.
ఈ లోకములో ఏ ఏ అస్త్రములు అయితే వున్నవో అవి అన్నియు విశ్వామిత్రుని వద్ద ఉన్నవి .
.అస్త్రములు అన్నీ కూడా భృశాస్వుని పుత్రులు .
భృశాస్వుడు ఒక ప్రజాపతి ,ఆయన దక్షప్రజాపతి కూతుళ్ళు జయ,సుప్రభలను వివాహమాడి కన్న సంతానమే అస్త్రములు!
వీటిని విశ్వామిత్రుడు పొందుతాడు!
.అంతేకాదు విశ్వామిత్ర మహర్షికి గల అస్త్ర పరిజ్ఞానము అపారము (guided missiles).
ఈయన క్రొత్త అస్త్రములు ఎన్నింటినో పుట్టించగలడుకూడా ! .
.(శస్త్రము అంటే మామూలుగా గాయం చేసేది!
అస్త్రము అంటే మంత్రపూర్వకముగా ప్రయోగించేది! .
bullet కు intercontinental ballistic missile కు ఉన్నంత తేడా అన్నమాట).
.ఓ దశరధమహారాజా, విశ్వామిత్ర మహర్షి అమిత మేధోసంపన్నుడు! అతులిత పరాక్రమవంతుడు! ,ఆయన తన యాగసంరక్షణము తానే చేసుకోగల సర్వసమర్ధుడు! .
.ఆయన అడుగుతున్నాడు నీ రాముడి ని పంపమని!
ఆయనవెంట వెళితే రామునకు మేలుకలుగుతుంది! మహర్షి ఉద్దేశ్యము అదే ! రాముడెవరో సంపూర్ణముగా తెలిసిన మహాజ్ఞాని ఆయన!
.నీవు మనసులోని భయసందేహాలన్నింటినీ తొలగించుకొని రామచంద్రుని ఆయనవెంట పంపు సకల శుభాలు ఒనగూరుతవి!.
.కులగురువు మాటలు విని దశరధుడి శరీరం ఉప్పొంగింది!
రాముని మహర్షివెంట పంపటానికి సంతోషంగాఒప్పుకొన్నాడు!.
.స్వయముగా వెళ్ళి రామలక్ష్మణులను తీసుకొని వచ్చి ఒక్కసారి తన ప్రియపుత్రుని శిరస్సుముద్దిడుకొని ,మహర్షి చేతిలో పెట్టాడు ! .
.మూపున విల్లమ్ములు ధరించి రాముడు,లక్ష్మణుడు మహర్షిని అనుసరించారు .
.బ్రహ్మదేవుడు ముందువెడుతుండగా వెనుక ఇద్దరు అశ్వనీదేవతలనుసరించినట్లుగా కనపడుతున్నారు వారివురూ చూపరులకు!.
.బాటలు నడిచారు,పేటలు గడిచారు నడుస్తూనే ఉన్నారు మహర్షి వెనుదిరిగి చూడలేదు.
ఆ విధంగా మొదటిసారి నగరువిడచి దుర్గమారణ్యాలలో కాలుమోపాడు కోదండపాణి సోదరసమేతుడై!.
.అలా చాలా దూరం నడచిన తరువాత తనలోని ప్రేమంతా మాటరూపంలో బయలుపడేటట్లుగా "రామా" అని అత్యంత మధురంగా పిలిచాడు మహర్షి! .
.అప్పటిదాకా ఆయన వెనుదిరిగిచూడలేదు, చూస్తే రాముని మధురమోహనరూపం కట్టిపడేస్తుంది, ముందుకు సాగనీయదు అనే భయం వల్లనేమో బహుశా!
.సరయూనదీ దక్షిణతీరం చేరారు ! ఆ నది ఒడ్డున కాసేపు ఆగి నాయనలారా ఆచమనం చేయండి ! మీకు కొన్ని మంత్రములను ,"బల,""అతిబల "అను విద్యలను ఉపదేశిస్తాను! స్వీకరించండి!
.ఈ విద్యలెటువంటివి అంటే! ఇవి తెలుసుకొన్న తరువాత నీకు శ్రమగానీ,జ్వరముగానీ,రూపములో మార్పుగానీ సంభవించదు!
నీవు నిద్రపోయినప్పుడుగానీ ,ఏమరపాటుగా ఉన్నప్పటికీ కూడా రాక్షసులు నిన్నేమీ చేయజాలరు!
.రామా !బాహుబలములో నీతో సమానుడు
మూడులోకములలో ఎవడునూ లేడు ఇకముందు ఉండడు!
రామా! సౌందర్యము,సామర్ధ్యము, జ్ఞానము బుద్ధినైశిత్యములలో నీతో సరిసమానుడు ఈ లోకములో ఉండడు!.
.ఈ విద్యలు బ్రహ్మదేవుని పుత్రికలు!
.అంత శ్రీరాముడు శుచియై,శుద్ధాంతరంగుడై,ఆ మహర్షి నుండి విద్యలను ఆనందంగా స్వీకరించాడు!
.సర్వేజనా సుఖినో భవంతు
No comments:
Post a Comment