Sunday, 4 February 2024

రామాయణమ్.. 6

 


దేవతల బాధలు చెప్పనలవిగాకుండా ఉన్నవి ,

.వాడు! రావణాసురుడు!  వరగర్వితుడై ముల్లోకాలను పట్టి పీడిస్తున్నాడు ! .వాడి పీడ వదిలించుకొనే మార్గం తెలియక  యమయాతన పడుతున్నారు దేవతలు. 

.చివరకు వారందరూ కలసి నిర్ణయించుకొని వాడికి వరములిచ్చిన విధాతనే ప్రార్ధింప నిశ్చయించుకొని ఆయన వద్దకు వెళ్ళి అంజలి ఘటించి నిలిచి తాము వచ్చిన పని ఆయనకు ఎరుక పరచినారు! 

.దేవా! రావణాసురుడు బలదర్పితుడై ,వర గర్వముతో నీచే ఏర్పరుపబడిన మా మా విధులు కూడా నిర్వర్తించనీయకుండా మమ్ములను భయభ్రాంతులకు గురిచేయుచున్నాడు !

.సూర్యుడు ఆతనికి వేడికలిగించలేడు!,వాయువు ఆతని ప్రక్కన మసలటానికే భయపడుతున్నాడు! ఉత్తుంగ తరంగలాతో తీవ్రఘోషతో నిత్యం సందడిగా ఉండే సముద్రుడు తరంగాలను స్తంభింపచేసుకొని కూర్చున్నాడు!

.అంత బ్రహ్మదేవుడు దేవతలను విష్ణుమూర్తిని ప్రార్దించమని సలహా ఇవ్వగా ,అందరూ ఆ దేవాధిదేవుని శరణుజొచ్చి దీనముగా ప్రార్దించిరి.

. అప్పుడు విష్ణుమూర్తి.... తాను మానవ రూపంలో జన్మించి వాడి పీడనుండి మిమ్ములను కాపాడతానని అభయమిచ్చినాడు. తాను రాబోయే రోజులలో దశరధమహారాజు కు పుత్రుడు గా జన్మిస్తానని చెప్పి వారిని పంపివేశాడు.

.అదే సమయములో దశరధమహారాజు సంతానార్ధియై అశ్వమేధము పూర్తిచేసి పుత్రేష్ఠి చేస్తున్నాడు .

.అప్పుడు యజ్ఞకుండమునుండి ఒక తేజోమయమైన భూతము ఆవిర్భవించింది. ఆ భూతము చేతిలో ఒక స్వర్ణపాత్ర ! అందులో పాయసమునిండి వున్నది! 

.ఆ భూతము ఆ పాయసపాత్రను దశరధుడికి అందచేసింది. భార్యలచేత ఆ పాయసాన్ని సేవింప చేశాడు దశరధుడు!

.మొదట సగము కౌసల్యకు , ఆ సగములో సగము అనగా మొత్తములో నాల్గవ వంతు సుమిత్రకు ,ఆ నాల్గవ వంతులో సగము అనగా మొత్తములో ఎనిమిదవవంతు కైకకు ఇచ్చి ,ఇక మిగిలిన ఎనిమిదవ వంతును రెండవసారి సుమిత్రకు ఇచ్చినాడు.

(రావణుడు ప్రకృతిని నాశనం చేస్తున్నాడు అని అర్ధం ,

దేవతలు అనగా ప్రకృతి శక్తులు !  నిత్యమూ వ్యాపించే గుణమున్న ఒకానొక శక్తి వాటి సమతుల్యాన్ని కాపాడుతుంది! అది విష్ణుస్వరూపము! ఎప్పుడెప్పుడు ప్రకృతి తన సమతుల్యాన్నిBalance కోల్పోతుందో! అప్పుడప్పుడు సర్వవ్యాపకమైన మహాశక్తి తనను తాను సృజించుకొని ప్రకృతిని కాపాడుతుంది . ఇది ధర్మము! 

.Today's civilization is a replica of RAAVAN culture! It is eating into the vitals of nature ,

.To strike a balance between all natural forces the GOD ALMIGHTY incarnates himself . 

The form he assumes need not be that of human . 

Any form of life it may take! ....అందుకే భారతీయ పురాణాలలో అన్ని అవతారాలు)

వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.

జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర
ACCANKSHA
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
శ్రీ విధాత పీఠం
Ph: 9666602371

No comments:

Post a Comment