Monday, 5 February 2024

రామాయణమ్ 7.

 


యజ్ఞము పరిసమాప్తమయ్యింది, సరిగ్గా పన్నెండు మాసాలకు మరల వసంతం వచ్చింది! దశరధమహారాజు జీవితములో ఈ వసంతం ఒక్క కొత్తశోభ తెచ్చింది . మోడువారిన జీవిత ఆశ చిగుర్చింది.

దశరధుడి మనోరధం నెరవేరింది!

 .చైత్రమాసంలో నవమి తిధి ,పునర్వసు నక్షత్రం , అయిదు గ్రహాలు తమతమ ఉచ్ఛస్థితిలో ఉండగా! .

.అప్పుడు రవి మేషంలో ఉన్నాడు 

కుజుడు మకరంలో ఉన్నాడు

గురుడు కర్కాటకంలో ఉన్నాడు

శుక్రుడు మీనంలో ఉన్నాడు

శని తులా రాశిలో ఉన్నాడు 

ఆయా రాశులన్నీ కూడా ఆయా గ్రహాలకు ఉచ్ఛస్థానాలు!.

చంద్రుడు స్వస్థానమైన కర్కాటకంలో ఉన్నాడప్పుడు!

 అంటే పునర్వసు నాల్గవపాదం! అన్నమాట!

గురుచంద్రయోగం సంభవించింది!

లగ్నముకూడా కర్కాటకమే!

ఆ శుభలగ్నమందు కౌసల్య జగత్కల్యాణ కారకుడు,జగన్నాధుడు,ఇక్ష్వాకు వంశ వర్ధనుడు అయిన శ్రీ రామచంద్రుని పుత్రునిగా కన్నది!..

.శ్రీ రామ జననమయిన పదహారు గంటల తరువాత  భరతుడు మీనలగ్నంలో కైకేయికి జన్మించాడు !ఆయన నక్షత్రం పుష్యమి!

.ఆ తరువాత మధ్యాహ్న కాలంలో కర్కాటక లగ్నంలో ఆశ్లేషా నక్షత్రంలో లక్ష్మణ,శత్రుఘ్నులకు జన్మనిచ్చింది సుమిత్ర!

.రాజ్యమంతా కోలాహలం ,ఉత్సవాలు ,సంబరాలు ,రాజు ఇచ్చే భూరిదానాలతో పదకొండురోజులు గడిచినాయి! .

.పదకొండవరోజున నవజాతశిశువులకు నామకరణం జరిగింది.

.ఆయన పుట్టి దశరధుడికి మహదానందం కలుగచేశాడు జనులందరికీ సంతోషం కలుగచేశాడు! 

ఎవనియందయితే సర్వజనులకు ఆనందం కలుగుతుందో! అతడే రాముడు ,రమింపచేయువాడు అని అర్ధం పెద్ద కుమారుడికి "రాముడు " అని పేరు పెట్టారు వసిష్ఠ మహర్షి!.

.సంపద,శోభ కలవాడు కావున లక్ష్మణుడు ! 

.రాజ్యమును భరించువాడు కావున భరతుడు!

.శత్రువులకు సింహస్వప్నము ,వారిని చంపువాడు కావున శత్రుఘ్నుడు! .

.నలుగురు కుమారులను చూసుకొని దశరధుడు మురిసిపోతున్నాడు ఆయన ఆనందానికి అవధులు లేవు.

రాముడంటే మరీ! ఆయన అన్నిప్రాణాలూ రాముడే!

..సర్వేజనా సుఖినో భవంతు

శుభమస్తు

వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.
జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర

ACCANKSHA YEDUR

(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
శ్రీ విధాత పీఠం
Ph: 9666602371

No comments:

Post a Comment