణవంతులని భ్రమపడుట సహజము.
అట్లుకాక ఈ సద్గుణము లన్నియు నరులలోని అంతర్యామివని తెలిసినపుడు నిజముగా వానిని స్తుతింపనే లేరు. ఆ సద్గుణములు స్తుతుల కందునవి కావు. ...
సద్గుణములు - స్తుతి 2
ఒకరినొకరు స్తుతించునపుడు ఆశించునది ప్రయోజనములనే గాని సద్గుణములను గాదు. ఇట్టి అభ్యాసము సంసార బద్ధులగు ప్రవృత్తి జనులచే చేయబడును.
నివృత్తి మార్గము నవలంబించు మోక్షజీవులు చేయు స్తోత్రములు వ్యక్తుల కన్వయింపవు. ఒకరితో నొకరు భక్త్యాదర సంభాషణములు చేసినను దైవభావనతో మాత్రమే కూడి యుండును. వారికి నిజమైన సద్గుణాదర ముండును. ఆ గుణములు అంతర్యామి యొక్క వైభవములని తెలియును, ఈవిధముగా నరజాతిలో రెండు విధములైన స్తోత్రములు చెల్లును.
సద్గుణములు - స్తుతి 3
ఎవరైన మహాత్ముల యందు కనిపించు సద్గుణములు మరియొకరు అభ్యసించి అలవడజేసికొనినను అలవరచుకొను వానిని పొగడవలసిన ఆవశ్యకతలేదు. కారణమేమనగా నెవనిని జూచి యీ సద్గుణములను అలవరచుకొంటిమో అవి ఆ మహాత్మునివేగాని మనవి కావు.
మరియొక విషయము. ఎవరైన చదువుకొనిన వాడని వానిని పొగడవచ్చునా యన్నచో నట్లును పొగడరాదు. శాస్త్రాదులను చదివి చదువుల నార్జించినచో విద్య, తపస్సు మొదలగునవి యలవడునని నమ్మరాదు. అది అసత్యము. ఎవడైన శాస్త్రాభ్యాసముచేసి తనకు విద్యగాని, తపస్సుగాని కలిగినదని, యితరులు గౌరవింపవలెనని యభిప్రాయపడినచో సభ్యులగు పెద్దలు వానిని జూచి నవ్వుకొందురు. ఈ రహస్యము దుర్బుద్ధియగు వానికి తెలియదు.
సద్గుణములు - స్తుతి 4
సద్బుద్ధి కలవానికి శాస్త్రాదుల నభ్యసించుట సహకరించును గాని, దుర్బుద్ధి యగు వానికి అవే శాస్త్రాదులు అహంకారాది దుర్గుణములను వృద్ధిచేయును. కనుక దుర్బుద్ధి యగువాడు చదువుల వలన తనకు విద్య యబ్బినదని భ్రమపడి యితరులు గౌరవింపవలెనని ఎదురుచూచుటయు, గౌరవింపనిచో కోపతాపాదులు చెందుటయు కలుగును.
సర్వేజనా సుఖినో భవంతు
శుభమస్తు
వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.
జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర
ACCANKSHA
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
శ్రీ విధాత పీఠం
Ph: 9666602371
No comments:
Post a Comment